Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
“ప్రపంచాన్ని ధర్మ మార్గంలో నడిపిస్తున్న యోగులు 72 మంది. వారందరికి దారి చూపే యోగీశ్వరుడు శ్రీ సాయిబాబా” అంటారు మెహర్ బాబా.
పంచ సద్గురువులతో మెహర్ బాబాకు బంధము – సంబంధము ఉంది.
మెహర్ బాబా ఇంకా బెహ్రేంజీలు కలసి సాయిబాబాను దర్శించారు. ఆ సమయంలో సాయిబాబా ఊరేగింపులో ఉన్నారు.
మెహర్ బాబా రహదారి (రోడ్డు) మీదనే సాష్టాంగ దండ ప్రణామమాచరించాడు.
సాయిబాబా మెహర్ బాబాను ‘పర్వర్థిగార్’ అన్నాడు. పర్వర్థిగార్ అంటే సర్వ రక్షకా సర్వేశ్వరా అని అర్ధము.
మెహర్ బాబా “భగవంతుడు సర్వవ్యాపకుడు. నిజమైన ప్రేమతో వేసిన కేకను తప్పక వింటాడు” అంటారు.
మెహర్ బాబా అనుచరులను “బాబా ప్రేమికులు” అని పిలుస్తారు.
“నేను ఎదో ఇస్తాననే ఆశతో నన్ను ప్రేమిస్తే, అది ప్రేమించటం కానేకాదు. ఒక గుడ్డివారు దృష్టికోసం తన పనికిరాని కళ్ళను దానం చేయటంలాంటిది” అంటారు మెహర్ బాబా.
ఒక యువ భక్తుడు – బాబా ప్రేమికుడు మెహర్ బాబాకు “బాబా నీవు ప్రేమికుల బానిసనంటావు కదా! నాకు ఉద్యోగం లభించేలా ఆశీర్వదించండి” అని ఉత్తరం వ్రాశాడు.
ప్రేమ అనేది దేనినీ ఆశించి చేయకూడదు అని మెహర్ బాబా సమాధానం వ్రాశారు.
నవసారీలో సొరాబ్జీ దేశాయి, అతని సోదరి బాబా ప్రేమికులు. ఆమె నడవలేనిదై, మంచంపట్టి 25 సంవత్సరాలైంది. చికిత్సలన్నీ వ్యర్థమయ్యాయి.
ఒకసారి నవసారి వచ్చినప్పుడు, వారి ఇంటికి వెళ్ళారు బాబా. ఆమె గదిలోకి ప్రవేశించారు బాబా.
ఊహించని ఆ సంఘటనకు ఆమె తబ్బిబై వెంటనే మంచం మీదనుండి లేచి నిలబడి, బాబా వద్దకు నడచివెళ్ళి అయన పాదాలపై శిరస్సునుంచి నమస్కరించింది.
ఆ దృశ్యం అందరినీ ఆశ్చర్యపరచింది. అక్కడ ఉన్నవారినే కాదు, బాబా ప్రేమికులకు ప్రేమ తత్వం అంటే ఏమిటో తెలిపింది.
“నేను ప్రేమించతగిన ప్రియతముడను ఎందుకంటే నేను మూర్తీభవించిన ప్రేమయే కనుక. ఆ అవగాహనతో నన్ను ప్రేమించేవారు అపరిమితమైన దృష్టి ప్రసాదింపబడిన వారై, నా నిజస్వరూపమును చూడగలుగుతారు” అన్నారు మెహర్.
అహ్మద్ నగర్ సమీపంలో గల మెహరాబాద్ లో ఈయన మందిరము సమాధి మొహర్ బాబా ప్రేమికులకు కాక సర్వమానవాళికి పూజనీయమైనవి.
ఫిబ్రవరి 25, 1894 ఆయన జన్మదినం. ఆయనను స్మరిద్దాం! తరిద్దాం!!
నిన్ను (మెహర్ బాబాను) నిన్నుగానే (మెహర్ బాబాగానే – కల్పతరువు, కామధేనువుగా, చింతామణిగా) కాకుండా ప్రేమించే మనస్సును ఆయత్తం చేయమని మెహర్ బాబాను ప్రార్థిద్దాం!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- సద్గురు సాయి మందిర పునాది….. సాయి@366 ఫిబ్రవరి 21….Audio
- నిన్ను నిన్నుగా ప్రేమించుటకు…..సాయి@366 జనవరి 3….Audio
- క్రీస్తు శకము – సాయి యుగము…. .. …. మహనీయులు – 2020… డిసెంబరు 25
- క్రీస్తు శకం – సాయి యుగం …..సాయి@366 డిసెంబర్ 25….Audio
- ఆనాడు ఈనాడు ఒకే స్పందన…..సాయి@366 ఏప్రిల్ 25….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments