బాబా భోదామృతం (భక్తలీలామృతం చాప్టర్ 33) అరవ భాగం….



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

శ్రీ గణేశాయనమః త్రిగుణాత్మక త్రిగుణాతీత! విశ్వవ్యాపకా! విశ్వాతీతా! సర్వారంభా! సచ్చిదానందా! వరదాయకా! సాయి సమర్దా! శబ్దాలను సృష్టించినది మీరే. శబ్ధాలు కూడా మీరే. వీని నుండి మిమ్మల్ని వేరుపరచితే వాక్కు కుంఠితమౌతుంది. మీరు మంగళరూపులు, మంగళ కర్తలు. అటువంటప్పుడు ఆమంగళానికి అశుభానికి చోటెక్కడిది? బాబా భక్తుడు నానా చందోర్కర్ మరల షిర్డీ గ్రామానికి వచ్చారు.

సాయిని దర్శించుకుని వారి చరణాలకు వందనం చేసి “బాబా! నాకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించండి” అని వేడుకున్నారు. బాబా చాలా సంతోషించి “నేను చెప్పేది మరి శ్రద్ధగా విను. సుఖదుఃఖాలు లేని చివరి స్థితి ముక్తి అని చెప్పాను కదా! అట్టి స్థితిని పొందటానికి ఎలా ప్రవర్తించాలో విను. శరీర ప్రారబ్ధాన్ని అనుభవిస్తున్నప్పుడు యెల్లప్పుదూ సదసద్విచార శక్తిని జాగృతంగా ఉంచుకోవాలి. దీనిని మరవకూడదు.

సహజంగా సంభావించేదంతా నిశ్చయంగా శరీర ప్రారబ్ధం. కాని, ఏ పనైనా చేసిన వెంటనే సంభవించే ఫలితం శరీర ప్రారబ్ధం కాదు. అనేకమంది దుండగులు దొంగలు దోపిడీ చేస్తారు. ఆ దుష్కర్మ ఫలితానికి శాస్తిగా శిక్షను అనుభవిస్తారు. ఆ శిక్షను అనుభవించటం కచ్చితంగా శరీర ప్రారబ్ధం కాదు. గరళం మ్రింగితే మరణం తప్పదు. అది కూడా శరీర ప్రారబ్ధం కాదు. అది కర్తకు, చేసిన పనికి కలిగిన ఫలితమన్నమాట.

ఒక గుమస్తా యజమాని యొక్క ధనం లేదా ధాన్యం కాజేసి ఆ దనానికి తాను యజమానుడైపోతాడు. అది కూడా శరీర ప్రారబ్ధ భోగం కాదు. ఆ గుమస్తా హాయిగా గుఱ్ఱపు బండ్లలో తిరుగుతూ నేను సుఖంగా ఉన్నాననుకుంటాడు. కాని అతడు కాజేసిన ధనం పాపాన్ని మూటకట్టి పెడ్తుంది. ఆపాపం అతని పునర్జన్మకు సంచిత క్రియమాణ కర్మ అవుతుంది. ఈ సంచిత క్రియమాణ కర్మలను బట్టే జన్మ కలుగుతుంది.

ఈ విషయాన్ని జ్ఞానులు తెలుసుకుంటారు. కాని మూర్ఖులు ఎరుగలేరు. శరీర ప్రారబ్ధ కర్మ కాకుండా గుమాస్తాగిరితో చేసిన పాప కర్మను అతడు మరో జన్మకు కూడా పెట్టుకున్నాడు. ఈవిధంగా అతడు పునర్జన్మకు సరుకు సరంజామాను ఏర్పాటు చేసుకున్నాడన్నమాట. ఇట్టి జననమరణ యాత్ర ఎలా వదిలి పోగలదు చెప్పు?

అధికార పదవులలో అనేకులు హాయిగా ఉంటారు. కొందరు ఊరూరు తిరుగుతూ పురాణాలు వ్యాఖ్యానిస్తారు. కొందరు యోగులౌతారు. కొందరు అంగళ్ళలో వ్యాపారం చేస్తారు. మరికొందరు బడి పంతుళ్ళు పిల్లలకు పాఠాలు చెప్పుతారు. యోగులు, దుకాణాదారులు, బడి పంతుళ్ళు, అధికారులు అందరు యేవో పదవులలో ఉన్న వారే.

అందరి ప్రయత్నం ఒక్కటే అయినా మరి వేరు వేరు పనులలో ఎందుకున్నారో తెలుసా? వారి వారి శరీర ప్రారబ్ధ యోగం వలన. అంతేకాని వారి వారి ప్రయత్నాల వలన వచ్చిన ఫలితం మాత్రం కాదు” అని సద్గురు సాయి చెప్పగా, నానా దొంగతనం చేసి దొంగ అయితే కర్మ ఫలమని అంటున్నారు. మరి దొంగావటం కూడా శరీర ప్రారబ్ధం కాదా? అని అడిగాడు.

భక్తుని ప్రశ్నకు సమాధానంగా సాయిబాబా “నానా భలే పిచ్చి ప్రశ్న వేశావు. నిజంగా దొంగతనం చేసిన అసలు దొంగలు పారిపోతారు. పట్టుబడరు. వారిని శిక్షించటానికి, ఏ సాక్ష్యం దొరకదు. ఇది వారి శరీర ప్రారబ్ధం. ఒక దొంగ కారాగారంలో మ్రగ్గుతుంటే, మరొక దొంగ హాయిగా తిరుగుతుంటాడు. ఇక్కడ కర్మ ఫలం ఏమైంది? వారి కృత్యాల ఫలితాన్ని ఎలా నిర్ధారణ చేయాలి చెప్పు? ఇద్దరు వ్యక్తులు చేసిన పని ఒక్కటే- దొంగతనం.

ఒకడు శిక్షను అనుభవిస్తుంటే మరోకడసలు పట్టుబడడు. ఇదే మరి శరీర ప్రారబ్ధమంటే – అసలు పట్టుబడకుండా పారిపోయిన దొంగ యొక్క పాపం ఎక్కడికి పోదు. అది పునర్జన్మకు కారణమౌతుంది. అందుచేత ఈ జీవితానికి(జన్మకు) కేటాయించిన పాప కర్మను అనుభవించేటప్పుడు నీతిని పాటించాలి.

దుష్టులు దుర్జనులు మరియు నాస్తికుల నీడలో కూడా ఉండకూడదు. తినకూడని వానిని తినరాదు. వితండ వాదాలు తర్కాలు చేయరాదు. ఇచ్చిన మాటను అతి జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి. మాట తప్పే మనుషులు భగవంతునికి ప్రీతి పాత్రులుకారు.

ఇంక ఉంది…..

source: దాసగణు గారి రచన భక్తలీలామృతం చాప్టర్ 33

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles