‘‘నా సచ్చరిత్రను పారాయణం చేసిన ఇంట ‘లేదు’ అన్న మాట వినబడదు.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!

ముందు భాగం కోసం ఇక్కడ  క్లిక్ చేయండి

(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)

 

‘‘భాటే’’ అని పిలిచారు‘‘బాబా’’. భాటే సమీపించాడు బాబాని.‘‘ఏమంటున్నాడు మీ స్నేహితుడు హేమాదిపంత్‌?’’ అడిగారు.

హేమాద్రిపంత్‌ని ‘హేమాదిపంత్‌’గా మార్చి, ఆ పేరుని తనకి ఉద్దేశించడాన్ని గమనించకపోలేదు అన్నాసాహెబ్‌. సిగ్గుతో తల వంచుకున్నాడు మళ్ళీ. కన్నీరుపెట్టుకున్నాడు.

గుర్తించారది బాబా.‘‘హేమాదిపంత్‌’’ అన్నాసాహెబ్‌ని పిలిచారు.బాబాని సమీపించి, అయన పాదాల మీద వాలిపోయాడు అన్నాసాహెబ్‌.‘‘తప్పు చేశాను బాబా! గురువు గురించి తప్పుగా మాట్లాడాను. నన్ను క్షమించు.’’ అన్నాడు.

బాబా అతని శిరసున చేయి ఉంచి ప్రేమగా నిమిరారు.‘‘హేమాదిపంత్‌’’ అన్నారు. కన్నీటితో తలెత్తి చూశాడు అన్నాసాహెబ్‌.‘‘నా జీవితచరిత్ర రాస్తానన్నావుగా, రాయి.’’ అన్నారు ‘‘బాబా’’. కన్నీరు తుడుచుకున్నాడు అన్నాసాహెబ్‌. ఆనందంగా చూశాడు.

‘‘నీకో సంగతి తెలుసా? నా సచ్చరిత్రను నీతో రాయించేందుకే నిన్నిక్కడకి రప్పించాను. రాసేది నువ్వే! కాకపోతే రాయించేది నేను. 

నీ చేత నా సచ్చరిత్ర రాయించేందుకు నేను ఇక నుంచి నీతోనే ఉంటాను. నీలోనే ఉంటాను.’’ అన్నారు బాబా.‘‘మీరు నాతో ఉంటారా? నాలో ఉంటారా?’’ ఆశ్చర్యానందాలు పోయాడు అన్నాసాహెబ్‌.అవునన్నట్టుగా తలూపారు బాబా.

ఇలా అన్నారంతలోనే.‘‘తనలోని అహంకారాన్ని వదులుకుని, నా పాదాలని ఆశ్రయించి, నా సచ్చరిత్రను చదివిన వారంతా ఎల్లప్పుడూ సుఖ సౌఖ్యాలతో వర్ధిల్లుతారు. వారికి ఎలాంటి ఆపదా రానీయను. కంటికి రెప్పలా వారిని కాపాడడం నా బాధ్యత. ఇది ప్రమాణం చేసి చెబుతున్నాను.’’ గాలిలో చేయి జాచి ఒట్టు పెట్టారు బాబా.

‘‘నా సచ్చరిత్రను పారాయణం చేసిన ఇంట, నా కథలూ బోధనలూ విన్న వారి ఇంట ‘లేదు’ అన్న మాట వినబడదు. ఇదే నా సచ్చరిత్రకి తార్కాణం.’’ అన్నారు బాబా.

బాబా చేతులందుకున్నాడు అన్నాసాహెబ్‌. కళ్ళకద్దుకున్నాడు వాటిని.‘‘వెళ్ళు, నా సచ్చరిత్ర రాయడం ప్రారంభించు. ఎలాంటి ఆటంకమూ కలుగకుండా చూసే బాధ్యత నాది.’’ అన్నారు బాబా. అభయమిచ్చారు.

‘‘నేను చాలా అదృష్టవంతుణ్ణి.’’ అన్నాడు అన్నాసాహెబ్‌. నాటి నుంచే అతని పేరు ‘హేమాదిపంత్‌’గా మారిపోయింది.సచ్చరిత్ర మరాఠీలో శ్రీకారం చుట్టుకుంది.

హేమాదిపంత్‌ తరుచూ షిరిడీకి రావడం ప్రారంభించాడు. భక్తుల అనుభవాలను అడిగి తెలుసుకుని, వాటిని టూకీగా రాసుకోసాగాడు. ముందు టూకీగా రాసుకుని, తర్వాత విపులంగా వాటిని వివరించే ప్రయత్నాలు చేశాడు.

బాబా భక్తుల అనుభవాలు ఊహాతీతంగా ఉండేవి. హేమాదిపంత్‌కి కూడా అలాంటి అనుభవం ఒకటి కలిగింది.

తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles