అల్లా చూస్తున్నాడు …..సాయి@366 మే 11….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


సాయిబాబా సన్నిధిలో దాదాపు మూడు నెలలు ఉండిన ఏకైక తెలుగు వ్యక్తి శుద్దానంద.

ఆయన కవి, యోగి, మహర్షి. భారతదేశంలో ఆనాటి చాలామంది సమకాలిక మహనీయులను దర్శించి, వారితో అనుబంధం ఏర్పరచుకున్న ఏకైక తెలుగు వ్యక్తి ఈయనే అనవచ్చు.

ఈయన మే 11, 1897న జన్మించారు. సాయిని గూర్చి అనేక విషయాలను తెలిపారాయన.

సాయిబాబా ‘రాం రాం అల్లారాం’ అని తనకు భిక్షనిచ్చిన వారిని దీవించే వారు.

సాయి కోసం భక్తులు వెండి పల్లకి ఇచ్చారు. సాయి దానిలో కుక్కను నిద్రపోనిచ్చే వారు. దైవములో ఆ కుక్క ఉన్నారు అనేవాడు సాయి.

సాయి తన భిక్షను మొదట కుక్కకు పెట్టి మిగిలిన దానిని పేదసాదలకు పంచేవారు. ఆయన అతి తక్కువగా తినేవారు.

సాయిని కీర్తించినప్పుడు శుద్దానంద భారతితో ”కీర్తి చెందవలసినది భగవంతుడే. ఆయనే మన గురువు సృష్టి. అంతా ఆయన లీల.

సూర్యుడు, చంద్రుడు, తారకలు, నీలాకాశం అంతా ఆయన సృష్టే. సృష్టి అంతా ఆయన చమత్కార లీల కాదా!

సూర్యోదయాన్ని మించి చూపే చమత్కార లీల ఉంటుందా? చమత్కార లీలలన్నీ ఆయనవే. ఆయనే విశ్వంభరుడు. ఆయన యందు ఎనలేని నమ్మకాన్ని ఉంచుకో” అనేవారు.

ఇంకా సాయి ”నోరు మూసుకో, హృదయం తెరచుకో, భయపడకు. నీవు తుఫాన్‌నైనా ఎదుర్కొనగలవు. ఈ శరీరం త్వరలో నశించ వచ్చును నేను శరీరం కాదు. సాధకులకు సాయం చేసేందుకు నేను అన్ని చోట్లా ఉంటాను ” అనే వారు శుద్దానందులతో.

శుద్దానంద భారతి ఒక సంఘటన తెలిపారు.

సాయిబాబా రామాయణాన్ని, రామ నామాన్ని ప్రోత్సహిస్తున్నాడని ఒక ముస్లిం మతస్తుడు సాయిబాబాను వధించటానికి కత్తి తీసాడు.

సాయిబాబా లేచి నిలబడ్డాడు. ఆ ముస్లింతో ”అలాగే కానివ్వు. చంపు. పైన అల్లా నీవు చేసే పనిని చూస్తున్నాడు” అన్నారు సాయి.

అతడు నిర్ఘాంతపోయాడు. కత్తి నేల మీద పడింది. అతడు నేలపై కుప్పకూలాడు. కదలలేక పోయాడు. ”అల్లా..హే అల్లా..మాఫ్‌…” అని అర్థించాడు అతడు.

”అన్ని శరీరాలు ఇలా బూడిద అవవలసిందే. అలా జరిగేముందు వినయంగా, నిరాడంబరంగా నమ్మకం కలిగి ఉండు. అల్లా తనకు ఇష్టం వచ్చినట్లు మలచుకుంటాడు ” అన్నాడు సాయి.

అల్లా అచ్ఛా కరేగా..

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

One comment on “అల్లా చూస్తున్నాడు …..సాయి@366 మే 11….Audio

Kameswara Polisetty

Good
“నమస్కారం గురుదేవా!
నమస్కారం శ్రీ బాబూజీ!!”

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles