Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
అత్యంత అపూర్వమైన, అద్భుతమైన, అసంభావ్యంగా కనిపించే కొన్ని విషయాలను మహనీయులు చేసిచూపుతారు.
అలా చేసి చూపటం తమ మహత్తును ఆకాశమంత ఎత్తుకు ఎదిగించాలని కాదు. మహనీయులందరూ భగవానుని ప్రతినిధులవలె ప్రవర్తిస్తుంటారు.
ఆరోజు ఎండ మల మల మాడ్చివేస్తున్నది పూరీలో. యుక్తేశ్వర్ గారు ఒక ఊరేగింపు జరపాలని నిశ్చయించుకున్నారు.
పథకం కూడా తయారు చేశారు. శిష్యులను, సందర్శకులను పూరీ సముద్రం ఒడ్డు వెంట నిర్ణీత ప్రదేశానికి నడిపించాలి. దీనిని ఆయన శిష్యుడైన యోగానంద వింటున్నాడు.
ఇందులో ఒక విషయం ఏమిటంటే చెప్పులు లేకుండా అంత దూరము నడవాలి.
యోగానందుడు ”గురూజీ, కాళ్ళకు చెప్పులు లేకుండా నిప్పులా కాలుతున్న ఈ ఇసుకలో ఎలా నడిపించమంటారు?” అని చనువుగా అడిగాడు.
యోగానంద అంటే యుక్తేశ్వరులకు అభిమాన శిష్యుడు. ”మీరంతా సుఖంగా నడుస్తారు” అన్నారు గురువుగారు. ఇక అందరూ బయలుదేరారు, నిప్పులు చెరిగే ఎండలో, మండిపోతున్న ఇసుకలో.
అలా అందరూ ఆశ్రమం నుండి బయటకు వచ్చారో లేదో, ఆకాశమంతా మేఘములతో నిండిపోతూ వచ్చింది.
నగర వీధుల్ని చల్లబరుస్తూ సన్నని వానజల్లు కురిసింది. సేద తీర్చినట్లు అతి సన్నని జల్లులు పడుతున్నాయి. ఊరేగింపు ముగిసింది.
అందరూ ఆశ్రమానికి వచ్చారు. అదే క్షణం నుండి తీవ్రమైన ఎండ .. మబ్బులు ఎక్కడికి పోయాయో?
ఇక షిరిడీలో…
ఒక వేసవి కాలంలో ఒక మధ్యాహ్నం పూట జరిగిన సంఘటన. అది ద్వారకామాయి. సాయిబాబాతోపాటు మరి కొందరు భక్తులు ఉన్నారు.
ఎండ మండిపోతోంది. ధుని నుండి వేడి గాలి వీస్తోంది. బయట ఎండకు, లోపల ధుని సెగకు తట్టుకోలేక కొందరు ఇళ్ళకు వెళ్ళిపోయారు.
ఇంకా కొందరు మాత్రమే ఉన్నారక్కడ. వారితో సాయి ”మీరు వెళ్ళి ధుని దగ్గర కూర్చోండి” అన్నారు.
ధునికి దూరంగా కూడా కూర్చోలేక కొందరు వెళ్ళిపోతే మిగిలిన వారితో సాయి అలా పలకటం ఆశ్చర్య మనిపించింది.
సాయి మాటను శిరసావహించి ధుని దగ్గర కూర్చున్నారు. మసీదులోని వాతావరణము చల్లబడ్డది. చల్లని వాయువులు వీచసాగాయి వారికి.
సాయి తనకేమీ పట్టనట్టు, కేవలం సాక్షీభూతుడనన్నట్లు కూర్చున్నాడు – అందరూ అప్పుడు ఆ కాలదర్పదమనునికి నమస్కరించారు.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- ఓం శేష సాయినే నమః …..సాయి@366 సెప్టెంబర్ 24…Audio
- ముగ్గురమ్మలు …..సాయి@366 ఏప్రిల్ 24….Audio
- తుంగభధ్ర తట వాసినే నమః …..సాయి@366 మే 10….Audio
- చోఖామేళా …..సాయి@366 మే 28…Audio
- బాబా ఊదీ ఘనత
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments