Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
మానవాళి ని ఉద్ధరించడానికి అవతరించిన మహానుభావులలో అగ్ర గణ్యులు శ్రీ షిర్డీ సాయిబాబా. సుమారు 60 సంవత్సరాల పాటు ఆయన షిర్డీ లో నివశించి తన అవతార కార్యం నిర్వహించారు .
బాబా తమ భక్తుల కష్టాలు, కోరికలూ తీర్చడమే గాక వారిని మంచి ప్రవర్తన కలిగి మంచి మార్గంలో జీవించేలా చేసేవారు. అందుకు ప్రజలందరికీ తారతమ్యాలు లేని ప్రేమానుబంధాలు ఏర్పరచడం ఆయన అవతారకార్యంలో ముఖ్యమైన అంశం. అందుకని ఆయన మసీదులో కులమత భేదాలు, ధనిక -పేద భేదాలు లేవు.
శిరిడీలో హిందువులు, ముస్లిములూ అయిన భక్తులు కలిసి మెలిసి ఉండేలా బాబా ప్రోత్సహించేవారు . శ్రీరామనవమి, ఉరుసు ఉత్సవము ఒకేరోజున చేసుకోవడము, కులమత భేదాలు లేకుండా ఆరతులలోను, చావడి ఉత్సవంలోను పాల్గొనడము, ఫాతిహా చేయించడము, ధునికి నైవేద్యమర్పించడమూ భక్తులకు అలవాటు చేశారు . అందువలన పరమత ద్వేషం లేకుండా పరస్పరం గౌరవించు కునేవారు భక్తులు.
ఆ రోజులలో బ్రిటిష్ ప్రభుత్వం మనదేశంలోని స్వాతంత్రోద్యమాన్ని అణచి వేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నది. శిరిడీలో హిందూ ముస్లిం భేదం లేకుండా అందరూ కలసిమెలసి ఉంటే తమ అధికారం ఏమైపోతుందో ననే భయం బ్రిటిష్ వారికి కలిగింది.
అంతేకాదు, లోకమాన్య బాలగంగాధర్ తిలక్ వంటి దేశ నాయకులు ఆయనను దర్శించడము, ఖాపర్దే లాంటి ప్రముఖులు సాయిని సేవించడమూ వారికి మరింత అనుమానం కలిగించింది. అందుకని శిరిడీలో సాయి వద్ద జరిగే కార్యకలాపాలు, వచ్చి వెళ్ళే భక్తులు, ఆయనకొచ్చే దక్షిణలు వీటిపై నిఘా ఉంచడానికి తెల్ల ప్రభుత్వం నిర్ణయించింది.
ఆ రోజులలో భక్తుల పాపాలను హరించి వారిని ఉద్ధరించడానికి కొంత మంది నుండి ఆయన దక్షిణ స్వీకరించే వారు. ఆ విధంగా ఆయనకి వచ్చే దక్షిణ ఆ రోజుల్లో ఒక గవర్నర్ జీతం కంటే ఎక్కువగా ఉండేదట.
ఇది గమనించిన బ్రిటిష్ ప్రభుత్వం ఆయన ఆదాయం పై పన్ను విధించాలని భావించింది. ఆయనకి వచ్చే ఆదాయాన్ని లెక్కించడానికి ఒక అధికారిని నియమించింది. హిందువు గాని ముస్లిం గాని అయితే బాబా వల్ల ప్రభావితం అయ్యే అవకాశం వుందని ఒక క్రైస్తవుణ్ణి అధికారిగా నియమించింది . ఆయన పేరు చక్ర నారాయణ్ .
ప్రతి రోజూ బాబా వద్దకి ఎవరు వచ్చి పోతున్నారు ఎంతెంత దక్షిణలు ఇస్తున్నారు అన్న వివరాలని ఈ అధికారి ఒక డైరీ లో వ్రాసి ఉంచేవాడు. చక్రనారాయణ్ ఎంతో అప్రమత్తంగా బాబాను గమనిస్తూ ఉండేవాడు . భక్తులు బాబాను దర్శించి ఆయనకు తాము ఇవ్వదలచుకున్నంత దక్షిణ సమర్పించుకునేవారు.
ఆయన తన కొచ్చిన దక్షిణంతా తిరిగి పంచేసేవారు. ఆయన లెక్కపెట్టి ఎవ్వరికీ దక్షిణ యిచ్చేవారు కాదు. అయినా కొంతమందికి ప్రతిరోజూ సరిగ్గా అంతే పైకం ముట్టేది. చివరకి రాత్రి అయ్యేసరికి ఏమీ లేని పేద ఫకీరు గానే మిగిలే వారు.
అంతే కాదు, ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అయన పంచేసే డబ్బు ఆయనకి దక్షిణ రూపంలో వచ్చిన దాని కంటే ఎక్కువ గా ఉండేదట. ఈ మిగతా సొమ్ము ఎక్కడ నుండి వచ్చిందో చక్ర నారాయణ్ కి అర్థం అయ్యేది గాదు. ఎంత ప్రయత్నించినా ఆయన అదనపు పైకం ఎలా పంచగలుగుతున్నారో తెలుసుకోలేకపోయాడు. అందువల్ల ఆయనకి దివ్య శక్తులు వున్నాయని నిర్థారించు కున్నాడు.
బాబా అన్ని మతాలనూ, వ్యక్తులనూ గౌరవించేవారు. అప్పట్లో ప్రజలకు క్రైస్తవులంటే ఎంతో చులకన భావం ఉండేది. ఒకసారి బాబాతో ఒక భక్తుడు మరొకరి గురించి, “బాబా అతను క్రైస్తవుడు!!” అన్నాడు. వెంటనే బాబా, “క్రైస్తవుడయితే నేమి? అతడు నా తమ్ముడే!” అన్నారు.
అన్ని మతాలపట్ల బాబాకు ఉన్న ఉదారత, ఉన్నతమైన జీవన విధానము, వైరాగ్యము, ధర్మము చక్రనారాయణ్ ను ఎంతగానో ఆకర్షించాయి. బాబాపై నిఘా వేస్తున్న చక్రనారాయణ్ కు ఆయన దివ్యత్వం అర్ధమవ్వసాగింది. అతడు కూడా చివరకు ఆయన భక్తుడై పోయాడు.
భగవంతుని లీలలు అర్థం చేసుకోవడం ఎవరి తరం?
బాబా ధనం పట్ల గానీ మరే భౌతిక ఆకర్షణల పట్ల గానీ ఎంతో నిర్లిప్తంగా ఉండే వారనీ అయన నిశ్చయంగా ఒక మహానుభావుడనీ ఈ చక్ర నారాయణ్ చెప్పాడు. ఈ విధంగా ఆయనని అనేక విధాలుగా పరీక్షించడానికి వచ్చి అయన భక్తులుగా మారిన వారెందరో.
అలాగే జోసెఫ్ అనే మరో క్రైస్తవుడు కూడా బాబాను సేవించేవాడు.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- నారాయణ్ గోపినాద్ దిఘే
- సాయిబాబావారు అడిగే దక్షిణకు వివరణ మూడవ భాగము.
- సాయిబాబావారు అడిగే దక్షిణకు వివరణ రెండవ భాగము.
- గజానన్ నర్వేకర్
- ఇస్తానన్న దక్షిణ మర్చిపోతే స్వప్నం ద్వారా గుర్తు చేసారు బాబా
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments