సాయి పాదరేణువు(మూర్తి) గారి అనుభవాలు



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు 

My story – Part-4– సాయి లీల (మహిమ) -5

మేము ఇల్లు మారిన తర్వాత రోజులు మామూలుగా ప్రశాంతంగా గడుస్తున్నా ఏదో తెలియని వెలితి.  నేను ఈ విధంగా (నిష్ప్రయోజనంగా) జీవితం గడపాలా? నేనేమీ (నాకు గాని నా భార్య పిల్లలకు గాని) పనికి వచ్చే పనేమీ చేయలేనా?  ఎవరికీ పనికి రానప్పుడు  నేనెందుకు జీవించాలి? ఈ విధంగా నా ఆలోచనలు సాగుతూ ఆత్మశోధన జరుగుతున్నాది.

సరిగ్గా ఈ సమయంలోనే బాబా నా ఆలోచనలను శాంతి పొందే మార్గాలను వెదకడం వైపు మరల్చారు.  సద్గ్రంధాలను చదవడం (2005 నుంచి) అలవాటు చేసుకున్నాను కాబట్టి వాటితోటే సత్సంగం చేస్తూ వస్తున్నాను.  వాటి ప్రభావం నా మీద ఎక్కువ కాజొచ్చింది.  చాల గ్రంధాలలో నాకు తెలిసిన కొత్త విషయం ఏమిటంటే “ఆత్మ జ్ఞానం కొరకు, జీవితం తరింప జేసుకోవడానికి ఒక సద్గురువును ఆశ్రయించాలి.  సద్గురువంటే తాను ఆత్మసాక్షాత్కారం పొంది, తన శిష్యుడికి కూడా ఆత్మ సాక్షాత్కారం కలిగించ గలిగే సిద్ధత్వం కలిగి ఉండాలి.  అటువంటి సద్గురువునే ఆశ్రయించాలి.” అని.  సరే ఈ అభిప్రాయం  రూఢి పడిన తర్వాత నాకు గురువు ఎక్కడ దొరుకుతాడు?  ఒకవేళ దొరికినా వారికి ఆత్మ సాక్షాత్కారం అయిందా లేదా ఎలా తెలుసుకోవడం?  ఇవన్నీ అంత సులభంగా సమాధానం దొరకని ప్రశ్నలు.  అందుకే బాబానే ఒక రోజు అడిగీసేను. దానికి టక్కున వచ్చిన సమాధానం ఏంటో తెలుసా?  “ఏం నేను చాలనా?”  అని.  దాంతో నేను తికమక పడ్డాను. అవును బాబా మహా సిద్ధ గురువు కదా, పరమ గురువు కదా. ఎందుకు నేను వేరే గురువు కోసం చూస్తున్నాను?  అని మళ్లీ ఆ గ్రంధాలను శోధించడం మొదలెట్టేను.  ఆ గ్రంధాలలో ఒక (గురువు – శ్రీ రమణానంద స్వామి [RM] రచించిన)  గ్రంధం లోని దృష్టాంతంగా చెప్పిన కొన్ని విషయాలకు నేను ఆకర్షింప బడ్డాను. (ఆ ఆకర్షణ మోహం అని 8 సంవత్సరాల తర్వాత తెలిసింది).   అదేమిటంటే గురుత్రయంని ఆరాధించడం, పూజించడం, సేవించడం.  గురుత్రయం అంటే- ఆది గురువు, పరమ గురువు, సిద్ధ గురువు.  ఆ సిద్ధ గురువు కూడా లివింగ్ గురువు అయితేనే ఫలితం ఎక్కువగా ఉంటుంది. త్వరగా తరింపబదతారు అని. లివింగ్ గురువు కాన్సెప్ట్ వేరే గ్రంధాలలో నాకెక్కడా కనిపించలేదు. (బహుశా నాకు దొరక లేదేమో! అప్పటికి నా జ్ఞానం కూడా బహు స్వల్పమే)( ఇక్కడ నేను RM చేసిన మాయలో ఆయన గేలంలో నేను చిక్కుకున్నానని 8 సంవత్సరాల తర్వాత గానీ తెలిసి రాలేదు.)  ఈ కాన్సెప్ట్ ని సోదాహరణంగా చెప్పడంతో  ర.స్వా.(RM) గురుత్వం పై గురి కుదిరింది.  (ఆ గ్రంధం – శిరిడి సాయి అనుగ్రహ సేవా రహస్యం) అదీకాక తెలుగు తెలిసిన సిద్ధ గురువులెవరో నాకు అప్పుడు స్ఫురించలేదు.  అందుకని ఈయనే నాకు తగిన సిద్ధ గురువని మానసికంగా నిశ్చయిం చేసుకున్నాను. ఇది జరిగింది మార్చ్/ఏప్రిల్ 2006 లో.  నా భావానికి బలం చేకూరడానికి ఇంకొక సంఘటన కూడా కారణమయింది.  అది RM గారు 2006 జూన్ లో నిర్వహించిన శిరిడి సాయి మహా వ్రతం.  దానిలో మేము పాల్గొన్నాము కూడా.  ఆ కార్యక్రమం నిర్వహించిన తీరు, అందులో భాగంగా సాయిబాబా జీవించి ఉన్న సమయంలోని అంకిత శిష్యుల కుటుంబాలలో ప్రస్థుతం (అప్పటికి) జీవిస్తున్న సంతతి వారిని (27 మందిని) సన్మానించడం అనే కార్యక్రమం నన్ను బాగా ఆకట్టుకుని RM గారి మీద ఆకర్షణ బాగా పెరిగి పోయింది.  వ్రతం అయిన తర్వాత బాబాని నేను చాలాసార్లు అడిగాను నాకొక గురువును చూపించమని. కాని ఎప్పుడు అడిగినా మౌనంగానే ఉండిపోయేవారు బాబా. ఈలోపున 2007 మార్చ్ వచ్చేసింది. అప్పటికి నేను బాబాని వేధించడం ఎక్కువైపోయింది.  ఈ మధ్యలో నా మనసు మార్చడానికి బాబా కూడా ప్రయత్నించారు.  కాని నేను మొండివాడినని బాబాకి తెలుసు.  ఆఖరికి మార్చ్ లో నాకు ఈ RM గారినే చూపించారు. (అది బాబా చేస్తున్న మాయ అని, నా కళ్ళు తెరిపించిడానికే అని తర్వాత తెలిసింది.)  నాకు చాలా ఆనందమైంది నేను కావాలనుకున్న గురువునే చూపించారు అని.  ఇంక ఆలస్యం చేయకుండా ఆయనని కలిసే ప్రయత్నాలు చేసాను. ఆఖరికి 2007 ఏప్రిల్ 5వ తేదీన వైజాగ్ పీఠంలో ఆయనను కలుసుకుని బాబా మిమ్మల్ని నాకు గురువుగా చూపించారు మీ శిష్యుడుగా చేర్చుకోండి అని చెప్పాను.  ఆయన కూడా సంతోషించి ఆశీర్వదించారు. హైదరాబాద్ లో కాశీనాథ్ గారిని కలిసి తన కార్యక్రమాలలో పాల్గొంటూ సేవలు చేసుకోమన్నారు.  అప్పటి నా ఆనందానికి అంతులేదు.  ఏదో సాధించేసాను, నా జీవితం మారిపోతుంది, నేను తరించిపోతాను అని ఎంతో మురిసిపోయాను.  నా అదృష్టమే అదృష్టం అనుకున్నాను. వెంటనే హైదరాబాద్ లో కాశీనాథ్ గారిని కలిసాను.

 [నా జీవిత గమనం శ్రీ RM గారి గురుత్వంలో ఎలా సాగిందో నేనేమేమి సాధించానో, నా సమస్యలు తీరాయో లేదో, నేనేవిధంగా తరించబడ్డానో బాబా అనుమతి ఇచ్చిన వెంటనే మీకు తెలియ పరుస్తాను.]

రేపు తరువాయి భాగం …..

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No :9704379333

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles