నా జీవితంలో నాకు కనువిప్పు కలిగించిన అద్భుతమైన సాయి కృపాలీల



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

సాయి సురేష్ గారు నేను తాడేపల్లిగూడెం నుండి భాస్కరాచార్యులు, సాయి నాకు కూడా నా జీవితంలో నా సాయితండ్రి చేసిన సహాయములను మనవాళ్లతో పంచుకోవాలనే సంకల్పం కలిగింది. అప్పుడప్పుడు ఒక్కొక్కటి మీకు పంపిస్తూ ఉంటాను మీకు వీలుచిక్కినప్పుడు వాటిని మీరు పబ్లిక్ చేయండి. సాయి శరణం.

అఖిలాడకోటి బ్రహ్మాండ నాయకా రాజాధిరాజ యోగిరాజ సాయినాధ్ మహారాజ్ కి జయము. సాయి బంధువులందరికి ఆత్మీయ నమస్కారములు…. నా జీవితంలో నాకు కనువిప్పు కలిగించిన అద్భుతమైన సాయి కృపాలీల …

ఈ లీల జరిగిన క్షణం నుండి అప్పటివరకు నాకు తెలియకుండానే నా ఆధ్యాత్మిక ప్రగతికి ప్రతిబంధకంగా ఉన్న నా అహంకారపు ఉక్కు కవచాన్ని నా సాయితండ్రి గోధుమలను పిండి చేసినట్టు పిండి చేయడం ప్రారంభించారు. ఈ లీల జరిగేనాటికి నేను ఇంకా సాయితండ్రికి సంపూర్ణ శరణాగతి చేయలేదు.

కానీ నేను వందలకొద్దీ గ్రంధాలు, యోగుల చరిత్రలు చదివాను. నాకు ఉహ తెలిసిన రోజుల్లో నేను పారాయణ చేసిన మొట్టమొదటి గ్రంధం అనుకోకుండా సాయి సత్చరిత్ర పారాయణ చేయడం.

అప్పుడు తెలియనితనంతోనో లేక నాపుణ్యం నాకు సరిపోకనో గురువుకే సధ్గురువైన సాయిని గురువుగా భావించక సత్చరిత్ర ప్రేరణతో, సథ్చరిత్ర లో ప్రస్థావించబడ్డ గురుచరిత్ర, విష్ణుసహస్రనామాలు, ప్రస్థానత్రయం, తెలుగు జ్ఞ్యానేశ్వరి ఇత్యాది గ్రంధాలు పారాయణ చేస్తూ కుడా బాబాని తెలుసుకోలేకపోగా, “పనిచేయి సత్గ్రంధాలు చదువు దేవుని నామం ఉచ్ఛరించు” అని బాబా చెప్పినట్లుగా యోగుల చరిత్రలూ గురుచరిత్ర పారాయణలలో ఉండిపోయాను.

ఇక విషయానికి వస్తే నా వివాహానికి ముందు నుండే నేను జ్యోతిష్యంలో ప్రవేశం కలిగి ఉన్నాను. బాబాగారు జాతకాలు పట్టించుకోవద్దని చెప్పిన, చెప్పవద్దని చెప్పినా నాచుట్టూ ఉండే స్నేహితుల వత్తిడి వల్ల బాబామీద భారం వేసి వారికి జాతకం చెప్పేవాడిని. కానీ ప్రతిఫలం మాత్రం పుచ్చుకునేవాడిని కాదు. భగవంతుడి దయతో చెప్పింది జరిగింది అని విశ్వసించేవాడిని.

కొన్ని కారణాల వల్ల నాకు లేట్ మ్యారేజ్ ఐయింది. నా వివాహానికి ముహూర్తం నేనే చూసుకున్నాను. మా ఇరువురి జాతక పొంతనలో కలగబోయే సంతానానికి ఇబ్బంది ఉన్నట్టు గమనించాను. అయినా కూడా మంచి సంబంధం అని వచ్చిన మొదటి సంబంధాన్ని వివాహం చేసేసుకున్నాను. భగవంతుడు ప్రత్యేకంగా ఒకరికోసం ఒకరు అన్నట్టు మా జాతకాలతోపాటు పేర్లను కూడా జత చేసాడు. నా పేరు భాస్కర్ , తన పేరు సంధ్య .

అందరికి సిజేరియన్ ఆపరేషన్స్ కి ముహూర్తాలు పెట్టే నేను, కొన్ని వందల చంటి పిల్లల జాతకాలు చూసిన నేను నాకు పుట్టబోయే బిడ్డకు డెలివరీ టైం డిసైడ్ చేయలేక చేతులు ఎత్తేసి నేను భగవంతుడా శరణం అనేశాను. ఆ విషమ పరిస్థితి వినడానికి చిన్నగా అనిపించినా భగవంతుడి లీలను మాత్రం గమనించగలరు.

డెలివరీకు వెళ్లిన నా భార్య పుట్టింటి నుండి ఒక రోజు రాత్రి నాకు అర్జెంటు కాల్ వచ్చ్చింది, అల్లుడుగారు సీరియస్ అయింది డాక్టరుగారు ఒక్క అరగంట టైం ఇచ్చారు, ఈ కొద్దీ టైములో మీరు శుభముహూర్తం చూడండి అని. నేను తృళ్ళిపడ్డాను, చూస్తే అన్ని రకాలుగా విషమ ముహూర్తం ఉంది. కాళ్ళు చేతులు ఆడక వెంటనే మా గురువుగారి ఇంటికి పరుగులు పెట్టాను.

ఎప్పుడు వెళ్లినా చిరునవ్వుతో అందుబాటులోఉండే నా గురువుగారు వూళ్ళోనే లేకపోవడంతో గురువుగారి నాన్నగారిని సహాయం అడిగాను. ఆయన అబ్బాయి ప్రమాదకర పరిస్థితుల్లో ఆలస్యం చేయకూడదు వెంటనే ఆపరేషన్ చేసేయమను అనేసారు. ఈ లోపు నాకు పాప పుట్టిందని ఫోన్ వచ్చేసింది.

నేను సమయం చూస్తే ఆ సమయంలో శిశు జననం అత్యంత దోషం భవిష్యత్తు అస్సలు బాగోదు. అందరి జాతకాలు రాసే నాకు భగవంతుడు, నాముందు నీ జాతకాలు ఏం పనిచేస్తాయిరా అన్నట్టు చేసేసాడు. రాత్రంతా బాధతో పడుకున్నాను. బ్రహ్మముహూర్తం లో లేచి అప్రయత్నంగా బాబాఫోటోవైపు చూసాను.

బాబా మీద రెండు చేతులు వేసి నా తల బాబా ముఖం మీద పెట్టి బోరు బోరున ఇలా చేశావేంటి తండ్రి మొదటిసారి నన్ను తండ్రిని చేసింది ఇందుకేనా అని ఏడ్చేశాను. ఒక కొడుకుగా నా భవిష్యత్తు పాడైపోతుంటే ఒక తండ్రిగా నీకెంత బాధ కలుగుతుందో, నాకు కూడా ఇప్పుడు అలాంటి బాధగా ఉంది తండ్రి అని కడుపారా ఏడ్చేశాను.

నాకు ఉపయోగపడని జోతిష్యం మీద , జాతకం చెప్పమని అడిగే మనుషుల మీద విరక్తి కలిగింది. సాయి తండ్రి ముందు నా అహంకారం విడిచి జరిగిన ఈ బాధకి వేరే ఇతర దైవం కారణం కాదని బాబా మాత్రమే జవాబుదారీ అని మనస్ఫూర్తిగా ఆ క్షణంలో భావించాను.

ఇంతలో నా మనసుని ఎవరో ఆదేశించినట్టు అనిపించి మరలా ఆ ప్రసవ జననకాలం గణించాను, అక్షాంశ రేఖాంశాలు పరిగణనలోకి తీసుకుని పంచాగం రాసిన ప్రదేశానికి పాప పుట్టిన హాస్పెటల్కి కి కాలికకాషన్స్ లెఖ్ఖ కడితే తెలిసింది కదా మన సాయితండ్రి మహాద్భుతం…

మీరు నమ్మగలరో లేదో నా పాప భూమిమీద పడ్డ ఆ క్షణం మాత్రమే చాలా శుభకరం. ఆ క్షణానికి ముందు మరియు ఆ క్షణం తరువాత అత్యంత దోషం. నాకు తెలిసి ఇంతటి విషమ క్షణాలలో మానవమాత్రుడెవరూ ఇలాంటి ముహూర్తాన్ని ఊహించలేడు , ఊహించినా ఆ క్షణంలో జననం జరిగే అవకాశం నూటికి నూరుపాళ్లు ఉండవు.

ఇది ఆ విధాత సాయిధాత, ఆ ఈశ్వరుడు సాయీశ్వరుడు మాత్రమే చెయ్యగలిగే అద్భుతం. ఒక తండ్రిగా అప్పుడు నా సంతోషం ఎలా ఉంటుందో మీకు అర్ధం అయ్యే ఉంటుంది. ఇక ఈ అద్భుత ముహూర్త నిర్ణయం విలువ జోతిష్కులకు మాత్రమే అర్ధం అవుతుంది. ఈ సహాయం బాబా నుండి నేను పొందగానే ఇక నేను క్రమక్రమంగా సాయి ఉచ్ఛులో ఎలా పడిపోయానో ఆ ఎన్నో మిరకిల్స్ గురుబంధువులైన మీతో తరువాత పంచుకుంటాను.

అందరికి జోతిష్కుడిని నేను, నా జ్యోతిష్కుడు మాత్రం సాయిమహరాజు. ఇకనైనా మానవ జ్యోతిష్కులని ఫాలో అవడం మానవ ప్రయత్నాలు మానుకొండి. కేవలం సాయి శరణం మాత్రమే చెయ్యండి.

సాయినాధ్ మహారాజ్ కి జై . 🙏

సాయిశరణం

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles