Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
ఇంక మా రెండవ అమ్మాయి పరిస్థితి – ఆమె తన PG 2005 మొదట్లో పూర్తి చేసుకుని (13) మా అబ్బాయి లాంటి వాళ్ళ కజిన్ అన్నయ్య (అమెరికా లోనే ఉంటాడు) ద్వారా అమెరికా లో ఉద్యోగం సంపాదించుకుని (అదీ బాబా దయ వల్లనే – కాని ఆమె ఒప్పుకోదు ఈ వాదనకి) ఆమె అమెరికా వెళ్ళిపోయింది.(14) ఆమె ఆర్ధిక పరిస్థితికి ఏమి లోటు లేదు. [ఇక్కడ మీకు ఒక విషయం అర్ధమయ్యే ఉంటుంది – ఎవరి ప్రారబ్ధం వాళ్ళు అనుభవిస్తున్నారు. మా పెద్దమ్మాయికి కష్టాలు రాసిపెట్టి ఉన్నాయి, చిన్న అమ్మాయికి సుఖాలు రాసి పెట్టి ఉన్నాయి వాళ్ళ వాళ్ళ పూర్వ జన్మల కర్మ ఫలితాల వల్ల]. 2005కి ఆమె వయసు 25 సంవత్సరాలు. ఆమె కనీసం ఒక సంవత్సరమైనా ఉద్యోగం చేస్తేనే కాని పెళ్లి చేసుకోనంది. సరే అన్నాము. కాని తర్వాత కూడా పెళ్లి ప్రయత్నాలు ఎన్ని చేస్తున్నా ఏవి ఫలించడం లేదు. 2010 లో మాత్రమే ఆమె వివాహం ఇక్కడి ఉద్యోగస్తుడి తోనే జరిగింది.(15) కాని అతను పరమ చాదస్తుడని, శాడిస్ట్ అని, వాళ్ల తల్లి చాటు బిడ్డడు అని పెళ్లి అయిన తర్వాతే తెలిసింది.(16) ఈ విషయం ఆ తల్లి కొడుకులు ఇద్దరూ చాల చాక చక్యంగ దాచి పెట్టేరు. పెళ్లి అయిన తర్వాత ఆ విషయాలు త్వరగానే బయట పడ్డాయి.(17) మా బాధ ఇంక చెప్పనలవి కాదు. ఒక 6 నెలలలోనే ఆమె పెళ్లి పెటకులయింది.(18) ఆమె విడాకులకి అప్లై చేసి 3 సంవత్సరాల తర్వాత పొందింది.(19) ఈ లోపున ఆ రెండవ అల్లుడు ఆమెని ఎన్ని విధాల అడ్డు పడాలో అన్ని విధాల అడ్డు పడ్డాడు. [ఇక్కడ కూడా మీరు ఒక విషయం అర్ధం చేసుకుని ఉండాలి – ఆమె జాతక చక్ర ఫలాల ప్రకారం (అంటే ఆమె ప్రారబ్ధం ప్రకారం) ఆమెకు అన్నీ జరుగుతున్నాయి, కాని బాబా వేటిని అడ్డు పెట్టడం లేదు, ఎందుకంటే ఆమె బాబా భక్తురాలయి ఉండి బాబా మీద ఆధారపడకుండా తన అన్నయ్య మీద, తన ఉద్యోగం (ప్రతిభ) మీద ఆధారపడింది.] ఆమెకి ఆర్ధికంగా బాబా అవసరం లేదు. కాని బాబాని నమ్ముకుని, ఆయన చెప్పినట్టు విని ఉంటే ఆమెకి విడాకులు త్వరగా వచ్చి ఉండేవి, రెండవ వివాహం కూడా త్వరగా జరిగి ఉండేది కూడా. ఎవరి తల రాత వారిది. (ఇక్కడ ఇంకొకటి గమనించాలి – ఆమె అమెరికాలో ఉద్యోగం చేస్తున్నా ఆమె నుంచి ఎటువంటి ధన సహాయం కాని, ఆమె మాకు ఎంతో కొంత ఇవ్వాల్సిన బాధ్యత తన మీద ఉన్నాదని ఆమెకి గుర్తు చేయడం కాని మేము చేయలేదు.(20) అలాగే ఆమె కూడా మాకు ఏమి పంపించడం లేదు. ఆమె ఇక్కడకి (హైదరాబాద్ కి) వచ్చినప్పుడు ఏమైనా కొంటే వద్దన లేదు. అయినా తన పెళ్ళికి (90%) ఖర్చు తనే పెట్టుకున్నాది.) ఆమెకి యింకా ఏ సంబంధమూ కుదర లేదు. [ఆమె వివాహం ఈ మధ్యనే (ఏప్రిల్ 30 న) జరిగింది అక్కడి వ్యక్తి తోనే]. ఆమె పరిస్థితి ఇది. ఇంక చిత్రమైన సంగతి ఏంటంటే – బాబా చేసిన, చేస్తున్న లీల ఏమిటంటే(21) – మాకు వచ్చే పెన్షన్ డబ్బులతో మా పెద్ద అమ్మాయికి సపోర్ట్ చేయిస్తున్నారు; మా చిన్న అమ్మాయి నుంచి మాకు ఎటువంటి ధన సహాయం లేకుండా చేస్తున్నారు. మమ్మలిని మాత్రం అనుక్షణం కాపాడుతున్నారు.(22)
ఈ మధ్యనే జరిగిన లీల (23) గురించి మీకు చెబుతాను. క్రితం జూలై లో బాబా నాకు ఒక విలువైన సలహా ఇచ్చాడు – ఏమిటంటే – నువ్వు 3 నెలలో ఈ ఇంటిని (మా సొంత flat) ఖాళీ చేసి వేరే ఇంటికి వెళ్ళు. పెద్ద ప్రమాదం పొంచి ఉంది అని. నా భార్యకు ఇష్టం లేదు ఆ ఇల్లు మారడం. కాని బాబా హెచ్చరికని తేలికగా తీసుకో లేక పోయింది. అంతే, వేరే ఇల్లు చూసుకుని సెప్టెంబర్ లో ఖాళీ చేసేసాము. అక్టోబర్ లో నా అప్పుల వాళ్ళలో ఒక (బహుశా పెద్ద) అప్పుల వాడు తన బలగాన్ని ఇంటి మీదకి పంపించాడు ఆ ఇల్లు స్వాధీనం చేసుకోవడానికి. కాని ఆ ఫ్లాట్స్ లో మా ఫ్లాట్ పక్కనే ఉన్న మా శ్రేయోభిలషి అని బాబా అక్కడ అడ్డు పెట్టించాడు. పాపం మా కోసం ఆయన కొంత టెన్షన్ అనుభవించాల్సి వచ్చింది. ఆయన వాళ్ళని ధైర్యం గానే ఎదుర్కొన్నాడు. కాని మాకు బాబా రక్ష ఈ విధంగా చేస్తున్నాడు. (24) సరే ఆ ఇంటిని ఇంక అమ్మేస్తాం బాబా అని చెప్పేను. సరే అన్నాడు. [తర్వాత ఫిబ్రవరి లో ఆ ఇంటిని అమ్మేసి, వేరే చోట (దూరంగా దమ్మాయిగూడ లో) independent house ఇప్పించాడు బాబా. (34)]
రేపు తరువాయి భాగం …..
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No :9704379333
Latest Miracles:
- సాయి పాదరేణువు(మూర్తి) గారి అనుభవాలు
- సాయి పాదరేణువు(మూర్తి) గారి అనుభవాలు
- సాయి పాదరేణువు(మూర్తి) గారి అనుభవాలు
- సాయి రక్షణ (ఇందిరా గారి అనుభవాలు)
- సాయి భక్తుడు రామకృష్ణ అనుభవాలు–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments