స్వామి శరణానంద నాల్గవ భాగం



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు

బాబా ధరించే దుస్తులలో కూడా ఎంతో శక్తి దాగి ఉంది.  ఒకసారి బాబా మహల్సాపతికి తన కఫినీని కానుకగా ఇచ్చారు.  దాని మహత్మ్యం వల్ల మహల్సాపతి తన సంసార బాధ్యతలు, సామాజిక బాధ్యతలను నిర్వర్తిస్తూనే ఒక సన్యాసిలాగ జీవితం గడిపాడు.  మరొక సందర్భంలో బాబా తన కఫనీని ముక్తారాం కు  కూడా కానుకగా ఇచ్చారు. ఆ కఫనీ మురికిగా ఉండటంతొ ముక్తారాం దానిని శుభ్రంగా ఉతికి దీక్షిత్ వాడాలో ఆరబెట్టాడు.  ఆ తరువాత బాబా దర్శనానికి వెళ్ళాడు.  దీక్షిత్ వాడాలో బాబాగారి కఫనీ ఆరబెట్టిన చోట వామనరావు ఉన్నాడు.  ఆ కఫనీనుంచి వామనరావుకు “చూడు, ముక్తారాం నన్నిక్కడకు తీసుకొని వచ్చి తల్లక్రిందులుగా వేలాడదీసాడు” అన్న మాటలు వినిపించాయి.  వెంటనే ముక్తారాం కఫనీని తీసుకొని తను ధరించాడు.  కఫనీ ధరించిన తరువాత మసీదుకు వెళ్ళాడు.  వామనరావు కఫనీ ధరించడం చూసి బాబాకి ఆగ్రహం వచ్చింది.  కాని సమయం వచ్చినపుడు సన్యాసం స్వీకరిద్దామనే నిర్ణయంతో వామనరావు ఉన్నాడు. అందుచేతనే బాబా ఏమీ మాట్లాడలేదు.  ఆతరువాతనుంచి వామనరావు ఆధ్యాత్మిక విషయాలలో మంచి పురోగతిని సాధించాడు.

1917 వ.సంవత్సరం మార్చి నెలలో అహమ్మదాబాద్ లోని మోడల్ హైస్కూలుకు హెడ్ మాస్టర్ గా నియమింపబడి, ఆ పదవిలో 1921 జనవరి వరకు ఉన్నాడు.  ఆ తరువాత అదే సంవత్సరంలో బొంబాయి వచ్చాడు.  అక్కడ మెసర్స్ గంగా అండ్ సాయనీ కంపెనీలో మానేజింగ్ గుమాస్తాగా చేరాడు.

ఒక భక్తుడు ఆయనకు బాబా ఇమ్మన్నారని చెప్పి బాబా పాదుకలను ఇచ్చాడు.  మొదట్లో ఆయన తీసుకోవడానికి ఇష్టపడలేదు.  తరువాత వాటిని స్వీకరించి ఆ పాదుకలని అహమ్మదాబాద్ లోని ‘విష్ణుధర్మాలయ” పేరుతో ఉన్న బాబా మందిరంలో ప్రతిష్టించారు.  వేలాది మంది భక్తులు ఆపాదుకలను దర్శనం చేసుకోవడానికి వచ్చేవారు.  అందరికీ ఎన్నో అనుభవాలు కలుగుతూ ఉండేవి.  స్వస్థత కూడా పొందుతూ ఉండేవారు.

1932 లో గుజరాతీ భాషలో ‘గురుస్మృతి’ ని రచించాడు.  1946 లో ‘సాయిబాబా’ అనే పేరుతో బాబా జీవితచరిత్రను వ్రాసాడు.  దాకోర్ లో బాబా అతనికి ఒక ఫకీరుగా కనిపించి ‘సాయి శరణానంద’ గా నామకరణం చేసారు.  1961 లో ‘సాయిబాబా ది సూపర్ మాన్’ అనే పుస్తకం వ్రాసారు.

బాబా ఆశీర్వాదబలంతో బాలాజీ వసంత్ తాలిమ్ ఎంతోసుందరమయిన బాబా విగ్రహం చెక్కాడు. ఆ విగ్రహాన్ని అక్టోబరు,1954, 7వ.తారీకు విజయదశమినాడు.  సమాధి మందిరంలో ప్రాణ ప్రతిష్ట స్వామి శరణానందగారి చేత చేయించుదామనుకుంటే ఆయన సన్యాసి కనుక ఆయనకు అర్హత లేదు.  మరి ఎవరి చేత చేయించాలనే పెద్ద మీమాంస వచ్చింది. అప్పుడు బాబా ముందు చీటీలు వేశారు. చీటీలో డా.కేశవ్ గావన్ కర్ గారి పేరు వచ్చింది. చీటీలో బాబా ఇచ్చిన ఆదేశం ప్రకారం డా.కేశవ్ గావన్ కర్ దంపతులు విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేశారు. స్వామి శరణానంద సన్యాసి కాబట్టి ప్రాణ ప్రతిష్ట చేసే యోగ్యత లేనందువల్ల ఆయనకు, బాబా విగ్రహానికి ముందు కట్టిన తెరను తెరచే భాగ్యాన్ని కలిగించి, ఆయనను గౌరవించారు.

సన్యాసం స్వీకరించిన తరువాత 1952 వ సంవత్సరంనుండి బాబాఎల్లప్పుడూ తనతోనే ఉంటూ తన చేత అన్ని సేవలనూచేయించుకుంటూ ఉండేవారని చెప్పారు.

బాబాకు, బాబా భక్తులకు ఎన్నో సంవత్సరాలు సేవ చేసిన తరువాత స్వామి సాయి శరణానంద ఆగస్టు 25, 1982 వ. సంవత్సరంలోతన 93వ. ఏట బాబాలో ఐక్యమయ్యారు. స్వామి సాయి శరణానందవారి సమాధి మందిరం ఈ క్రిందచిరునామాలో అహమ్మదాబాద్ పట్టణంలో ఉంది.

చిరునామాః

స్వామి శరణానంద్ సమాధి మందిరం

c/o శ్రీమతి ఉషబెన్ భాటీ & శ్రీ ప్రతీక్ ఎమ్.త్రివేది

14/15 ప్రకృతి కుంజ్ సొసైటీ

న్యూ శారద్ మందిర్ రోడ్

శ్రేయాన్ హైస్కూల్ ఎదురుగా

అహమ్మదాబాద్ – 380015

గుజరాత్

శ్రీ సాయి అంకిత భక్తుడయిన స్వామి శరణానంద గారి గురించిన సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles