సాయి పాదరేణువు(మూర్తి) గారి అనుభవాలు



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు 

బాబా చేసిన అద్భుతాలలో ఇంకొక అద్భుతం – మాకు ఒక కొడుకు కాని కొడుకుని ప్రసాదించడం.(25)  (1995 సంవత్సరంలోనే) బాబా నాకు పరిచయం కాగానే, మేము అద్దెకు ఉంటున్న మా చుట్టాల ఇంటి (మా కజిన్) వాళ్ళ కొడుకు, మాకు (ముఖ్యంగా మా పిల్లలకు) బాగా దగ్గరయ్యేడు. మా కొడుకులాగే అయిపోయాడు. సాధారణంగా ఏ కొడుకూ చేయలేని విధంగా మాకు సహాయం చేస్తున్నాడు.  ముఖ్యంగా మా పిల్లలకు సొంత అన్నయ్యే అయ్యాడు.  వాళ్ళకు కావలసిన ఏ సహాయం అయినా చేస్తాడు.  వాడు 1996 లో అమెరికా వెళ్ళాడు. వాడే 1998 లో నేను అమెరికా వెళ్ళినప్పుడు నాకు సహాయం చేసాడు.(26) వాడే మా చిన్న అమ్మాయికి 2005 లో అమెరికా లో job రావడానికి సహాయం చేసాడు.(27) వాడే మా పెద్ద అమ్మాయికి వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు ధన సహాయం చేసాడు. (28) నిజంగా ఏ కొడుకూ చేయనటువంటి సహాయం చేసాడు / చేస్తున్నాడు.  దాని పెళ్ళికి వాడు, వాళ్ళ అన్నదమ్ములు కలిసి ఎంతో సహాయం చేసారు.(29)  ఇప్పుడు మా చిన్న అమ్మాయి వాడి దగ్గరే ఉంటోంది.

ఇంక మా అమ్మ సంగతి …..

నాకు, మా చెల్లెళ్ళు, తమ్ముడు అందరకీ మా అమ్మ అంటే ఎంతో ఇష్టం, ప్రేమ. నా భార్యకు కూడా.  ఆమె మాకు ఎప్పుడూ ఆరాధ్యురాలే.  ఆమె కూడా బాబా భక్తురాలే.  [బాబా పరిచయం కాక మునుపే మా నాన్న గారు దివంగతులైనారు].  నేను చేసే పూజలు, జపాలు, భజనలు ఆమె కూడా చేస్తుంటుంది, లేదా వాటిల్లో పాలు పంచుకుంటుంది. బాబా ఆమెను కూడా (నా కోసం) సాధ్య మైనంత వరకు ఆరోగ్యంగానే ఉంచుతున్నాడు, ఆమె ప్రారబ్ధాన్ని కూడా చాల తక్కువ పాళ్ళలో అనుభవింప చేస్తున్నాడు.(30) ఆమె తనకు వయసు అయిపోయినా ఎంతో కొంత ఏదో విధంగా సహాయం చేస్తూనే ఉంటుంది.  సరే ఇంక ఆవిడ వెళిపోయే సమయం వచ్చింది (2009 చివరలో). వెళిపోయే ముందు ఆమె ప్రారబ్ధాన్నంతనూ (సుమారు ఒక నెల రోజుల పాటు) ఆస్పత్రి లో తీవ్ర వ్యాధి రూపంలో అనుభవింప చేసేసాడు.(31) ఆ వ్యాధి తీవ్రతను తగ్గించి ఆమెకు కొంత ఉపశమనం కలిగించడానికి నాకు (నా తపః ఫలితానికి) శక్తిపాతాన్ని ప్రసాదించి ఆమెకు మాత్రమే చేసేలా నన్ను ఉపయోగించు కున్నాడు.(32)  నా ప్రార్ధన అవసరం లేకుండానే ఆమెకు (ఆమె కూడా తన భక్తురాలే కాబట్టి) “సద్గతిని” (ఊర్ధ్వలోకాన్ని) ప్రసాదించేడు.(33)   (అలాగ నాకు దివ్య దర్శనం కలిగించేడు).

 ఇవండీ నాకు నా కుటుంబ సభ్యులకూ బాబా చేసిన లీలలు, మహిమలుఇంత చేసిన బాబాకు నేనేమి ఇవ్వగలనునా ప్రేమ తప్ప. అందుకే ఆయనకు త్రికరణ శుద్ధిగాసర్వస్య శరణాగతిచేసుకున్నాను.

ఇంక బాబా ఎప్పుడు అనుమతి నిస్తే అప్పుడు మీకు “శ్రీ RM గారితో నా జీవిత గమనం” భాగాన్ని వినిపిస్తాను/ తెలియపరుస్తాను.  ప్రస్తుతానికి ఇంతే సంగతులు.

 నా కథని మీకు ఎందుకు తెలియ పరిచానంటే – నా జీవితంలో జరిగిన బాబా చేసిన లీలలు, మహిమల నుంచి మీరు కూడా స్ఫూర్తిని పొంది మీరు కూడా నా లాగే బాబా అనుగ్రహాన్ని పొందాలని.  ఇదే నా ఆశ.

[గత కొన్ని (2,3) సంవత్సరాల నుంచి వైరాగ్యం ఎక్కువై బాబా ధ్యానంలోనూ, ఆయన సేవలలోను, ఆయన స్మరణంలోనూ జీవితాన్ని వెళ్ళ దీస్తున్నాను. ఈ దశలో బాబా నాకొక కొత్త సేవను (తన సందేశాలను తన భక్తులకు వినిపించడం కోసం, వారిని ఉద్ధరించడం కోసం SAI DARBAR ను స్థాపింపచేసి , వాటి ద్వారా రోజుకొక సందేశాన్ని తెలియ పరుస్తూంటాడు. నా  సేవలకు ఆయన పొంగిపోయి నాకు “నా (సాయి) పాదరేణువు” అన్న బిరుదుని ముద్దుగా నాకు ప్రసాదించేడు.]

ఓం శ్రీ సాయిరాం !!!  జై శ్రీ సాయిరాం !!!

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No :9704379333

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles