Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
యెవాలా గ్రామానికి చెందిన యువతీ రమాబాయి. అందము, అణకువ, తెలివితేటలూ విజ్ఞత ఉన్నా కూడా, ధనము లేని కారణంగా ఆమెకు 25 సంవత్సరములు వచ్చినా కూడా వివాహము జరుగలేదు. ఆ రోజుల్లో అంటే దాదాపు 100 సంవత్సరాల క్రితం ఆడపిల్ల 25 సంవత్సరాల వరకు అవివాహిత గా ఉంది అంటే ఎంతో ఆక్షేపణ గా ఉండేది.
ఒకనాడు దాసగణు ఆ గ్రామంలో బాబా లీలలను హరికథా గానం చేస్తున్నాడు. ఆ ప్రదేశానికి ఆనుకునే రమాబాయి ఇల్లు. ఆమె అ హరికథను చాలా శ్రద్ధగా విన్నది. సాయి గురించి అంత వివరంగా తెలుసుకోవడం ఆమెకు అదే ప్రధమం. తనకు మంచి వరుడితో వివాహం జరిగితే, షిరిడి వెళ్లి దర్శనం చేసుకుని ఒక కొబ్బరికాయ సమర్పించు కుంటాను అని మొక్కుకున్నది.
ఆమె వేదన విన్న సాయి మహారాజ్ ఆమె కోరిక తీర్చారు. వివాహం అయిన తర్వాత, ఆమె పుట్టింటి వారు, అత్తింటి వారు ఇచ్చన నగలు వేసుకొని, వారి కుటుంబ ఆచారం ప్రకారం పెద్ద ముక్కెర పెట్టుకొని భర్త తో కలిసి షిరిడి వెళ్ళింది. ద్వారకామాయి లోకి అడుగుపెట్టగానే, బాబాను చూసి అమితానందం పొందింది.
అంతలోనే ఆమె తన ముక్కెర పోయిన విషయం తెలుసుకొని ఎంతో విచారపడింది. ముక్కెర లేకపోతె అత్తగారు ఇంట్లోకి అడుగు పెట్టానీయదు. ఆ భయంతో ముక్కెర వెతకటంలో మునిగిపోయింది. బాబాకు విషయం తెలిసి ఆమె దగ్గరకు వచ్చి, ఏమ్మా! ఏమిటి వెతుకుతున్నావు అని అడిగారు. నా ముక్కెర పోయింది, వెతుకుతున్నాను అని చెప్పింది రమాబాయి.
సరే, నాకు టెంకాయ మొక్కుకున్నావు కదా, అది నాకు ఇచ్చేయి అని అడిగారు బాబా. అసలే విచారంగా ఉన్న రమాబాయి నా ముక్కెర పోయి నేను ఏడుస్తుంటే, నీ టెంకాయ గొడవ ఏంటి బాబా? అని చెప్పింది. నా టెంకాయ నాకు ముఖ్యం అమ్మా అని సమాధానం ఇచ్చారు బాబా. కాదు బాబా, నాకు నా ముక్కెర ముఖ్యం, అది లేకపోతే నేను చాల కష్టాలు పడతాను అని చెప్పింది.
బాబా మళ్లీ మళ్లీ టెంకాయ గురించి ప్రశ్నించేసరికి, దు:ఖంలో ఉన్న రమాబాయి ఇదిగో నీ టెంకాయ తీసుకో అని గట్టిగా నేలకేసి కొట్టింది. బాబా పకపకా నవ్వేసరికి రమాబాయికి ఉక్రోషం వచ్చి ఏడ్చింది. అమ్మా, ఇక్కడ చూడు అన్నారు బాబా.
పగిలిన టెంకాయ పక్కనే ముక్కెర ఉంది. రమాబాయి సంతోషం పట్టలేకపోయింది. దంపతులిద్దరూ బాబా కాళ్ళకు మొక్కి ఆశీస్సులు తీసుకున్నారు. తాను అమితంగా ప్రేమించే భక్తులను ఇలా ఆటపట్టించేవారు సాయి…..
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- బాబా చరిత్ర వినుటతో కంటి చూపు పెరుగుట
- ఎక్కడ విన్నా సాయి నామమే,ఎక్కడ చూసిన సాయి రూపమే.
- సద్గురుసాయి.
- సాయి మార్గములో పెద్దలు (శ్రీ అచలానంద సరస్వతి, బషీర్ బాబా)
- సాయి మార్గములో పెద్దలు(శ్రీ కుర్తాళం పీఠాధిపతి)
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments