స్వామి శరణానంద ఒకటవ భాగం–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



This Audio Prepared by Mrs Lakshmi Prasanna


సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు

ప్రాణ్ గోవిందజీ అతని భార్య మణిగౌరి ఇద్దరూ షిరిడీ యాత్రకు వెళ్ళారు.  బాబా ఆశీర్వాదంతో వారికి 05.04.1889 లో సూరత్ లోని బర్దోలీ తాలూకాలోని మోటా గ్రామంలో వామన్ పటేల్  జన్మించాడు.

అతని పూర్తి పేరు వామనరావ్ ప్రాణ గోవింద పటేల్మూడు సంవత్సరాల వయసులో అతనికి చాలా జబ్బు చేసింది.  పిల్లవాడు బ్రతుకుతాడా లేదా అని భయపడ్డారు తల్లిదండ్రులు.  

బాబా ఒక ఫకీరు రూపంలో వచ్చి అతని తల్లికి ఊదీనిచ్చారు.  ఊదీని నీళ్ళలో కలిపి తీర్ధంగా పిల్లవానికి ఇమ్మని చెప్పారు.  పిల్లవానికి వీపు మీద కుడివైపున పుట్టుమచ్చ ఉందని అతను గొప్ప సత్పురుషుడు అవుతాడని చెప్పాడు ఆ ఫకీరు.

తల్లి ఆ ఫకీరు చెప్పినట్లుగానే తీర్ధాన్ని పిల్లవాడి చేత త్రాగించింది.  పిల్లవాడు కోలుకొన్నాడు.

వామనరావు ప్రాణ గోవింద పటేల్ ప్రాధమిక విద్యాభ్యాసం సూరత్ లోను అహమ్మదాబాద్ లోను జరిగింది.

13 సంవత్సరాల వయసులో సోమనాధ్ మందిర్ కి వెళ్ళినపుడు బాబా అతనికి ఒక ఫకీరు రూపంలో దర్శనమిచ్చారు.

1910 వ.సంవత్సరం బొంబాయి లోని ఎల్ఫిన్ స్టన్ కళాశాలనుండి బి.ఎ. పట్టా పుచ్చుకొన్నాడు.

ఆ తరువాత 1912 లో ఎల్.ఎల్.బి. పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు.  అతని మదిలో ఎప్పుడూ ప్రశ్నలు ఉదయిస్తూనే ఉండేవి.  చదువుకునే రోజుల్లోనే అతను ప్రొఫెసర్లని, సాధువులని, దేవుడు అనేవాడు నిజంగా సాకారంగా ఉన్నాడా లేక నిరాకారంగా ఉన్నాడా? అని ప్రశ్నిస్తూ ఉండేవాడు. 

ఎవరూ కూడా అతనికి సంతృప్తికరమయిన సమాధానాలు ఇవ్వలేకపోయారు.

అతని తండ్రి కొడుకుని స్వామి సమర్ధ శిష్యుడయిన బాలకృష్ణ మహరాజ్ దగ్గరకు 1904 వ.సంవత్సరంలో తీసుకొని వెళ్ళాడు. వామనరావు మహరాజ్ ని కూడా ఇదే ప్రశ్న అడిగాడు.

అప్పుడు వామనరావు వయస్సు 15 సంవత్సరాలు.    వామనరావు దేవుడి గురించి ప్రశ్నించగానే మహరాజ్ కి విపరీతమయిన ఆగ్రహం కలిగింది.

అయినా కాని అతనికి మరాఠీ భాషలో రచించబడ్డ అక్కల్ కోట మహరాజ్ జీవిత చరిత్ర, ఏకనాధ భాగవతం అనే రెండు పుస్తకాలనిచ్చి వాటిని చదవమని చెప్పారు.

వామనరావు బాలకృష్ణ మహరాజ్ తో “ఏసత్పురుషుడయితే నాకు భగవంతుని ప్రత్యక్షంగా చూపించగలరో వారినే నేను నా గురువుగా భావిస్తాను” అన్నాడు.

ఆ పుస్తకాలు చదివినా అతనికి తృప్తి కలగలేదు.  అక్కల్ కోట మహరాజ్ జీవిత చరిత్రలోని సంఘటనలు వామనరావుని ప్రభావితం చేసాయి.

భగవంతుడిని చూపించగలిగే సత్పురుషులు ఇంకా భూమి మీద ఉన్నారని వారు తనకి సహాయం చేయగలరనే నమ్మకం కలిగింది. 

దత్తాత్రేయుని నాలుగవ అవతారమయిన అక్కల్ కోట మహరాజ్ 1878 లో సమాధి చెందారు.  ఆ తరువాత ఆయన స్థానంలోకి వచ్చిన బాలకృష్ణ మహరాజ్ నే వామనరావు తండ్రి తరచూ దర్శించుకుంటూ ఉండేవారు.

వామనరావు తండ్రి బంధువయిన శంకర్ లాల్ కేశవ్ లాల్ భట్ కి పెద్ద యాక్సిడెంట్ అయి ఎడమకాలు బాగా దెబ్బతింది.

ఆ ప్రమాదంలో మోకాలి వద్ద నరం చితికింది.  అన్ని రకాల వైద్యాలు చేయించినా ఫలితం లేకపోయింది.  దాని వల్ల అతను సరిగా నడవలేకపోయేవాడు.

ఇటువంటి పరిస్థితిలో ఒక పూర్ణపురుషుడయిన సద్గురువు ఆశీర్వాదం తోనే అతని కాలు యధాస్థితికి వస్తుందని భావించాడు వామనరావు.  అటువంటి సత్పురుషుని కోసం అన్వేషణ మొదలుపెట్టాడు.

ఖేడ్ జిల్లాకి డిప్యూటీ కలెక్టరయిన హరివినాయక్ సాఠే బాబాకు గొప్ప భక్తుడు. 

ఆయనమీద అచంచలమయిన భక్తి కలవాడు.  ఒకసారి సాఠే, ప్రాణ్ గోవిందదాస్ ని కలుసుకోవడం తటస్థించింది.  సాఠే, గోవిందదాస్ కి బాబా గురించిన లీలలు, మహిమలు కధలు కధలుగా వర్ణించి చెప్పాడు.  అవి ఆయన మీద ఎంతో ప్రభావాన్ని చూపాయి. 

రేపు తరువాయి భాగం …..

శ్రీ సాయి అంకిత భక్తుడయిన స్వామి శరణానంద గారి గురించిన సమాచారం ఈ క్రింది లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles