బాబా ప్రసాదించిన సంతానం



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

బాబా ప్రసాదించిన సంతానం

చిన్నప్పటి నుండి నేను బాబా భక్తురాలిని.  నేను గృహిణిని. బాబా నాకు ఎన్నో అనుభవాలనిచ్చారు. నాకెప్పుడు అవసరం వచ్చినా ఆయన సహాయం చేస్తున్నారు.  రెండుసంవత్సరాల క్రితం నాకు వివాహమయింది.  సంతానం కోసం ఎదురు చూస్తున్నాను.  నాకు సంతానం ప్రసాదించమని ప్రతిరోజు బాబాని ప్రార్థిస్తూ ఉన్నాను.

నెలలు గడుస్తున్నా ఎటువంటి సూచనలు కలగలేదు.  బంధువులందరూ శుభవార్త ఎప్పుడు చెపుతావు అని అడగడం ప్రారంభించారు.  నేనెప్పుడు ఎదురుపడినా వారలా అడగడం నాకు చాలా ఇబ్బందిగా ఉండేది.  నన్ను నిరాశకు గురిచేసేది.  శ్రీసాయి సత్ చరిత్ర పారాయణ ప్రారంభించాను.  ప్రతినెల పారాయణ చేస్తున్నాను. మనస్పూర్తిగా  బాబానే నమ్ముకున్నాను. 

ఒకరోజున డాక్టర్ దగ్గిరకి వెళ్ళి పరీక్ష చేయించుకుందామనుకున్నాను.  డాక్టర్ పరీక్ష చేసి (పీసిఓడి) పోలీ సిస్టిక్ ఒవేరియన్ డిజార్డర్ ఉందని చెప్పింది.  ఆరు నెలలు వాడమని టాబ్లెట్స్ ఇచ్చింది.  ఇది వినగానే నేను హతాశురాలినయ్యాను.

ప్రశ్నలు జవాబులలో బాబాని అడిగాను.  “నీ బాధలన్నీ ఒక్క నెలలోనే పరిసమాప్తమవుతాయి. నీ జబ్బు నయమవుతుంది” అనే జవాబు వచ్చింది.  మరలా ఇంకొక ప్రశ్న అడిగినప్పుడు “నీకు మగపిల్లవాడు జన్మిస్తాడు. నీ బంధువులందరూ నిన్ను అభినందిస్తారు” అని జవాబు వచ్చింది.

ఈ రెండు జవాబులు వచ్చిన మరుక్షణంలో కిటికీ గుండా బయటకు చూశాను. బాబా నన్ను ఆశీర్వదిస్తున్నారా అన్నట్లుగా బయట వెళ్ళే రిక్షామీద బాబా బొమ్మ కనపడింది. 

డాక్టర్ ఇచ్చిన ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోలేదు. మరుసటి నెలలోనే నేను గర్భవతినయ్యాను. సుఖప్రసవమయ్యి నాకు మగపిల్లవాడు జన్మించాడు.  బాబా నా మొరాలకించారు.  ఆయన మీద నమ్మకం ఉంచుకొని ఆయననే నమ్ముకుంటే ఖచ్చితంగా ఆయన మనకు సహాయం చేస్తారు. 

ఓం సాయిరాం

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles