బాబా భోదామృతం (భక్తలీలామృతం చాప్టర్ 33) తొమ్మిదవ భాగం….



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

నిన్నటి తరువాయి భాగం….

మానవుల చిత్తం అతి చంచలం. దానిని స్థిరపరచే ప్రయత్నం చేయాలి. దోమలు అన్నింటిపైనా కూర్చుంటాయి కాని అగ్నిని చూడగానే వెంటనే వెనక్కు మరలి పోతాయి. అట్లే మనసు అన్నింటి యందు రమిస్తుంది. కాని బ్రహ్మను చూడలేక మొహం చాటేస్తుంది. ఇది దాని నైజం. మనసు పరమాత్మ యందు లగ్నమవనంతవరకు జననమరణ యాత్ర తప్పదు.

నరజన్మకు రాగానే, ముందు ఈ జననమరణాలను తొలగించుకునే ప్రయత్నం చేయాలి. ఎందుచేతంటే, ఈ జన్మలో లభించిన అవకాశం రెండవసారి అసంభవం కావచ్చు. అందుచేత మనసును స్థిరపరచటానికి మూర్తి పూజా విధానం. పరమేశ్వరుడు మూర్తి యందున్నాడని భక్తిగా మూర్తిని ఆరాధిస్తే చిత్తచాంచల్యం పోయి ఏకాగ్రత కలుగుతుంది.

ఏకాగ్రమైన మనసుంటేనే ఆధ్యాత్మ గ్రంధావలోకనం, మననం, ధ్యానం సాధ్యం. దీనిని అభ్యసించటానికి తప్పక ప్రయత్నం చేయాలి. “పర్వతాలలో మేరు పర్వతం వలె” సర్వ విద్యలలో ఈ ఆత్మ విద్య ప్రధానమైనదని గ్రహించు. ఆత్మ విద్యను సాధించిన తర్వాతే ముక్తి కాంత వరిస్తుంది. అట్టి వారికీ భగవంతుడు బానిసవలె అంకితమైపోతాడు. ఆధ్యాత్మ విద్య యొక్క మెట్లను అదిష్టించడం కష్టం. అయినా ముక్తికి సులభోపాయం చెప్పుతాను విను.

నువ్వు, మారుతి, తాత్యా, హరిపంతు, బేరె కాకా మొదలగు భక్తులు మోక్షాన్ని పొందటానికి నేనిదివరలో తెలియచేసిన జ్ఞాన భాండారాన్ని అనుసరించి ప్రవర్తించండి. అందరు పరమేశ్వరుని శరణం పొందండి. నిత్యం సిద్ధుల, సత్పురుషుల దర్శనం చేసుకోండి. నీతిగా వ్యవహరిస్తుంటే, ఆ పుణ్యం కారణంగా అంతిమ సమయంలో చిత్తం పరిశుద్ధంగా ఉంటుంది. అట్టి నిర్మల మనసుతో భగవంతుని స్మరించాలి.

అంతిమ సమయంలో ఎవరిపైననూ మోహం పెట్టుకోకూడదు. మనసును ఏకాగ్రపరచి ఒక్క పరమాత్మనే గుర్తుంచుకోవాలి. లేదా ఇష్ట దైవాన్ని, ఆరాధ్య దైవాన్ని ధ్యానించాలి. అట్టి ధ్యానంలో మరణం సంభవిస్తే సామీప్య ముక్తి లభిస్తుంది. బన్ను, అడ్కర్, వేణు ముక్తులై వెళ్లిపోయినట్లుగా ఆత్మ జ్ఞానంతో ముక్తులైపోతారు” అని భోదించి సాయినాధ మహారాజు తమ అభయ హస్తాన్ని నానా యొక్క శిరసుపై ఉంచారు.

నానా పులకాంకితుడై తన రెండు చేతులు జోడించి, వినయంగా పరబ్రహ్మ మూర్తీ! మహాసిద్దా! కరుణాకరా! గుణ గంభీరా! పరమ ఉదారా! నా తండ్రీ! మా వంటి అజ్ఞానులను భవనదిని దాటించి తీరానికి చేర్చే నౌక మీరే. ఇటువంటి దివ్య జ్ఞానాన్ని బోధించి, యెల్లప్పుదూ మమ్ము కరుణించండి. అని వేడుకున్నాడు.

అప్పుడు బాబా “మీరందరూ నా భక్తులు కదా! నేను మిమ్మల్ని మరువగలనా? మీరేం చింత పెట్టుకోకండి. శ్రీరాముడు, అల్లా ఇలాహి మీకు సుఖాలను కలిగించి, మీ కోరికలను తీరుస్తారు. నా ఈ వచనం ప్రమాణమని” చెప్పారు.

బాబా మహాత్మ్యాన్ని తెలుసుకున్నవుకదూ, వారిని సందర్శించుకుని వారి పాదాలకు వందనం చేద్దాం పద. బాబా అనాధులకు తల్లి, మనలను తరింపచేస్తారు. ఈ రోజు చందోర్కర్, హరిపంతు మొదలగు భక్తులు కూడిన మేజువాణి ఉంటుంది. బాబా భక్తిని జ్ఞాన వైరాగ్యాలను పక్వాన్నాలుగా వడ్డించి మీకేది రుచిస్తే దానిని యదేక్షగా అరగీంచండని అజ్ఞాపిస్తారు.

మనముభయులం సాయి సమర్ధుని ద్వారం వద్ద కుక్కలవలె పడి ఉందాం. ఒకటి రెండు ముక్కలు మన వైపు విసరక మానరు. మనం కృతార్ధులమై పోవటానికి మనకవి చాలు. త్వరగా పద. ఇటువంటి పర్వకాలం మరల రాదు. అధ్యాయాన్ని నిత్యం ఒక సారైనా పఠిస్తే శతాశ్వమేధ యజ్ఞ పుణ్య ఫలం లభిస్తుందని శ్రోతలకు మనవి. శ్రీ సాయి యొక్క ఈ అధ్యయ త్రయం గంగా యమునా సరస్వతి సంగమం. ఇదే ప్రయాగ. దీనిలో మునకలు వేయండి.

స్వస్తిశ్రీ భక్తలీలామృతంలో యధాశక్తి సత్యాన్ని వచించాను. ఇది భక్తులకు తారకం కావలెనని దాసగాణు మనవి (ఇతి 33వ అధ్యాయం సమాప్తం)

source: దాసగణు గారి రచన భక్తలీలామృతం చాప్టర్ 33

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles