Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
నిన్నటి తరువాయి భాగం….
మన్మాడ్ స్టేషన్ నుంచి రైలు బయలుదేరింది. 5 నిమిషాల తరువాత మరలా ఆగిపోయింది. సిగ్నల్ ప్రోబ్లం వల్ల అయిఉండవచ్చు. నేను బయటకు చూస్తున్నాను. హటాత్తుగా నేను ఒక పీర్ బాబా యొక్క సమాథిని చూశాను. దాని మీద ఆరంజ్ రంగు శాలువా ఉంది.
నాకు చాలా థ్రిల్లింగా అనిపించింది, యెందుకంటే నేను కూడా బాబాగారికి ఆరంజ్ రంగు శాలువానే సమర్పిస్తున్నాను. నేను ఫోటొ తీద్దామనుకునే లోపు రైలు కదిలింది. కాని, బాబా దయవల్ల నేను రెండు ఫోటోలు తీయగలిగాను. ఆ ఫోటొ యిక్కడ జత చేశాను.
ఈ ఫోటొలని నేను మరలా మరలా చూస్తుండగా నా మనసులోకి ఒక ఆలోచన వచ్చింది. అంతకుముందు దాకా నాకు, నేను సమర్పించే శాలువాని, చద్దార్ (బాబా సమాథి మీద వేసే వస్త్రం) షిరిడీలో ఆయన తీసుకుంటారా లేదా అనే సందేహం ఉండేది. ఇది చూసిన తరువాత బాబాగారు నేనిచ్చే శాలువా, చద్దార్ తీసుకుంటారన్నదానికి సంకేతం అనిపించింది.
ఇలా ఆలోచనలతో ఉండగా రైలు అటెండంట్ వచ్చి మాకు భోజనం కావాలా అని ఆడిగాడు. నా భర్త అతనిని రైలు పూనా ఎప్పుడు వెడుతుంది అని అడిగారు. “ఈ రోజు సాయంత్రం 5 గంటలకు వెళ్ళాలి” కాని, నాలుగు గంటలు ఆలశ్యంగా నడుస్తోంది” అని చెప్పాడు.
నేను మథ్యలొ కల్పించుకుని “సాయంత్రానికి ముందు షిరిడీ వెళ్ళడానికి మార్గమేమన్నా ఉందా” అని అడిగాను. “ఓహ్! మీరు షిరిడీ వెళ్ళాలా? అయితే పూనా వెడుతున్నారెందుకు? ఏ క్షణంలోనైనా కోపర్గావ్ రావచ్చు. మీరు కోపర్గావ్ లో దిగండి. అక్కడి నుంచి షిరిడీ 20 కి.మీ.” అని చెప్పాడు.
అంతే మేము, అక్కడక్కడా పడివున్న మా సామానంతా సర్దేసి కోపర్గావ్ లో దిగడానికి సిథ్థమయ్యాము. 5 నిమిషాలలో మా రైలు కోపర్గావ్ చేరింది. స్టేషన్లో దిగగానే మాకు పెద్ద బోర్డు కనిపించింది. “షిరిడీ వెళ్ళే వారు యిక్కడ దిగవలెను” అని రాసుంది దాని మీద. నాకు నోట మాటరాలేదు.
మేము షిరిడీ కి టాక్సీ మాట్లాడుకున్నాము. ఎటు చుస్తే అటు అన్ని చోట్ల బాబాని చూడటంతో నాకు చాలా సంతోషమువేసింది. సాయి టీ స్టాల్, సాయి హోటల్, సాయి బుక్ స్టాల్, యిలా ప్రతి చోటా నా సాయి. బి.ఎస్.ఎన్.ఎల్. మీద కూడా బాబా.
12 గంటలకి మేమనుకున్న షిరిడీ చేరుకున్నాము. టాక్సి దిగి మేము పుణ్యభూమి షిరిడీలో మాపాదాలు పెట్టగానే మథ్యాహ్న హారతి విన్నాము. మా హోటల్ సమాథి మందిరానికి దగ్గరగా ఉంది. హోటల్ లో గది తీసుకుని ప్రవేశించాము. నేను మొహము కూడా కడుక్కోకుండా, బాబాగారికి శాలువా, చద్దార్ ఏవిథంగా సమర్పించాలో కనుక్కోవడానికి బయటకు వెడుతున్ననని నా భర్తకు చెప్పి బయలుదేరాను.
నేను శాలువా తీసుకుని సమాథి మందిరం వైపు నడవడం మొదలుపెట్టాను. నాకు షిరిడీ రావడం యిదే మొదటిసారి కాబట్టి యెక్కడకు వెళ్ళాలో నాకు తెలియదు. కొంత మందిని అడ్మినిస్ట్రేటివ్ అఫీసు యెక్కడ వుందో కనుక్కుని లోపలకు వెళ్ళాను. నేనేం చేయాలో నాకు తెలియదు కాని, గుడ్డిగా వెళ్ళిపోయాను.
ఆఫీసులో యెవరినైనా కలవడానికి యెమన్నా సహాయం చేయగలడేమోనని ఒక సెక్యూరిటి గార్ద్ ని అడిగాను. 15 నిమిషాల తరువాత అతను నన్ను పిలిచి ఆఫీసులోకి తీసుకువెళ్ళాడు. అక్కడ ఒక ఉద్యోగిని కలుసుకుని, విషయమంతా చెప్పి బాబా గారికి శాలువా యిద్దామనుకుంటున్నట్లు చెప్పాను.
“వైటింగ్ లిస్ట్ చాలా ఉంది కాబట్టి అది సాథ్యం కాదు, కాని యివన్నీ చూసే వ్యక్తి మీద ఆథార పడివుంటుంది” అని చెప్పాడు. కాని, మిమ్మల్ని హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంటు ని కలవడానికి తీసుకువెడతానని” చెప్పాడు. నాతో కూడా ఒకతనిని తోడిచ్చి పంపాడు.
నేను లోపలికి వెళ్ళేంతవరకు, యితను నన్ను యెక్కడికి తీసుకువెడుతున్నాడో తెలియదు. ఆశ్చర్యం నుంచి తేరుకునేటప్పటికి నేను బాబా గారి సమాథి ముందు ఉన్నాను. నా కళ్ళంబట నీళ్ళు కారుతున్నాయి. నేను బాబా గారి సమాథి ముందు నుంచుని వున్నానంటే నమ్మలేకపోతున్నాను.
బాబాకి సమర్పించడానికి నావద్ద డబ్బులు గాని, పువ్వులు గాని లేవు. ప్రయాణానికి 2 రోజుల క్రితం వేసుకున్న దుస్తులతోనే ఉన్నాను.
బాబాగారు నన్ను యింత తొందరగా తన ముందు, అదీ వి.వి.ఐ.పి. లు వుండే చోట నిలబెడతారని ఊహించలేదు. నా చేతిలో ఉన్న శాలువాతో 20 నిమిషములు బాబా ముందు నిలబడి ఉన్నాను. సంతోషంతో నేను మరీ మరీ ఏడవడం మొదలుపెట్టాను. రిక్త హస్తాలతో వచ్చినందుకు బాబా గారిని క్షమించమని ఆడిగాను.
కాని, నా తనువు, మనస్సు, టన్నులకొద్దీ భక్తిని, ప్రేమని అర్పిస్తోందని విన్నవించుకున్నాను. 20 నిమిషాల తరువాత నాతో వచ్చినతను నావెనకే నాదర్శనం పూర్తి అయేంతవరకూ వేచిచూస్తున్నాడని గ్రహించాను. అతను నన్నుఆఫీసులోకి తీసుకువెళ్ళాడు. అక్కడ ఒకపెద్ద వయసున్న ఒకాయనకి పరిచయం చేశాడు.
ఆయనతో “సర్, నేను స్వయంగా, ఈ శాలువాను తయారు చేసి, దాని మీద 108 సాయినామాలు రాశాను. దీనిని బాబా గారికి సమర్పించాలనుకుంటున్నాను” అని చెప్పాను. ఆయన నుంచుని, నా శాలువా చూశారు. నాకు లోపల భయంగా వుంది ఆయన ఒప్పుకోరేమోనని.
రేపు తరువాయి భాగం….
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- ఎన్నో సాయి లీలలతో మరచిపోలేని మా షిరిడీ యాత్ర మొదటి భాగం…
- ఎన్నో సాయి లీలలతో మరచిపోలేని మా షిరిడీ యాత్ర మూడవ భాగం…
- షిరిడీ యాత్ర అనుభవం – ఇచ్చిన మాట మరవద్దు
- ఆనందకరమైన షిరిడీ యాత్ర–Audio
- బాబా ఇచ్చిన ఇటుక (రెండవ భాగం)
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments