Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
బాబా ఊదీ ఘనత
ఏదయినా మన నమ్మకాన్ని బట్టి ఉంటుంది. బాబా ఊదీ మీద పరిపూర్ణమయిన విశ్వాసంతో ఊదీ ధరిస్తే, దానికి తిరుగు ఉండదు. పూజ్యశ్రీ బాపట్ల వేంకట పార్థసారథిగారు ఊదీ ఘనతను రెండు మాటల్లో యెంతో చక్కగా యిలా వివరించారు.
అఖిల రోగముల హరించు ఔషధంబు
అరయ గ్రహదోషముల మాపు ఆయుధంబు
ద్వారకామాయి ధుని సముపార్జితంబు
సరవి నొసట దాల్చుడుథి నుషస్సువేళ
పూజ్యశ్రీ శివనేశన్ స్వామి ఈ ధుని మహాత్యాన్ని వివరించే ఒక సంఘటన తెలియ చేశారు. 1974 లో రష్యా దేశానికి చెందిన వాతావరణ శాస్త్రజ్ఞులు కొందరు ధుని వెదజల్లుతున్న పొగవలన వాతావరణం కాలుష్యమౌతున్నదని తలచి, పొగను పరీక్షించారు. ఏ విధమైన కాలుష్యం లేదు. వారు అనుమానం తీరక ధునికి సమర్పించే పదార్థాల్ని మండించి ఆ పొగను పరీక్షించారు. అందులో కాలుష్యం నమోదయింది.
అప్పుడు యిదంతా ధుని మహాత్మ్యమని వారు విశ్వసించి ధునికి భక్తితో ప్రణమిల్లారు.
మరో విశేషం. ధునికి అమర్చిన యినుప తలుపు ధుని వేడికి అప్పుడప్పుడు వ్యాకోచించింది. కాని యెదురుగా కొద్ది దూరంలో గోడకున్న రెండు కఱ్ఱ స్తంభాలు యేనాడూ వంకరలు తిరగకపోవడమే ఆశ్చ్యర్యం.
“ఈ ధుని యెందుకు నిర్వహిస్తున్నారు?” అని ఒక భక్తుడు బాబానడిగాడు.
“అందరి పాపాలు దహించడానికే” అని బాబాగారి సమాధానం.
కష్టాలు తీర్చమనో, కోరికలు నెరవేర్చమనో లేకపోతే బాబా గారి అనుగ్రహం కావాలనో మనసులోనే సంకల్పం చెప్పుకుని, మనతో తీసుకువెళ్ళిన మేడిపుల్లలు, తులసి పుల్లలు, గంధపు చెక్క, నవధాన్యాలు, ఆవు నెయ్యి వగైరాలు ధునికి అమర్చిన చిన్నగొట్టం ద్వారా ధునిలో సమర్పించాలి. స్వీకరించి అనుగ్రహించమని సాయిని వేడుకోవాలి.
పీచు గల కొబ్బరికాయలు అక్కడే ప్రక్కనుండే (గోతంలో) డబ్బాలో ఉంచితే, సంస్థాన్ వారు వాటిని నిర్ణీత సమయంలో ధునిలో వేస్తారు. తర్వాత హుండీలో దక్షిణ సమర్పించాలి.
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- ముగ్గురమ్మలు …..సాయి@366 ఏప్రిల్ 24….Audio
- వైశ్వ దేవం …..సాయి@366 జూలై 28….Audio
- కాలదర్పదమనాయ నమః …..సాయి@366 మే 30….Audio
- బాబా పంపిన ఊదీ
- బాబా నైవేద్యంలో ఊదీ మహిమ.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments