శివమ్మతాయి…..సాయి@366 మే 29….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


దక్షిణ భారతదేశం నుండి మహా సమాధి పూర్వం సాయిబాబాను దర్శించిన వారే తక్కువ. అందులో మహిళలు మరీ తక్కువ.

1889 మే 29న మధ్యాహ్నం ఒంటి గంట సమయాన తమిళ దేశంలో కోయంబత్తూరులోని వెల్లకినారు అనే ఊరిలో రాజమ్మ జన్మించింది.

ఈమె పెదనాన్న శ్రీ తంగవేలు గౌండర్‌ సన్యాసం స్వీకరించి, షిరిడీలోని సాయిబాబాను దర్శించారు.

సాయిబాబాను తన గ్రామమునకు కూడా తీసుకొని వచ్చారని, రాజమ్మను శ్రీ సాయి దీవించారని చెబుతారు. ఈమెకు వివాహమైంది. కుమారుడు జన్మించాడు.

ఆమెకు సాయి బాబాను దర్శించాలనే కోరిక కల్గింది. దానికి భర్త తన అసమ్మతిని తెలియచేయ లేదు. కాని, ఒక షరతు పెట్టినాడు.

ఇటువంటి షరతులు పెట్టిన మరియొక భక్తుడు లక్ష్మణ్ కృష్ణాజీ నూల్కర్‌. ఒకటి బ్రాహ్మణ వంటమనిషి దొరకవలయునని, రెండు చక్కని నాగపూర్‌ కమలాఫలములు లభించాలని.

సాయి సంకల్పించుకున్నచో కొదవేమున్నది? ఆ రెండు షరతులు వెంటనే నెరవేరినవి. నూల్కర్‌ సాయిని దర్శించాడు.

రాజమ్మ భర్త సుబ్రహ్మణ్యం గౌండర్‌ ”మన ఇంటిలోని ఏడు పళ్ళు కలిగిన ఆవు ఏడు దినములలో అమ్ముడుపోయినచో, షిరిడీకి వెళదాము” అన్నాడు.

సాయి కృపవలన అది 4 రోజులలోనే అమ్ముడుపోయినది. ధర కూడ రూ.55/- పలికినది.

ఈ సాయి లీలా అనుభూతి ఫలితముగా 1908లో 17 సంవత్సరముల రాజమ్మ, భర్త సుబ్రహ్మణ్యం గౌండర్‌, పసిబిడ్డతో షిరిడీ వెళ్ళి సాయిని దర్శించారు.

”అల్లా అచ్ఛా కరేగా” అని దీవించి సాయి రాజమ్మను ”నల్లఇరు” (చల్లంగుండు) అని దీవించారు. సాయి వీరితో తమిళములోనే సంభాషించే వారు.

ఈమె సాయినాథుని అనేక లీలలను కనులారా గాంచినదని తెలియవస్తోంది.

సాయిబాబా 6 అడుగుల ఎత్తు, పొడవైన చేతులు (మోకాళ్ళు దాటినవి) కొనతేలిన ముక్కు, కంటిపాపలు నీలముగా మిలమిల మెరయుచు తీక్షణమైన చూపుతో సాయి ఉండెడివారని ఈమె వర్ణించినది.

సాయియే ఆమె నామమును శివమ్మ తాయి అని మార్చినాడు. పెక్కుమారులు సాయి దర్శనము చేసిన ఈమె అనేక సాయి మందిరములకు ప్రతిష్ట చేసినది.

స్వయముగా సాయి మందిరమును ఏర్పరుచుకున్న ధన్య జీవి. కర్నాటక, తమిళ రాష్ట్రాల్లో ఎందరికో సాయిని గూర్చి తెలిపిన భక్తురాలు.

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles