బాబా భోదామృతం (భక్తలీలామృతం చాప్టర్ 32) నాల్గవ భాగం….



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

నిన్నటి తరువాయి భాగం….

ఈ ప్రపంచంలో అసలెలా వ్యవహరించాలో చెప్తాను సరిగ్గా విను. బుద్ధిమంతుడు శరీర ప్రారబ్దానుసారం తనకు ప్రాప్తించిన పరిస్థితిలో తృప్తిగా ఆనందంగా జీవించాలి. అంతేకాని అనవసరమైన ఆవేదనలేవి పెట్టుకోకూడదు. ఫలాలతో నిండుగా ఉన్న వృక్షమెలా వంగి ఉంటుందో, అట్లే ఇంట్లో ధన సంపత్తి బాగా ఉన్నప్పుడు అత్యంత నమ్రతతో నడుచుకోవాలి. ఈ నమ్రత మంచిదే కాని అది అందరి పట్లా పనికి రాదు.

ఈ ప్రపంచంలోని దుర్జనులను, దుష్టులను తెలుసుకొని దుష్టుల ఎడ కఠోరంగా ప్రవర్తించాలి. సాధు సజ్జనులను గౌరవించాలి. వారి సన్నిధిలో తనను ఒక గడ్డి పోచ కంటే కూడా అల్పంగా భావించుకోవాలి. ఐశ్వర్యం మధ్యాహ్నపు నీడవంటిదని యెల్లప్పుదూ గుర్తుంచుకోవాలి. ధన మదంతో యెవరనీ ఎప్పుడూ మోసం చేయకూడదు. తమ కున్నంతలో దానధర్మాలు చేయాలి.

అంతే కాని అనవసరమైన గొప్పల కోసం అప్పులు చేసుకోకూడదు. ప్రపంచం అశాశ్వతమైనది. నిజమే, కాని శరీర ప్రారబ్ధం సత్యమే కదా, జీవించడానికి ప్రపంచ వ్యవహారాలకు ద్రవ్యమవసరం. శరీరంలో పైత్యరసం ఎలా అవసరమో అలాగే ప్రపంచంలో ధనమవసరం. అది ఆవశ్యక వస్తువే అయినా మనసు పూర్తిగా దానిలోనే మునిగిపోకూడదు. ధన వ్యయంలో ఉదార స్వభావమే ఉండాలికాని, కృపణత్వమెప్పుదూ పనికి రాదు.

అట్లా అని వ్యర్ధమైన దాంభికం కూడా పనికి రాదు. ఎందువల్లనంటే ఉన్న ధనమంతా ఖర్చైపోయాక పలకరించే వారెవరూ ఉండరు కనుక. ఉదార స్వభావాన్ని వ్యర్ధమైన ఖర్చును ఈ రెంటినీ బాగా తెలుసుకోవాలి. లేదా అనర్ధం సంభవిస్తుంది. ద్రవ్యాన్ని దానం చేసేటప్పుడు, పాత్రతను, యోగ్యతను, ఆవశ్యకతను తప్పకుండా చూచి తమ చేతులను సడలించాలి.

బాలురు, కుంటి, గ్రుడ్డివారు, రోగగ్రస్తులు, అనాధులు ద్రవ్యదానానికి పాత్రులు. అట్లే సార్వజనిక సమాజ సేవా క్రుత్యాలలో కూడా ద్రవ్యదానం యోగ్యమైనది. విద్వాంసులకు సరియైన సంభావనలనివ్వటం మంచిది. అట్లే అనాధ స్త్రీల అవసరాలకు యధాశక్తి ద్రవ్య సహాయం చేయాలి.

ఇక అన్నదానం – ఇది మూడు రకాలు. 1. విశేష సమయాలలో చేసేది. 2. నిత్యాన్న దానం 3. ఏదో ఒక కార్యానికి కారణంగా చేసేది.

విశేషమైన అన్నదానం ఏ ఏ సమయాలలో చేయాలంటేగృహంలో సంవత్తి వచ్చినప్పుడు, కాలం అనుకులించి అన్నీ సవ్యంగా జరిగినప్పుడు, మనసులోని కోరిక తీరినప్పుడు, సహస్ర భోజనం అంటే వేయిమందికి అన్నదానం చేయాలి. ఈ అన్నదనంలో ఉచ్చనీచ భేదభావం ఉండకూడదు. సుష్టులైనా, దుష్టులైనా సరే నాలుగు వర్ణాల వారూ శ్రేష్టులే. కాని ఈ అన్నదానాన్ని ఎప్పుడైనా సరే అప్పు చేసి చేయకూడదు.

నిత్యాన్న దానానికి ఎవరెవరు యోగ్యులో చెపుతున్నా విను. తపస్వీకులు, సన్యాసులు, బాటసారులు, ఆకలిగొన్నవారు పాత్రులు. మాధుకరిని (భిక్ష) చేస్తూ విద్యార్జన చేసుకునే వారికీ నిత్యం అన్నం పెట్టాలి.

ఇక వివాహాలు, పండగలు, వడుగులు, లేక వ్రాతోద్యాపనలలో చేసేది కార్య కారణ అన్నదానం. ఇటువంటి దానిలో యిష్టులను, మిత్రులను, ఆప్తులను, సఖులను, బంధువులను ఆహ్వానించి ఆదరంగా భోజనం పెట్టాలి.

ఇంతవరకూ అన్నదానం గురించి చెప్పాను కదూ! ఇప్పుడు వస్త్రదానం గురించి విను! అన్నదానం వలెనే మన శక్త్యానుసారం వస్త్రదానం చేసి ఇతరుల బాధను తొలగించాలి. తమ చేతిలో అధికార సత్తా ఉంది కదా అని దాన్నెప్పుడు దురుపయోగం చేయకూడదు. అవసరమైన వాని కంటే అధికంగా వ్యర్ధమైన దుస్తులను ధరించి, గొప్పగా అహంకార దర్పాన్ని కనబరచకూడదు.

అంతేకాదు న్యాయాసనంపై తీర్పు చెప్పేటప్పుడు లంచాలవి తీసుకోకూడదు. తమ శిరసుపై నియమింపబడ్డ ఏ బాధ్యతా కార్యమైనా దానిని జాగ్రత్తగా ఉత్తమంగా చేయాలి. ఏ కారణమూ లేకుండా ఎవరినైనా సరే అవమానించరాదు. శఠులు(మోసగాళ్లు) దుష్టులు, దుర్మార్గుల పట్ల ఎల్లప్పుడూ జాగ్రత్తగా వ్యవహరించాలి.

పుత్రులు పుత్రికలు, దాసదాసీలు శరీర ప్రారబ్దానుసారం ప్రాప్తిస్తారు. వారిని దయగా ప్రేమగా చూడాలి. భార్య పుతులు, పుత్రికలు స్వజనులు వీరంతా నావారు నావారని మనసులో వారిపై అభిమానాన్ని పొంచుకోవటమే జననమరణాల భ్రమణానికి కారణం.

ఇంకా ఉంది…

source: దాసగణు గారి రచన భక్తలీలామృతం చాప్టర్ 32

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles