క్రియ – ప్రతి క్రియ…..సాయి@366 జనవరి 4….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice support by: Mrs. Jeevani


గణేశ్ శ్రీకృష్ణ కపర్డే తన డైరీలో సాయి చెప్పిన అనేక కధలను ప్రచురించారు. అందులో జనవరి 4 న తెలిపిన గాధ ఇలా సాగుతుంది….

“ఒక భవనంలో ఒక మహారాణి నివసిస్తోంది.  ఒక అంత్యజుడు ఆమెను ఆశ్రయ మివ్వమని కోరాడు. అక్కడే ఉన్న ఆమె వదిన దానిని తిరస్కరించింది.

అంత్యజుడు తన భార్యతో తన గ్రామానికి పోతుండగా మార్గంలో అల్లా మియాని కలిసి, తాను ఎలా పేదరికంలో మగ్గుతున్నది, ఆశ్రయం ఎలా నిరాకరించారో చెప్పాడు.

అల్లా మియా మరోసారి ఆ  మహారాణిని కలిసి ఆశ్రయాన్ని కోరమని సలహా ఇచ్చారు. అతడు అలానే చేసి ఆశ్రయం సంపాదించి ఆ కుటుంబ సభ్యులలో ఒకడుగా చూడబడ్డాడు.

అతడు ఆరు నెలలు అన్ని సుఖాలు అనుభవిస్తూ, బంగారాన్ని దొంగిలించి, మహారాణిని హత్య చేశాడు. అక్కడున్న వారందరూ కలిసి పంచాయితీ జరిపారు.

అతడు నేరం ఒప్పుకొనిన కొద్ది కాలానికి ఆ విషయం రాజు దృష్టికి వెళ్ళింది. అతడిని వెళ్లనిమ్మని అల్లామియా రాజుకు సలహా ఇస్తే, రాజు అంగీకరించాడు.

హత్యకు గురైన మహారాణి అతనికి కుమార్తెగా పుట్టింది. అతడు మరొకసారి భవనానికి వచ్చి అక్కడ ఉండేందుకు అనుమతి పొంది హాయిగా 12 సంవత్సరములు ఉన్నాడు.

అల్లా మియా అప్పుడు మహారాణిని హత్య చేసినందుకు, అతనిపై పగ తీర్చుకోమన్నాడు.

మహారాజు అతడు మహారాణిని ఎలా హత్యచేశారో, ఆ విధంగానే హత్య చేయమన్నారు. మహారాజు అలానే చేశాడు.

అతని భార్య విధిని అంగీకరిస్తూ, తన గ్రామానికి వెళ్ళిపోయింది. గత జన్మలో మహారాణి, ఈ జన్మలో అతని కుమార్తెగా జన్మించింది. తనవన్నీ స్వాధీనం చేసుకుని సంతోషంగా జీవించింది”!

ఏదైనా సంబంధము ఉండనిదే ఒకరు ఇంకొకరి వద్దకు పోరు – అందుకనే అతడు మహారాణిని, ఒకసారి కాదు, రెండు పర్యాయాలు కలిశాడు.

ఆశ్రయమును పొందిన అతడు దురాశాపరుడయినాడు. దొంగతనము, హత్య చేసాడు. అందులకు ఫలితమును అనుభవించాడు.

మొదటగా, రాజు ప్రతీకారమును తీర్చుకొనదెననగా, అల్లామియా అంగీకరింప లేదు. పాప ఫలం ఇంకను పండలేదు.

ఆ మహారాణియే అతనికి కుమార్తెగా జన్మిచవలెను. అతడు తిరిగి భవనానికి చేరాలి.

12 సంవత్సరములు గడవాలి. అప్పటికి కర్మ పరపక్వమగును. అప్పుడు అల్లా మియా మహారాజుకు అనుజ్ఞ ఇచ్చాడు.

క్రియకు ప్రతి క్రియ జరిగినది. ఇది కర్మ సిద్దాంతము. ఏ వ్యక్తి అయినను దురాశకు, అత్యాశకు పోరాదు.

దొంగతనము, హత్య చేసినందులకు ప్రతిఫలము పొంది తీరవలయును. సాయి భక్తులకు ఈ గాధ ఒక హెచ్చరిక.

అడుసు త్రొక్కనేల! కాళ్ళు కడగనేల!!

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles