బాబా నాకు బహుమతిగా ప్రసాదించిన దండ



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

బాబా నాకు బహుమతిగా ప్రసాదించిన దండ

ఈ ప్రపంచంలో మనం చూసేదంతా మాయ (భ్రమ). మనం చూసేవన్నీ సత్యాలు కావు. నిజంగా ఉన్నదేమిటంటే, పరిశుధ్ధమైనది, అదే మనకి జ్ఞానాన్ని కలిగించి నేత్రాలని తెరిపించే సద్గురువు, ఉన్నది ఉన్నట్లుగా కాకుండా వాటి నిజస్థితిని తెలియచెప్పి మన కన్నులను తెరిపిస్తుంది. అందుచేత మనకు నిజమైన అంతర్దృష్టినివ్వమని బాబాను ప్రార్థించాలి.

నేనీరోజు ఒక చక్కటి బాబా లీలను మీకు అందిస్తున్నాను. మనం ఆర్తితో బాబాని ఏ రూపంలోనైనా సరే(స్వప్నము, ఫోటో, విగ్రహం… వగైరా) చూడాలనుకున్నప్పుడు ఆయన మన కోరిక తీరుస్తారు. అది భక్తుని యొక్క కోరికని బట్టి దానికి అనుగుణంగా జరుగుతుంది. బాబా ఆరతిలో కూడా దీనిని గురించి ఉంది.

అందుచేత సోదరుడు గణేష్ కు బాబా ప్రసాదించిన అనుభూతిని చదవండి. బాబాకి మన కోరికలన్నీ తెలుసని, మన స్వచ్ఛమైన కోరికలను ఆయన మరుక్షణమే తీరుస్తారని, మనకు కావలసినదల్లా ఆయన యొక్క అనంతమైన శక్తులపై నమ్మకం ఉండటమే అని ఈ లీల ఋజువు చేస్తుంది. గణేష్ గారూ, మన అందరితో కలిసి ఈ మీ అనుభవాన్ని పంచుకుంటున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదములు.

ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న విషయాలు, ఇవన్నీ మనలనందరినీ ఒకటిగా చేసి జీవితంలో ముందుకు వెళ్ళడానికి ధైర్యాన్నిస్తాయి. మనకు దారిలో యెన్ని కష్టాలు వచ్చినా సరే వాటితో సంబంధం లేదు. మనం ఆయన బిడ్డలం. అందుచేత మన అంతిమ గమ్యం తప్ప మిగతావాటి గురించి పట్టించుకోనవసరం లేదు.

ఓం సాయి !

మీరు మీ వెబ్ సైట్ ద్వారా యెంతో సేవ చేస్తున్నారు.

అందులోనున్న లీలలను చదివినప్పుడు నాకవి అపారమైన సంతోషాన్ని, విశ్వాసాన్ని కలుగచేస్తున్నాయి.

ప్రస్తుతం నా ఉద్యోగం పోయినందువల్ల నేను చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాను, మరో ఉద్యోగాన్నివెతుక్కుంటున్నాను. బాబా ఆశీర్వాదములతో నాకు త్వరలోనే స్థిరమైన ఉద్యోగం వస్తుందని నాకు ఖచ్చితంగా తెలుసు.  సాయి నన్ను దండతో అనుగ్రహించిన లీలని మీకందరకూ ఇప్పుడు చెపుతాను.

నా ఉద్యోగం పోయింది (ఖర్చులు తగ్గించుకునే కారణంగా) ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాను. సాధారణంగా నేను మా యింటికి 6 కి.మీ. దూరంలో ‘గౌరివాక్కం’ లో ఉన్న సాయి గుడికి వెడుతూ ఉంటాను. నేను ఈ గుడికి శనివారం/ఆదివారం వెడుతూ ఉంటాను. మా యింటికి 15 కి.మీ. దూరంలో “గిండీ” అనే ప్రదేశంలో మరొక సాయి గుడి ఉంది. ఇక్కడ గుడిలో సాయి విగ్రహం అద్వితీయంగా నలుపు రంగులో ఉంటుంది.

సాధారణంగా సాయి విగ్రహాలన్నీ తెలుపు రంగులో ఉంటాయి. నాకు తెలిసున్నంతవరకు ఈ గుడిలో మాత్రమే సాయి విగ్రహం నలుపు రంగులో ఉంది. ఈ మందిరం నేను ఆఫీసుకు వెళ్ళే దారిలో ఉంది. నేను ఉద్యోగానికి రాజీనామా చేసే ముందు (మూడు వారాల క్రితం) ఈ గుడికి వెళ్ళి, నాకు తొందరలోనే సరియైన ఉద్యోగం రావాలని సాయిని ప్రార్థించాను. ఈ మందిరాన్ని దర్శించిన తరువాత నాకు ఎంతో ప్రశాంతత లభించింది.

(రెండు వారాల క్రితం) నేను ఒక గురువారము నాడు ఈ గుడికి వెడదామనుకున్నాను.  అందుచేత, నేను నా భార్యతో కూడా రైల్వేస్టేషన్ కి వెళ్ళి దిగి అక్కడినించి ఈ గుడికి వెడదామనుకున్నాను. నా భార్య, “మనం ఎప్పుడూ గౌరివాక్కం గుడికే వెడుతున్నాముగా, అందుచేత ఆ గుడికే వెళ్ళండి” అంది.

అందుచేత, నేను ఎప్పుడూ వెళ్ళే గౌరివాక్కం సాయి గుడికే వెళ్ళి, నాకు తొందరలోనే ఉద్యోగం ఇమ్మని సాయిని ప్రార్థించాను. గిండీలో ఉన్న నలుపు రంగులోని సాయి విగ్రహం ఉన్న గుడికి వెళ్ళలేకపోయినందుకు నాకు కొంచెం నిరాశ కలిగింది.

క్రిందటి గురువారం మేము పుట్టినరోజు పార్టీకి వెళ్ళి యింటికి తిరిగి వస్తున్నాము. దారిలో మా కారుకి కొంచెం ట్రబుల్ రావడం వల్ల కారు ఆపవలసివచ్చింది. పొగ కూడా రావడం వల్ల, మరలా డ్రైవింగ్ చేయడానికి అరగంట పడుతుందని డ్రైవర్ చెప్పాడు.

నేను బయటకు చూసేటప్పటికి, గిండీ లో ఉన్న సాయిమందిరానికి వెళ్ళే సందు వద్దే సరిగ్గా మా కారు ఆగిపోవడంతో నాకు ఆశ్చర్యం వేసింది. నేను నా భార్యతో కనీసం యిప్పుడైనా ఆ మందిరానికి వెళ్ళి వస్తానని చెప్పి, గుడివైపు నడవటం మొదలు పెట్టాను. అప్పుడు రాత్రి 8.45 అవుతుండటంతో గుడి కూడా మూసే ప్రయత్నంలో ఉన్నారు.

రెండు నిమిషాలలో నేనక్కడకు చేరుకుని సాయిని నా కర్మలన్నిటినీ తొలగించి తొందరలోనే నాకు ఉద్యోగం ఇచ్చి అనుగ్రహించమని ప్రార్థించాను. వెంటనే పూజారి గులాబీల దండ ఇచ్చారు, నాకు నోట మాట రాలేదు, ఎంతో అనుభూతి చెందాను. దండ బహూకరించినందుకు నేను సాయికి ధన్యవాదములు తెలుపుకున్నాను (గురువారమునాడు వచ్చిన బాబా ప్రసాదం అది) , బాబా త్వరలోనే నా కోరిక తీరుస్తారని గట్టి నమ్మకం ఏర్పడింది.

ఈ గుడికి వెడదామని ముందర మేము అనుకోలేదు. పుట్టినరోజు పార్టీకి వెళ్ళి తిన్నగా యింటికి వచ్చేద్దామనుకున్నాము. కాని బాబా నిర్ణయం, నేను ఈ మందిరాన్ని దర్శించాలని, అందుచేతనే కారు ఆగిపోయింది. బాబా మాయందు చూపిస్తున్న ప్రేమకి మాకు చాలా సంతోషం వేసింది. నేను 5 నిమిషాల తరువాత కనుక వెళ్ళి ఉంటే గుడి మూసేసి ఉండేవారు.

సాయి యెప్పుడూ మనతోనే ఉంటారని చెప్పడం కోసమే నేను ఈ అనుభవాన్ని మీకు చెపుతున్నాను. ఆయన మన సమస్యలనించి రక్షిస్తూ ఉంటారు, అనుకూలంగా సంజ్ఞలతోనూ, భంగిమలతోనూ తెలియచేస్తూ ఉంటారు.  అందరికీ కూడా ఆరోగ్యాన్ని, శాంతిని ప్రసాదించమని బాబాని ప్రార్థిస్తున్నాను.

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles