Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice support by: Mrs. Jeevani
ఎంతటి మహనీయుడైనా చేసే అజ్ఞానపు పని అంటూ ఉంటే తన గురువును గూర్చి వ్రాయటమే. ఇది సాయిబాబా విషయంలో అందరకూ అనుభవమవుతున్న యదార్థ విషయం.
సాయిబాబా గత శతాబ్దపు విలక్షణమూర్తి. ఈ శతాబ్ధిలో గూడా మహామహిమాన్వితులుగా విశ్వ ఖ్యాతిని, భక్తి ప్రేమలను పొందిన కారుణ్యమూర్తి, ప్రజల మనిషి.
మనిషికి ఎన్ని జన్మలో అన్ని కథలను తన చుట్టూ అల్లుకున్నాడు, అల్లింప చేసుకున్నాడు. అదంతా ఒకసాలెగూడు లాంటిదే.
ఆ గూటిలో ఒక్కొక్క దారం ఒక్కొక్క జన్మ. ఆ జన్మలో మనమందరమూ ఉంటాము. అయితే తన స్వభావానికి తగిన కథ – అది చూపే మార్గాన్ని పాటిస్తే చాలు.
సాయినాథుని అసాధారణ లక్షణాలలో ఒకటి అందరకూ ఎల్లవేళలా అందుబాటులో ఉండటం.
రాత్రింబవళ్ళు అందరిపై శ్రద్ధ చూపేవాడాయన. ఈ శ్రద్ధను మానవులకే పరిమితం చేయలేదు. సర్వ ప్రాణులకు, తన ప్రేమను పంచి ఇచ్చాడు.
గురువులకు, దైవానికి సేవ చేసే శిష్యులున్నారు, భక్తులున్నారు. కానీ, సాయి వైఖరే వేరు. సేవకుడంటే, శిష్యుడంటే సాయిలాగా ఉండాలనే ముద్ర ఎన్నటికి చెరిగిపోదు ప్రజల మనస్సునుండి.
మహారాజంతటి సంపాదనతో భిక్షమెత్తుకు తిరిగే సాయి చేష్టలనుండి అమృత బిందువులను సేవించవచ్చు.
చిరిగిన కఫ్నీని, కుట్టుకుని వేసుకునే పేదరికంతో బ్రతికినా చాలు – అదీ భగవానుడు ఇచ్చిందనే తృప్తే ఉంటే ఈ విశాల విశ్వమూ మనదే అవుతుంది అని రుజువు చేసిన యుగపురుషుడు సాయి.
తన జీవితం ద్వారా ఒకరిపట్ల మరొకరు ద్వేషం పెంచుకోనట్టు, ఒకరినొకరు ప్రేమించుకోవటానికి దోహదం చేసిన మతాతీతుడు.
సాయి భగవంతుడే. భగవంతుని అవతారాల్లో దేని పరమార్ధం దానికుంది. కానీ, సాయి అవతారంలోని పరమార్థం విశ్వాన్ని శుభ్ర మార్గంలో నడపటం ఒకటి మాత్రమే.
నేడు ఈ విశాల విశ్వంలో ”శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకు జై” అనే ధ్వాని వినిపించని క్షణం ఉండదు, శ్రద్ధ, సబూరిలుంటే అడుగడుగునా – కాదు, అణువణువునా దర్శనమిస్తాడు సాయి.
నమామీశ్వరం సద్గురుం సాయినాథం!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- అల్లా చూస్తున్నాడు …..సాయి@366 మే 11….Audio
- పాఠకుడే పారాయణ గ్రంధకర్త …..సాయి@366 జూలై 15…Audio
- శ్రద్ధా భక్తులు …..సాయి@366 అక్టోబర్ 20…Audio
- కూలీ రెండు రూపాయలు ….. సాయి@366 మార్చి 15…Audio
- బూటీ వాడా…..సాయి@366 అక్టోబర్ 16….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
One comment on “అల్లా అచ్చా కరేగా!…..సాయి@366 అక్టోబర్ 15….Audio”
saishub
October 15, 2019 at 7:42 pmom sai ram the best post on shirdi sai baba shree sachidananda sadguru sainath maharaj ki jai.