Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
My story – Part-5– సాయి లీల (మహిమ) లు:
(మా కుటుంబ సభ్యుల జీవితాలలో)
సాయి బంధువులారా!
సాయి నాకు, నా కుటుంబానికి చేసిన మేలు అంతా, ఇంతా కాదు. అందుకే జన్మ, జన్మలకి సాయే నా గురువు, దైవం. ఇంక సాయి లీల/మహిమల గురించి వస్తే, ……….
మాకు ఇద్దరు ఆడ పిల్లలు. పెద్దమ్మాయి గ్రాడ్యుఏట్. చిన్నమ్మాయి PG (SW). నాకు ఇద్దరూ ఇష్టమే. వాళ్ళకూ నేనంటే ఇష్టం. అందులో పెద్దమ్మాయికి నేనంటే మరీ ఇష్టం. నేను ఇంటికి పెద్దవాడిని అవటంతో నా మీద బరువు బాధ్యతలు ఎక్కువ. బాబాకి మా ఆర్ధిక సమస్యలూ తెలుసు, మా కుటుంబ సమస్యలూ తెలుసు. ఎవరి ప్రారబ్దాలు వాళ్ళు అనుభవిస్తూనే మా సమస్యలు బాబా దయతో పరిష్కరింపబడుతూ వస్తున్నాయి. మా పెద్దమ్మాయికి 20వ సంవత్సరం (1997) నుంచి పెళ్లి చేయడానికి చూస్తున్నా ఆమెకున్న కుజ దోషం వల్ల సంబంధాలు ఏవి కుదరడం లేదు. ఆఖరికి 2003 సంవత్సరానికి ఒక (బాగా సంపాదిస్తున్నాడనుకున్న) SW Developer తో పెళ్లి జరిగింది. (1) కట్నం కూడా మా తాహతుకి మించిందే. కాని పెళ్ళికి వారం రోజుల ముందరే ఒక ఘోరమైన వార్త వినాల్సి వచ్చింది. ఆయనికి చాలా అప్పలున్నాయని, ఆ అప్పులవాళ్ళు ఆయనను వేధిస్తున్నారని, తెలిసింది. ఏం చేయాలో తెలియని పరిస్థితి. అందరికి శుభలేఖలు పంచడం అయిపొయింది. పెళ్లి రద్దు చేసుకుంటే ఎంతో తలవంపులు, రద్దు చేసుకోకపోతే అమ్మాయి జీవితం ఏమౌతుందో తెలియదు. సమస్యను బాబా ముందు ఉంచాను. పెళ్లి చెయ్యమని చెప్పాడు, మిగతా కథ నేను నడిపిస్తానన్నారు బాబా. పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన 15 రోజులలోనే మా అల్లుడు తన అప్పులలో కొంత భాగం తీర్చడం కోసం, తన తండ్రి ఇంటిని అమ్ముకున్నాడు.(2) మిగిలిన అప్పులు తీర్చ లేక వాళ్ళనుంచి తప్పించుకోడానికి గత్యంతరం లేని పరిస్థితులలో వారి పెళ్లి అయిన 16వ రోజున వాళ్ళు (ఆయన, తల్లి తండ్రులు, భార్యతో సహా) వేరే ఊరుకి అజ్ఞాతం లోకి వెళ్ళిపోవలసి వచ్చింది.(3) మాకు, వాళ్లకు ఎంతటి దౌర్భాగ్యమో ఊహించుకోండి. మా దుఖానికి అంతు లేదు. అప్పట్నుంచి బాబాని తిట్టుకోని రోజు లేదు. [2003 పరిస్థితి] ఒక పక్క నా కంపెనీ మూత పడిపోయే స్థితికి చేరింది. ఆ కష్టాలు ఒక వైపు, మా కూతురి దుస్థితి ఇంకొక వైపు నన్ను బాగా క్రుంగ దీస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నేను చాలా డిప్రెషన్ కి గురై రెండు సార్లు ఆత్మహత్య చేసుకుందామనుకున్నాను. కాని బాబా చేసుకోనివ్వలేదు. (4) నీకెందుకురా భయం, నేనున్నానుగా అంటూ ధైర్యం చెబుతున్నాడు. కాని నాకా ధైర్యం రావటం లేదు. అయినా ఆయన ఆశ్రయం లోనే ఉంటూ ఆయన జపం చేసుకుంటూ ఉన్నాను.
విచిత్రం ఏమిటంటే, మా పరిస్థితి ఇలాగున్నా మా చేత ఇంకొక ఇంటికి (ఫ్లాట్ కి) 2002 లో బ్యాంకు లోన్ ద్వార కట్టించారు.(5) మా ఆదాయం మాకు రోజులు గడపడానికే సరిపోతుంది. ఒక వైపు అప్పులున్నా, పిల్ల పెళ్లి జరపాల్సి ఉన్నా, నా కంపెనీ అప్పులలో కూరుకు పోతున్నా ఈ విచిత్రాన్ని జరిగేలా చేసారు. ఇదంతా భవిష్యత్తులో నా కుటుంబ ఆర్ధిక స్థితిని చక్కదిద్దడానికీ, పెంచడానికే. ఆ ఇంటిని నా భార్య పేరు మీద పెట్టించాడు. (6) ఎందుకంటే (నాకు తర్వాత అర్ధమైంది నా అప్పులనుంచి మా కుటుంబాన్ని కాపాడడానికి అని) భవిష్యత్తులో మేము బాధ పడకూడదు, నా పిల్లలకూ మా తదనంతరం ఎంతో కొంత ఆస్తిని ఇప్పించడానికి బాబా చేసిన మహిమ అది అని. ఇంత చేస్తుంటే బాబాని నేను, నా భార్య యింకా ఆడిపోసుకుంటూనే ఉన్నాము – మా పెద్దమ్మాయి ఎక్కడ ఉందొ, ఎలాగుందో నన్న విచారంతో. మేము మానవ మాత్రులం కదా, ఎంత బాబా దగ్గర ఉన్న మా భయాలు మాకు ఉంటాయి కదా. కాని వాళ్ళని బాబా ఎంతో క్షేమంగా ఎక్కడో ఒక దగ్గర ఉంచి కనిపెడుతూనే ఉంటాడు అని నా నమ్మకం. అలాగే చూసుకుంటున్నాడు. వాళ్ళ ప్రారబ్ధ కర్మలను వాళ్ళచేత అనుభవింప చేస్తూనే వాళ్ళను కాపాడుతున్నాడు.(7) వాళ్ళకు కావలసిన ధన సహాయం – ఉద్యోగాల ద్వార చేస్తూనే ఉన్నాడు. మా రెండవ అమ్మాయి [అప్పటికి (2005 కి) అమెరికా లో జాబు చేస్తున్నది] ఇంకా ఆమె కజిన్ అన్నయ్య ద్వార, మా వియ్యంకుడు పెన్షన్ ద్వార, ఇతరత్రా – సహాయం అందిస్తూనే ఉన్నాడు – వాళ్ళ జీవనం గడుపుకోడానికి.(8) వాళ్ళ సమాచారం మాకు 3 సంవత్సరాల తర్వాత – 2005 చివరలో తెలిసి మేము ఎంతో సంతోషించాము.(9) వారి ఆ దుస్థితికి విచారించాము కూడా. కాని మా అల్లుడి పరిస్థితి అగమ్య గోచరం గానే ఉంటోంది. ఆయన SW లైన్లో వ్యాపారమే చెయ్యాలనుకుంటాడు, కాని బాబాకి అది ఇష్టం లేదు. అందుకే అతని మనో స్థితిని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నా, ఆయన ప్రారబ్ధం మాత్రం ఆయనను వ్యాపారం వైపే లాగుతోంది. సరే అవసరం వచ్చినప్పుడు ఆదుకుంటూ ఉంటే సరిపోతుందులే అనుకున్నాడో ఏమిటో అతనిని అలాగే వదిలేసాడు. 7 సంవత్సరాల తర్వాత వాళ్ళు హైదరాబాద్ వచ్చారు. మాతో పాటే కొన్నాళ్ళు ఉండి తర్వాత వేరే ఇంట్లో మాకు దగ్గరగానే ఉంటున్నారు.(10) కాని వాళ్ళ ఆర్ధిక పరిస్థితి మాత్రం ఏమాత్రం ఎదుగుదల లేదు. బాబా మా చేతే వాళ్ళకి కావలసిన సహాయం చేయిస్తూ వస్తున్నాడు.(11) మా అల్లుడు ఆ వ్యాపారం మానేసి ఏదైనా ఉద్యోగం చూసుకుంటేనే కాని బాబా వాళ్లకి ప్రత్యక్ష సహాయం చెయ్యనని చెప్పేసారు. ఆ సంగతి నేను వేరే విధంగా చెప్పినా వాళ్ళకి అర్ధం కాదు. ఎంతసేపు ఆయనకు తన వ్యాపారమే తనకు సహాయం చేస్తుందని అనుకుంటున్నాడు. సరే వాళ్ళ ప్రారబ్ధాన్ని బాబాయే మార్చలేక పోయా, ఇంక నేనెంత? నేనూ వదిలేసాను. వాళ్లకు సపోర్ట్ మాత్రం చేస్తున్నాము (బాబా ద్వార).(12)
రేపు తరువాయి భాగం …..
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No :9704379333
Latest Miracles:
- సాయి పాదరేణువు(మూర్తి) గారి అనుభవాలు
- సాయి పాదరేణువు(మూర్తి) గారి అనుభవాలు
- సాయి పాదరేణువు(మూర్తి) గారి అనుభవాలు
- సాయి రక్షణ (ఇందిరా గారి అనుభవాలు)
- సాయిబానిస(శ్రీ రావాడ గోపాలరావు) గారి అనుభవాలు — 3
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments