Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.
బాబా తమను జూచుటకు వెళ్ళిన వారి వద్ద నుండి దక్షిణ పుచ్చుకొనుట అందరికి తెలిసిన సంగతే.
బాబా ఫకీరయినచో,వారికి దేనియందు అభిమానము లేకున్నచో,వారు దక్షిణ ఎందుకు అడుగవలెను?వారు ధనమునేల కాక్షించవలెనని ఎవరైన అడుగవచ్చును.దీనికి సమాధానమిది.
మొట్టమొదట బాబా ఏమియు పుచ్చుకొనెడివారు కారు.కాల్చిన అగ్గిపుల్లలను జాగ్రత్త పెట్టుకొని జేబులో వేసుకొనెడివారు.
భక్తులను గాని,తదితరులనుగాని బాబా యేమియు అడిగెడివారు కారు.
ఎవరైన ఒక కాని గాని రెండు కానులుగాని యిచ్చినచో వానితో నూనె,పొగాకు కొనెడివారు.బీడిగాని,చిలుముగాని పీల్చేవారు.
రిక్త హస్తములతో యోగులను చూడరాదని కొందరు ఒకటిగాని రెండుగాని పైసలను బాబా ముందర పెట్టేవారు.ఒక్కకాని యిచ్చినచో బాబా జేబులో నుంచుకొనెడివారు.అర్ధణా అయినచో తిరిగి యిచ్చేవారు.
బాబా కీర్తి అన్ని దిశలకు వ్యాపించిన తరువాత అనేకమంది బాబాదర్శనమునకై గుంపులు గుంపులుగా రాజొచ్చిరి.అప్పుడు బాబా వారిని దక్షిణ అడుగుచుండెను.
దానము గట్టి విశ్వాసముతోను,ధారాళముగను,అణకువతోను,భయముతోను,కనికరముతోను చేయవలెను.
భక్తులకు దానము గూర్చి బోధించుటకు,ధనమందు వారికి గల అభిమానమును పోగొట్టుటకు వారి మనములను శుభ్ర పరచుటకు బాబా దక్షిణ అడుగుచుండెను.
కాని ఇందులో ఒక విశేషమున్నది.
బాబా తాము పుచ్చుకొనుదానికి వందరెట్లు తిరిగి యివ్వవలసి వచ్చుచుండెను.ఇట్లు అనేకమందికి జరిగెను.
దీనికి ఒక ఉదాహరణము.గణపతిరావు బోడస్ అను ప్రముఖ నటుడు,తన మరాఠీ జీవితచరిత్రలో గడియ గడియకు బాబా దక్షిణ అడుగుచుండుటచేత ధనముంచుకొను సంచి తీసి బాబా ముందు కుమ్మరించితి ననియు,దీని ఫలితముగా ఆనాటి నుండి తన జీవితములో ధనమునకు యెట్టి లోటు లేకుండెననియి వ్రాసెను.
ఎల్లప్పుడు కావలసినంత ధనము గణపతిరావు బోడస్ కు దొరకుచుండెను.
సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా … సాయి బాబా
ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.
Latest Miracles:
- సాయిబాబావారు అడిగే దక్షిణకు వివరణ రెండవ భాగము.
- సాయిబాబావారు అడిగే దక్షిణకు వివరణ మూడవ భాగము.
- శ్రీ సాయిబాబావారు శివనేశన్ స్వామిలా దర్శనమిచ్చారు.
- శ్రీసాయి సత్ చరిత్ర – తత్వం – అంతరార్ధం – 8వ.భాగం (ఆఖరి భాగం)
- స్వామి శరణానంద ఒకటవ భాగం–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
One comment on “సాయిబాబావారు అడిగే దక్షిణకు వివరణ ఒకటవ భాగం.”
Maruthi Sainathuni
September 16, 2017 at 7:10 pmSai Baba…Sai Baba