Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
సాయిబాబా షిరిడీకి వచ్చినప్పుడు ఖండేరావు గుడిలోనికి పోబోతుంటే, ఆ ఆలయ పూజారి మహల్సాపతి వారించాడు.
సాయిబాబా అప్పుడు కోపం తెచ్చుకోకుండా ”…నీ అభిమతాన్ని అనుసరించి నేను దూరం నుండే దర్శనం చేసుకుంటాలే! దానికి అభ్యంతరం లేదనుకుంటాను.
మీ పురాణాలలో ఒక కథ ఉన్నది. పంచముడైన చోఖామేళా పాండురంగనికి ప్రియమైనవాడు. పాండురంగని వద్ద పూజ చేసే పురోహితులకంటే వంద రెట్లు శ్రేష్టుడు.
శ్రీహరి ద్వారాన్ని చేరుటకు శ్రద్ధతో ప్రయత్నంచేసేవారు తప్ప మిగిలిన అందరూ పంచములే! ఎవరి ఆంతర్యం పరిశుద్ధంగా ఉంటుందో, వాడు సర్వత్ర పరిశుద్ధుడే!” అన్నాడు.
మహారాష్ట్రలో చోఖామేళాను గూర్చి తెలియని వారుండరు. అతనిని పాండురంగని ఆలయంలోపలకు రానీయలేదు. కానీ అంతటా పాండురంగని చూచి మైమరచిపోయే భక్తుడు.
ఒకనాడు ఒక గోడను కడుతూండగా, అది కూలటం వలన చోఖామేళా, మరి కొందరు మరణించారు. శవాలను తీయటానికి చాలా సమయం పట్టింది. సామూహిక దహనం చేశారు.
నామదేవునితో పాండురంగడు ‘‘నా భక్తుడు చోఖామేళా అతని సమాధి నా మందిర`మునకు ఎదురుగా ఉండలనే ఒకే ఒక్క కోరికతో జీవించాడు. ఆ కోర్కె తీర్చుట నా లక్ష్యం” అన్నాడు.
”చోఖామేళా ఎముకలను గుర్తించటం సాధ్యం కాదుకదా?” అన్నాడు నామదేవు. పాండురంగడు ”చోఖామేళుని ఎముకలు సహితం నా నామాన్ని ఉచ్ఛరిస్తాయి” అన్నాడు.
నామదేవుడు ఆ ఎముకల గుట్ట దగ్గరకు వెళ్ళి, ఒకొక్క ఎముకను చెవి దగ్గర పెట్టుకొని, ఏవి అయితే పాండురంగని నామ స్మరణ చేసినవో, వాటిని ఏరి తీసుకువచ్చి, పాండురంగని ఆలయమునకు ఎదురుగా చోఖామేళా సమాధిని నిర్మించాడు.
చోఖామేళుని ఎముకలు రంగని నామాన్ని ఉచ్ఛరిస్తాయి.
చోఖామేళుడు వైశాఖ బహుళ పంచమినాడు (మే నెల) దేహాన్ని త్యజించాడు. సాయి దేహాన్ని త్యజించాడు. మహా సమాధిని నిర్మించారు.
బొంబాయి నివాసి యగు శ్రీమతి రుస్తుంజీ బాబా మహా సమాధిపై శిరమునుంచి ”బాబా నీవు జీవించి ఉన్నప్పుడు నా కష్టాలను కడతేర్చి నన్ను రక్షించినావు, ఇప్పుడు నాకు దిక్కెవ్వరు?” అని రోదించగా ఆమెకు సమాధి నుండి ”రుస్తుంబేటా కబ్ ఆయా?” అన్న మాటలు మూడుసార్లు వినిపించినవి.
సాయిబాబా అంటారు ”నా ఎముకలు సహితము భక్తులతో మాట్లాడును ”
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- నాడే కాదు – నేడు కూడా!…..సాయి@366 జూలై 24…Audio
- షిరిడీ లో పాండురంగడు! …..సాయి@366 ఏప్రిల్ 26….Audio
- అబ్బా! దెబ్బ…..సాయి@366 సెప్టెంబర్ 28….Audio
- అల్లా చూస్తున్నాడు …..సాయి@366 మే 11….Audio
- జీవన్ మే ఏక్ బార్ …. మహనీయులు – 2020… నవంబర్ 21
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments