Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice support by: Mrs. Jeevani
ఫకీరుగా షిరిడీలో కాలుమోపిన సాయి, వైద్యుడయ్యాడు, గురువు అయ్యాడు, దైవం అయ్యాడు, ఇలవేల్పు అయ్యాడు. నేడు కోట్లాది మంది ఇళ్ళల్లో కొలువై ఉన్నాడు.
ఎవరైనా సాయి వంటి సత్పురుషుని వద్దకు వచ్చేది, మహత్తు తెలుసుకునే.
ఒకసారి సాయి మహిమాన్వితుడు అని గ్రహించిన తరువాత ఆయనను వీడరు.
అలా కాకుండా షిరిడీలో అడుగు పెట్టాడు సాయి , సాయిని సాయిగానే మొదటగా స్వాగతించిన వ్యక్తి మహల్సాపతి.
ఆయనను కాశీరాం, జోగ్లేలకు పరిచయం చేసాడు. ఈ ముగ్గురు సాయిలో ఏ మహత్తు చూడకుండానే దగ్గరయ్యారు.
ఈ ముగ్గురే కాదు, గణపతి కోతే పాటిల్, అయన భార్య బయజాబాయి సాయిని కారణం లేకుండానే ఆత్మీయునిగా భావించారు.
ఆ పుణ్య దంపతులను చూచిన సాయి వారిని సాదరంగా ఆహ్వానించాడు. “అమ్మా! నీవు నిజంగా నా సోదరివి” అన్నాడు బాయజాబాయితో.
అంతవరకు సాయి ముక్కు మొహం తెలియదు వారికి. ఆ కుటుంబంతో అనుబంధం ఏర్పడ్డది.
సాయిబాబా షిరిడీ చుట్టుపక్కల అడవులలో తిరుగుతుండే వాడు. సాయిని ఆ అడవులలో వెదికి పట్టుకుని భోజనం పెట్టేది బయజాబాయి. తరువాతనే తాను భోజనం చేసేది.
“అదేమిటి?” అని ఆమె భర్త ప్రశ్నించలేదు. బయజాబాయి అడవులలో తిరగటం కష్టం అని గ్రహించిన సాయి షిరిడీలోనే నివాసం ఏర్పరచు కున్నాడు.
“ఆబాదే ఆబాద్ బయజాబాయి, రోటీ లావ్” అని ఇంటి ముందు నిల్చొని కేక వేసి బిక్ష అడిగేవాడు సాయి అంతే గాని ఆహ్వానించినా గృహములోనికి ఏనాడు అడుగిడలేదు.
సాయి గణపతి కుటుంబానికి ఎంత భోగ భాగ్యాలను ఇచ్చాడన్నది కాదు – నేటికి షిరిడీ సంస్థానం వారు ప్రతి గురువారం నాడు జరిగే పల్లకి ఉత్సవంలో ఆయన కుటుంబానికి ప్రత్యేక స్తానం కల్పించారు.
ఇంకా, ఆ కుటుంబం వారే ప్రతి నిత్యం ద్వారకామాయిలోని సాయినాథునికి తొలి (ఆహార పళ్ళెము) సమర్పిస్తున్నాను.
నేడు జనవరి 3 , సరిగ్గా ఈ తేదీనే 1912 వ సంవత్సరములో గణపతి సాయిలో ఐక్యమయ్యాడు. ఆయన వలె ప్రతి భక్తుడు సాయిని ప్రేమిస్తే చాలు!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- నిన్ను నిన్నుగా ప్రేమించుటకు ….. మహనీయులు – 2020…ఫిబ్రవరి 25
- దాము అన్నా – తిని చావు …..సాయి@366 జనవరి 20….Audio
- నిరీక్షణలో ఆనందం. …..సాయి@366 జనవరి 12….Audio
- నిన్ను చూడనీ! …..సాయి@366 డిసెంబర్ 12….Audio
- రాలిన నక్షత్రం!…..సాయి@366 మార్చి 19….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments