సాయిబాబావారు అడిగే దక్షిణకు వివరణ రెండవ భాగము.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయి బాబా     …          సాయి బాబా     …         సాయి బాబా     …          సాయి బాబా

ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.

బాబా వారు ‘దక్షిణ’ అడిగినపుడు ధనమే ఇవ్వనక్కర లేదను అర్ధము కూడ పెక్కు సంఘటనల వలన తెలియవచ్చుచున్నది. దీనికి రెండు ఉదాహరణములు.

(1)బాబా వారు 15 రూపాయలు దక్షిణ యిమ్మని ప్రొఫెసర్ జి.జి. నార్కే నడుగగా,అతడు తన వద్ద దమ్మిడీయయిన లేదనెను.

దానికి బాబా యిట్లనెను. “నీ వద్ద ధనము లేదని నాకు తెలియును .కాని నీవు యోగవాసిష్టము చదువుచున్నావు గదా? దాని నుంచి నాకు దక్షిణ యిమ్ము!”  దక్షిణ యనగా నిచ్చట గ్రంధమునుంచి  నేర్చుకొనిన విషయములను జాగ్రత్తగా హృదయములో దాచుకొనుమని అర్ధము.

(2)ఇంకొకసారి,తర్ఖడ్ భార్యను 6 రూపాయలు దక్షిణ యిమ్మని బాబా యడిగెను .తన వద్ద పైకము లేకుండుటచే  ఆమె మిగుల చిన్నబోయెను.అప్పుడు అక్కడనే యున్న ఆమె భర్త బాబా వాక్కులకు అర్ధము జెప్పెను.తన ఆరుగురు శత్రువులను (కామక్రోధ లోభాదులను)తమకు పూర్తిగ సమర్పించవలెనని బాబా భావమని యతడు తన భార్యకు వివరించెను. దానికి బాబా పూర్తిగా సమ్మతించెను.

బాబా దక్షిణ రూపముగా కావలిసినంత ధనము వసూలు చేసినప్పటికి, దానినంతయు వారు ఆనాడే పంచి పెట్టుచుండిరి.

ఆ మరుసటి యుదయమునకు  బాబా మామూలు పేద ఫకీరగుచుండెను.

10 సంవత్సరముల కాలము వేల కొలది  రూపాయలను దక్షిణరూపముగా పుచ్చుకొనినను, మహాసమాధి చెందునాటికి ఏడు రూపాయలు మాత్రమే వారి చెంత మిగిలెను.

వేయేల బాబా దక్షిణపుచ్చుకొనుట భక్తులకు దానమును, త్యాగమును నేర్పుటకోరకే.

సాయి బాబా     …          సాయి బాబా     …         సాయి బాబా     …          సాయి బాబా

ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles