Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయిబాబా వద్దకు తమ సందేహాలు తీర్చమని అనేకులు వచ్చేవారు. ఒకొక్కరికి ఒకొక్క విధంగా సందేహాలను తీర్చేవారు సాయి.
గౌతమ బుద్ధుడిని మౌలింగ పుత్రుడు కలుసుకున్నాడు. కలుసుకున్న క్షణం నుండి మౌలింగ పుత్రుడు తన సందేహాలను విరామం లేకుండా చెబుతూనే ఉన్నాడు.
అలా అరగంట గడిచింది. బుద్ధుడు మౌనంగా వింటున్నాడు. చిరునవ్వు నవ్వుతున్నాడు.
బుద్ధుడు తనకేమి పట్టనట్టు అలా మౌనంగా ఉన్నాడేమని భావించాడతడు. కొంచెం ఇబ్బందిగా కూడా ఉన్నాడు.
ఎలాగైతేనేమి మరి కొంత సమయం గడిచింది. చివరకు బుద్ధుడు నోరు విప్పాడు – “నీకు నిజంగా సమాధానాలు కావాలా?” అని.
“సమాధానాల కోసం కాకుంటే తమ దర్శనానికి ఇంత కష్టపడి రావటం ఎందుకు? నేను మీ కోసం ఒక వేయి మైళ్లు కాలినడకన ప్రయాణం చేసి కష్టపడి వచ్చాను. ప్రయాణం బడలికచే అలసి పోయాను కూడా” అన్నాడు మౌలింగ పుత్రుడు.
“నేను మరల అడుగుతున్నాను. నీకు నిజంగా సమాధానాలు కావాలా? వద్దా? అంతే చెప్పు. నీవు చెప్పే దాని మీదే అంతా ఆధారపడి ఉంటుంది” అన్నాడు బుద్ధుడు.
“కావాలి” అన్నాడు మౌలింగ పుత్రుడు. “అయితే రెండేళ్లపాటు నాతో ఉండు. ఏమీ మాట్లాడవద్దు. ప్రశ్నించవద్దు.
రెండేళ్ల తరువాత నీవేమి అడగదలచుకున్నావో అప్పుడు అడగవచ్చు. నేను నీకు మాట ఇస్తున్నాను – సమాధానం చెబుతానని” వాగ్దానం చేశాడు బుద్ధుడు.
దగ్గరలోనే ఇంకో చెట్టు క్రింద కూర్చున్న మంజుశ్రీ నవ్వసాగాడు. నవ్వటమే కాదు, నేల మీద పడి నవ్వసాగాడు దొర్లుతూ.
“అదేమిటి? అతడు అలా నవ్వుతున్నాడు?” ప్రశ్నించాడు బుద్ధుడిని మౌలింగ పుత్రుడు.
“నీవే కనుక్కో” అన్నాడు బుద్ధుడు. మౌలింగ పుత్రుడు నవ్వుతున్న మంజుశ్రీ దగ్గరకు వెళ్లగానే అతడు (మంజుశ్రీ) “అయ్యా! తమరేదైనా అడగదలచుకుంటే ఇప్పుడు అడగండి.
నేను మోసపోయాను. నాకు రెండు వేలమంది శిష్యులుండేవారు. వేయిమంది శిష్యులతో రెండు వేల మైళ్ళు ప్రయాణం చేసి, నా ప్రశ్నలకు సమాధానాలు పొందుదామని వచ్చాను.
నన్ను కూడా రెండేళ్లు తన సన్నిధిలోనే ఉండమన్నారు బుద్ధుడు. అలాగే ఆయనను చూస్తూనే కాలం గడిపాను. కాలం ఎలా గడిచిపోయిందో నాకు తెలియదు.
నా మనసులోని ప్రశ్నలు, సందేహాలు ఏమయ్యాయో తెలియదు. నిరంతరం నిశ్చల వదనుడైన బుద్ధుని వీక్షిస్తుంటే చాలు. ఇంకేమి అక్కరలేదు.
రెండేళ్లు గడిచాయి. ఆ గడచినా విషయం కూడా నాకు తెలియదు. ఇక నీవు ప్రశ్నలు అడగవచ్చు అన్నారు బుద్ధుడు నాతో.
అసలు ప్రశ్న జాడే లేదు. ఏమి అడిగేది? నేను నవ్వాను. బుద్ధుడు కూడా నవ్వాడు. ఏదైనా అడగదలచుకుంటే ఇప్పుడే అడుగు” అన్నాడు మౌలింగ పుత్రునితో.
మంజుశ్రీ చెప్పినది సత్యమే. అయినా బుద్ధుడు ఉండమన్నట్లు రెండేళ్లు ఉన్నాడు. బుద్ధ భగవానుని చూస్తుంటే మనసులో ప్రశ్న అనేది జనించదు. మహదానందం వెల్లివిరుస్తుంది గౌతముని కృపా నేత్రాల నుండి.
ఇక ఏమి కావాలి. తేదీ వివరాలు అలభ్యం. సందర్శానందమే మహదానందం.
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- ఆనందదాయకుడు…. మహనీయులు – 2020 – జనవరి 23
- ఒక అడుగు ముందుకు వెయ్యి …. మహనీయులు – 2020… జూన్ 23
- కృషి…. మహనీయులు – 2020…ఫిబ్రవరి 8
- మహా భిక్షు …. మహనీయులు – 2020… మే 24
- చద్ది కూడు.. …. మహనీయులు – 2020… అక్టోబరు 3
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments