Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
నిన్నటి తరువాయి భాగం….
శరీరంలో కామ వికారం కలిగినప్పుడు తన స్వంత స్త్రీ అంటే భార్యతోనే రమించాలి. కాని యెప్పుడూ అదే కామకలాపాలలో ఉండకూడదు. కారణం కామలోలువుడైన మానవుని ముక్తికాంత వరించదు. ఈ కామం చాలా బలియమైనది. ఇది మనసును స్థిరంగా ఉండనీయదు.
అరిషడ్ వర్గాలలో దీనికి అన్నింటి కంటే కూడా అధికమైన శక్తి ఉంది. అందువల్ల ఈ కామాన్ని స్తిమితంగా ఉంచాలి. దీనిని వివేకం యొక్క కంఠానికి కట్టి పడేయాలి. ఇది మన చెప్పు చేతలలో అణిగి ఉండాల్సిందే. కాని, ఇది ఆజ్ఞాపించినట్లల్లా నడుచుకోకూడదు. ఈవిధంగా ఎవరు ప్రవర్తిస్తారో వారే బుద్ధిమంతులు.
శరీర ప్రారబ్ధాన్ని అనుభవించేటప్పుడు కామ క్రోధ లోభ మోహ మద మత్సరాలనే ఆరు వికారాలను అవసరమున్నంత వరకు అతిజాగ్రత్తగా వినియోగించుకోవాలి. హరి నామాన్ని లోభ బుద్ధితో కూడబెట్టుకోండి. కాని ఈ లోభం ధన వ్యయంలో ఉండకూడదు. క్రోధాన్ని అవినీతికరమైన విషయాలలో చూపించాలి. మోహాన్ని పరమాత్మ యందు పెంచుకోవాలి. దుష్కర్మల యందు మత్సరాన్ని కలిగి ఉండాలి. మదమనే వికారానికి మనసులో అసలు చోటివ్వకండి.
అంతరంగంలో మోక్షకాంక్ష పెంచుకోండి. అంతఃకారణాన్నెల్లప్పుడు పరిశుద్ధంగా ఉంచాలి. సత్పురుషుల చరిత్రలను శ్రవణం చేయాలి. జననీజనకుల గౌరవ మర్యాదలను కాపాడాలి. జ్ఞానులను గౌరవించాలి. కన్నతల్లి సహస్రతీర్ధాలకు నిలయమని, తండ్రి ఆరాధ్య దైవమని తలచి వారికీ వందనం చేయాలి. సహోదరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి. భేదబుద్ధితో అక్కచెల్లెళ్ళను ఆశ్రద్ధతో విడిచి పెట్టకూడదు.
ధర్మ పత్నితో ప్రేమతో వ్యవహరించాలి, కాని స్త్రీ లోలురు కాకూడదు. కేవలం గృహ కార్యాలలో ఆమె అనుమతిని తీసుకోవాలి. కోడలితో కొట్లాట పెట్టుకోకూడదు. ఆమె ఏకాంతంగా ఉన్న చోటికి వెళ్ళకూడదు. పిల్లలతో హాస్యాలాడకుండా ఉండటం మంచి లక్షణం. నౌకరులను సన్నిహితులవలె చూడరాదు. వారిని నేత్తికేక్కించుకోకూడదు.
అస్తిపాస్తులున్నాయని ముసలి వానికి కన్యను దానం చేయరాదు. అమ్మాయికి సరిగ్గా జతగుడే సులక్షణమైన అల్లుణ్ణి చూడాలి. ఇప్పుడు చెప్పినదంతా పురుషుల ధర్మం. ఈ విధంగా సదాచారాలతో ప్రవర్తించే వారిని మాయా బంధనాలు బాధించవు.
ఇక స్త్రీల ధర్మం. స్త్రీకి పతి దైవ సమానం. పతి యొక్క ధర్మమే ఆమె ధర్మం. పతి సేవ చేయాలి. పతిని ప్రేమించాలి. పతి కోపిస్తే నమ్రతతో సహించే వారి జీవితం ధాన్యం. ఆమె యే గృహలక్ష్మి. పతిని దుఃఖపెడుతూ నానారకాల వ్రతలనాచరించే స్త్రీ పాపి. స్త్రిలెప్పుదూ వినయం కలిగి ఉండాలి. చెడుగా ప్రవర్తించకూడదు. ఎవరూ లేని ఏకాంత ప్రదేశాలలో పరపురుషులతో మాట్లాడకూడదు. తన సహోదరుడైనా సరే ఏకాంతంగా మాట్లాడరాదు.
స్త్రీ శరీరం, అవినీతికి ఆహారమని తలచి అత్యంత అప్రమత్తంగా ఉండాలి. తోడేళ్ళకు మేకలు ఆహారం. అందువల్ల వానిని ముళ్ళ కంచెల మద్య ఉంచి రక్షిస్తారు. అదేవిధంగా స్త్రీ రూపంలో ఉన్న మేకలను తీవ్రమైన వ్రతాలనే కంచెలలో ఉంచాలి. స్త్రీలు చిన్న పిల్లల పెంపకంలో చాలా దక్షులై ఉండాలి. వారు తమ పిల్లలకు మంచి మాటలు, నీతి కధలు చెప్పి వారిని సన్మార్గరతులను చేయాలి.
స్త్రీలు అత్తమామలను, ఆడపడుచులను ఆదరాభిమానాలతో చూడాలి. కాని వారిని ద్వేషించకూడదు. స్త్రీలు నలుగురూ చూచి మెచ్చుకునేలా ప్రవర్తించాలి. ఏవైనా వ్రతాలను ఆచరించాలనుకుంటే పతి అనుమతిని తీసుకోవాలి. పూర్వ పాప కర్మానుసారం పతి మరణిస్తే బ్రహ్మచర్యాన్ని కఠినంగా ఆచరిస్తూ జీవితాన్ని గడపాలి.
వైధవ్యం సంభవించినప్పుడు మృదువైన శయ్యపై పరుండరాదు. శరీరానికి సువాసనా ద్రవ్యాలేవీ వాడకూడదు. కామోద్దీపనాన్ని కలిగించే అహరన్నెప్పుదూ సేవించరాదు. శాకాహారాన్ని మాత్రమే తింటూ, ఏకాదశి మొదలగు ఉపవాస వ్రాతలనాచారిస్తూ, మనసులో జగన్నాధుని ధ్యానించాలి.
విధవ స్త్రేలెప్పుదూ పురాణాలను, ఆధ్యాత్మనిరూపణను శ్రవణం చేయాలి. సన్యాసినులవాలే జీవిస్తూ భక్తితో దేవతార్చన చేయాలి. యెల్లప్పుదూ అత్మానాత్మల విచారం చేస్తూ ఉండాలి. ఇది స్త్రీ పురుషుల నీతి. ఈవిధంగా ప్రవర్తిస్తే మాయా బంధనం అనాయాసంగా తొలగిపోతుంది.
ఇంక ఉంది…..
source: దాసగణు గారి రచన భక్తలీలామృతం చాప్టర్ 33
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- బాబా భోదామృతం (భక్తలీలామృతం చాప్టర్ 33) తొమ్మిదవ భాగం….
- బాబా భోదామృతం (భక్తలీలామృతం చాప్టర్ 33) అరవ భాగం….
- బాబా భోదామృతం (భక్తలీలామృతం చాప్టర్ 32) ఐదవ భాగం….
- బాబా భోదామృతం (భక్తలీలామృతం చాప్టర్ 32) నాల్గవ భాగం….
- బాబా భోదామృతం (భక్తలీలామృతం చాప్టర్ 33) ఎనిమిదవ భాగం….
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments