Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!
ముందు భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)
ఓ రాత్రి హేమాదిపంత్ కలలో బాబా కనిపించారు.‘‘రేపు నీ ఇంటికి భిక్షకు వస్తున్నాను.’’ అన్నారు. ఆశీర్వదిస్తున్నట్టుగా చేతిలోని పువ్వులను పంత్ మీద విసిరి అదృశ్యమయ్యారు.
పంత్కి వెంటనే మెలకువ వచ్చింది. భార్యని లేపి, తనకి వచ్చిన కల గురించి చెప్పాడతను.‘‘అంత అదృష్టమా? మన ఇంటికి బాబా భిక్షకు వస్తారా?’’ అన్నది భార్య.‘‘కల కన్నారు. అదే పది వేలు.’’ అన్నది అంతలోనే.‘‘కల కాదు, నిజం.’’ అన్నాడు పంత్.
దానిని ఋజువు చేస్తున్నట్టుగా మంచమ్మీది పువ్వుల్ని చూపించాడు. పువ్వుల్ని తానూ అప్పుడే చూశాడు. ఆశ్చర్యపోయాడు. ఆ పువ్వుల్నే బాబా కలలో విసిరారు.‘‘ఎంత కాలానికి బాబా అనుగ్రహం లభించింది.’’ పొంగిపోయింది పంత్ భార్య.
తెల్లారనే లేదు. లేచి, శుచిగా వంట చేయసాగింది. మధ్యాహ్నమయింది. భోజనాల వేళయింది. బాబా కోసం నిరీక్షిస్తూ కూర్చున్నారు దంపతులిద్దరూ. బాబా రాలేదు. కాని, బాబా భక్తులు, ఇద్దరు ముస్లిమ్‌లు వచ్చారు. కాగితంతో మూసిన ఓ పటాన్ని వారికిచ్చారు.
‘‘ఈ పటం మీకిమ్మన్నారు బాబా’’ అని చెప్పారు. వెళ్ళిపోయారక్కణ్ణుంచి. బాబా ఇచ్చిన పటం. ఏ పటమో ఏమో! చూసేందుకు ఉత్సాహపడుతూ పటం మీది కాగితాన్ని తొలగించాడు పంత్.
తొలగించి చూస్తే అది బాబా పటమే! అభయహస్తంతో ఆశీర్వదిస్తున్న బాబా కొలువై ఉన్నారందులో.‘‘భిక్షకు వస్తానన్నాను. వచ్చాను, చూశావా?’’ అన్నట్టుగా ఉన్నాయి పటంలోని బాబా చూపులు.
పటాన్ని కళ్ళకద్దుకున్నారు పంత్ దంపతులు. దానిని ఓ పీట మీద పెట్టి, బాబా కోసం వండిన వంటలన్నీ ఆ పటానికి నైవేద్యం చేశారు.కొన్నాళ్ళకు బాబాని దర్శించుకున్నారిద్దరూ.
పంత్ దంపతుల్ని చూస్తూనే బాబా ఇలా అన్నారు.‘‘భిక్షకు వస్తానన్నాను, మాటంటే మాటే! వచ్చాను కదా?’’నవ్వుతూ నిల్చున్నారు దంపతులు.
‘‘తల్లీ నీ వంటలన్నీ అద్భుతం. మంచి రుచిగా ఉన్నాయి. కడుపు నిండా తిన్నాను. ఇప్పటికీ నాలిక మీద నాటి రుచులే’’ అన్నారు బాబా. పంత్ దంపతులిద్దరూ చేతులు జోడించి, బాబాని ప్రార్థిస్తూ కళ్ళు మూసుకున్నారు.
తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- ఈ రోజు భిక్షా పాత్రను ఇతనికిచ్చి పంపించండి. ఇతను భిక్షకు వెడతాడు–శ్రీ జి.జి. నార్కే-3–Audio
- నీ బాబా నీకంటే ముందే నీ ఇంటికి వచ్చారు
- నీ బాబా నీకంటే ముందే నీ ఇంటికి వచ్చారు–Audio
- పాఠకుడే పారాయణ గ్రంధకర్త …..సాయి@366 జూలై 15…Audio
- కడివెడు మజ్జిగ…..సాయి@366 ఆగస్టు 28…Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments