నా సమస్యలను తాను తీసుకున్నానని బాబా చెప్పారు



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

ఇది నా స్వీయ అనుభవం నేను మీ అందరితో భాగస్వామ్యం చేస్తున్నాను. 1998 సంవత్సరం ప్రారంభం అంటే జనవరి నెలలో నా తల్లికి జ్వరం వచ్చి ఐదు రోజుల గడిచినా కూడా జ్వరం తగ్గిపోలేదు. ఆమె చాలా యాంటీబయాటిక్స్ వాడరు కాని ఎటువంటి ఉపయోగం లేదు. ఏడవ రోజున ఆమె చాలా బలహీనంగా ఉండటంతో ఆమెకు గ్లూకోజ్ ఎక్కిస్తే బాగుంటుందని నేను ఆసుపత్రికి తీసుకువెళ్ళాను.

ఆమెను హాస్పిటల్లో అడ్మిట్ చేయమని నాకు చెప్పారు. ఆమె బలహీనంగా ఉంది కానీ నడవగలుగుతున్న స్థితిలోనే ఉన్నారు. అడ్మిట్ చేసే ముందు, రక్తం, మూత్రం, తదితర మరియు ఛాతీ ఎక్స్ రే వంటి అన్ని సాధారణ పరీక్షలు చేయించారు. పరీక్షలలో ఎటువంటి ఇన్ఫెక్షన్ సోకినట్లు నిర్ధారణ కాలేదు. ఇది వైరల్ జ్వరం అని నిర్ధారించారు.

కానీ ఆ మరుసటి రోజు నేను ఆసుపత్రిలో అమ్మను కలవడానికి వెళ్ళినప్పుడు, డాక్టర్ “ఆమెకు తీవ్రమైన మూత్రపిండ వైఫల్యం, ఊపిరితిత్తుల వైఫల్యం, బహుళ అవయవ వైఫల్యం ఉందని కేవలం ఆమె మెదడు మాత్రమే పని చేస్తుంది” అని నాకు చెప్పారు. నేను ఈ సైట్లో చూసినట్లుగా నేను బాబా యొక్క గొప్ప భక్తులలో ఒకరిని మాత్రం కాదు.

కానీ నేను బాబాను మనస్పూర్తిగా ప్రార్ధించాను. ఏడుస్తూ నా తల్లిని రక్షించమని ఆయనను వేడుకున్నాను. మరుసటి రోజు న్యూ మూన్ డే, ఆ రోజున సాధారణంగా నష్టమే జరుగుతుంది అని చాలామంది మిత్రులు నాకు చెప్పారు, అందువల్లనే వచ్చిన ఫలితాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉండమని చెప్పారు.

నేను చాలా బాధతో బాబాని ప్రార్ధించాను. ఇది వెర్రితనం అనిపిచింది. అయినప్పటికీ, నా భాధనంత కాగితం మీద వ్రాసి మా పూజ గదిలో బాబా ముందు ఉంచాను. ఆ సమయంలో బాబా భక్తులలో ఒకరు నాకు ఫోన్ చేసి, బాబా ఖచ్చితంగా సహాయం చేస్తారని నాకు చెప్పారు. మరియు అతను నాకు కొన్ని సంకేతాలను చూపించారు.

నేను కొంచం ఆశాజనకంగా ఉన్నాను, కానీ అదే సమయంలో చాలా భాదను కూడా అనుభవిస్తున్నాను. నా కారును తీసుకుని వెళ్తూ నా ఇంటి నుంచి 100 గజాల దూరంలో నేను ఒక పొడవైన నల్ల త్రాచును చూశాను. నా గుండె అవిశ్వాసంతో చాలా వేగంగా కొట్టుకుంది. వెంటనే నా సమస్యలను తాను తీసుకున్నానని బాబా నాకు చెప్పారు. ఇది ఎవరికైన వింతగా అనిపించవచ్చు కానీ నేను విన్నది నిజం.

అప్పటి నుండి నెమ్మదిగా మా అమ్మ నెమ్మదిగా కోలుకుంది. నిజానికి అత్యవసర పరిస్థితిలో ఆమెను చూసిన వారు అంత ఆమె ఇంటికి తిరిగి వస్తుందని ఎవరు అనుకోలేదు. బాబా మాత్రమే ఆమెను రక్షించినట్లు నేను భావిస్తున్నాను.

మనం పిలిచినప్పుడు ఆయన తప్పకుండా వింటారు. ఇది నిజం.

లతా రమేష్

source: http://forum.spiritualindia.org/your-experience-with-sai-baba/a-sai-devotee-5086/

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles