స్వామి శరణానంద రెండవ భాగం–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



This Audio Prepared by Mrs Lakshmi Prasanna


సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు

1911 మే నెలలో హరివినాయక్ సాఠేనుంచి పరిచయ పత్రం తీసుకొని శంకర్ లాల్ తో షిరిడీకి ప్రయాణమయ్యాడు.  హెచ్.వి.సాఠే, నానా సాహెబ్ చందోర్కర్ బంధువయిన బాలభావు చందోర్కర్ కి పరిచయ పత్రం రాసి వీరి చేతికిచ్చి పంపించాడు.

బాలభావు చందోర్కర్ షిరిడీలో ఒక చిన్న హోటల్ ని నడుపుతున్నాడు.  షిరిడీ ప్రయాణం పెట్టుకున్న రోజులలో వామనరావు తండ్రి సర్జరీ ద్వారా అప్పటికే పన్ను పీకించుకున్నాడు.

చిగుళ్ళు బాగా బలహీనంగాను, బాగా సలుపు పెడుతూ ఉండటం వల్ల గట్టి పదార్ధాలు, ఆఖరికి చపాతీ కూడా నమిలి తినలేని పరిస్థితిలో ఉన్నాడు.

ఇంటిలో *షీరా ఒక్కటే తింటూ ఉండేవాడు.  కాని, షిరిడీలో షీరా ఎవరు తయారు చేసి పెడతారు?  అదే ఆయనకి పెద్ద సమస్యయింది.

కాని ఏమయినప్పటికీ వామనరావు తండ్రి బాబా అనుగ్రహంతో శంకర్ లాల్ కాలు బాగవుతుందనే ఉద్దేశ్యంతో అతనిని వెంటబెట్టుకొని షిరిడీకి వచ్చాడు.

కాస్త గట్టిగా ఉన్న పదార్ధాలను నమలడం కూడా చాలా కష్టంగా ఉండేది ప్రాణ్ గోవింద దాస్ కి.  షిరిడీలో భోజన సమయంలో ప్రాణ్ గోవింద దాస్ కి చపాతీలు వడ్డించారు.  అవి తినక తప్పదు.

“నేనీ చపాతీలను ఎలా తినగలను? ఇంటి దగ్గరయితే హాయిగా షీరా తినగలిగేవాడిని.  ఇంక ఇక్కడ షిరిడీలో చపాతీలు తప్ప వేరే ఇంకేమీ తినడానికి దొరకవు” ఈ విధంగా ఆలోచిస్తూ ఉండగా ద్వారకామాయి నుండి ఒకతను పరిగెత్తుకుంటూ వచ్చి, “బాబాగారు పాత్ర నిండా షీరా తీసుకొని రమ్మని చెప్పారు. 

భోజనాలు అప్పుడే మొదలుపెట్టవద్దని భక్తులందరికీ చెప్పమన్నారు.  షీరా తినకుండా ఎవరూ వెళ్ళవద్దని కూడా చెప్పమన్నారు.   అందుచేత అందరికీ షీరా వడ్డించేంత వరకు వేచి ఉండండని” చెప్పాడు.

ప్రాణ్ గోవింద దాస్ చాలా ఆశ్చర్యపోయాడు.  బాబా ఒక అపూర్వమయిన సత్పురుషుడని, తన మనసును, తన కష్టాన్ని గ్రహించి తన కోసం భోజనం చేసే వేళకు షీరా పంపిస్తున్నారని ఎంతో సంతోషపడ్డాడు.

కాని, వారు షిరిడీ వచ్చిన కారణం శంకర్ లాల్ యొక్క కుంటితనాన్ని వదిలించడానికి.  ఆవిధంగా రెండు రోజులు గడిచిపోయాయి.

బాబా అనుమతి తీసుకొని తిరిగి వెళ్ళిపోదామనుకొన్నారు.  కోపర్ గావ్ వెళ్ళడానికి బాలాగాంధీ దుకాణం దగ్గరకు వచ్చి టాంగా మాట్లాడుకొన్నారు.  శంకర్ లాల్ టాంగా ఎక్కుతుండగా కాలులో విపరీతమయిన నెప్పి కలిగింది. 

తన కాలు ఇంక పనికిరాదనే భావించాడు.  ఆ బాధతోనే తన కాలుని ముందుకు వెనక్కు కాసేపు ఆడించాడు.  వెంటనే చాలా ఆశ్చర్యం కలిగింది. 

ఇక ఎటువంటి బాధ లేకుండానే నడవగలిగాడు.  నెప్పి కూడా మాయమయిపోయింది.  అనుకోకుండా జరిగిన ఈ అద్భుతానికి చాలా ఆశ్చర్యపోయాడు.  బాబా అనుగ్రహం వల్ల గాయం కూడా పూర్తిగా మానిపోయింది.

బొంబాయికి తిరిగి వచ్చిన తరువాత శంకర్ లాల్, ప్రాణ్ గోవిందదాస్ లు ఇద్దరూ వామనరావుకు తమకు కలిగిన అనుభవాలని వివరించి చెప్పారు.

ఒక్కసారి షిరిడీ వెళ్ళమని, ఆయనే అసలయిన సత్పురుషుడని, వారిద్దరూ వామనరావుకి సలహా ఇచ్చారు.  అంతే కాకుండా షిరిడీలో అతనికి ఉన్న సందేహాలన్నీ నివృత్తి అవుతాయని కూడా చెప్పారు.

ఆ సమయంలో నానా సాహెబ్ చందోర్కర్ బొంబాయిలో ఉన్నారు.  షిరిడీలో చిన్న హోటల్ వ్యాపారం చేసుకుంటున్న శ్రీబాలాభావూకి పరిచయ పత్రం రాసాడు.

వామనరావు తండ్రి ప్రాణ్ గోవిందదాస్ కి తన కొడుకు స్వభావం పూర్తిగా తెలుసు.  కొడుకు న్యాయశాస్త్రం చదివినందువల్ల అతని మనసులో ఎప్పుడూ సందేహాలే. ప్రత్యక్షంగా చూస్తే గాని ఏవిషయాన్ని నమ్మడు.

అంతేకాదు “భగవంతుడిని ప్రత్యక్షంగా ముఖాముఖీ చూస్తే తప్ప భగవంతుడు ఉన్నాడనే నిజాన్ని నేను నమ్మను” అని ఎప్పుడూ అంటూ ఉండేవాడు వామనరావు.

ప్రాణ్ గోవింద దాస్ వామన రావుతో “పైన ఆకాశంలో నక్షత్రాలను చూడు, సూర్యచంద్రులు ఉదయించడం గమనించు.  అవి  ప్రసాదించే కాంతి వల్లనే మానవజాతి, సమస్త జీవులు అన్నీ మనుగడ సాగిస్తున్నాయి. 

ఇదంతా జరుగుతుండటానికి కారణం ఆ భగవంతుడే.  ఏదీ మన చేతిలో లేదు” అన్నాడు.  కాని ఈ మాటలేమీ వామనరావులో నమ్మకాన్ని కలిగించలేకపోయాయి.

“సరే, అవన్నీ వాటి వాటి విధుల ప్రకారం జరుగుతున్నాయి. 

కాని వీటన్నిటిలో భగవంతుడు ఎక్కడ కనపడుతున్నాడు?” అని తండ్రితో వాదించాడు వామనరావు.

వామనరావులో అటువంటి స్థిరమయిన అభిప్రాయాలు ఉండటంవల్లనే దేవుడు ఉన్నాడనే విషయంలో ఎటువంటి నమ్మకాన్ని ఏర్పరచుకోలేకపోయాడు.  

రేపు తరువాయి భాగం ….

శ్రీ సాయి అంకిత భక్తుడయిన స్వామి శరణానంద గారి గురించిన సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles