నేను మాత్రమే సాయిని చూశాను : అద్భుతమైన సాయి లీల



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

నేను మాత్రమే సాయిని చూశాను : అద్భుతమైన సాయి లీల

మనము బాబా భక్తుల అనుభవాలని, బాబాను చూసిన వారి అనుభవాలనీ ఇంతకు ముందు కొన్ని చదివాము. అటువంటిదే మరొక బాబా భక్తురాలి అద్భుతమైన అనుభవాన్ని, బాబా ని దర్సించిన ఆమె అనుభూతిని ఈ రోజు తెలుసుకుందాము. ఈ

లీల సురేఖ గారు  పంపించారు. ఈ లీలని యథాతథంగా మీముందుంచుతున్నాను. 4, 5 రోజులుగా ప్రయాణాలలో ఉన్నా యే చిన్న అవకాశం చిక్కినా బాబా వారి లీల అందిద్దామనే నా కోరికను బాబా వారు తీరుస్తున్నందుకు ఆయనకి పాదాభివందనం చేస్తున్నాను.

బాబా అనుగ్రహం వల్ల నేను రెండు రోజులు షిరిడీలో ఉండే అవకాశం కలిగింది. షిరిడీ వెళ్ళడం నాకదే మొదటిసారి అవడం వల్ల నాకు చాలా ఉత్సాహంగా ఉంది. బాబా నాకు మంచి దర్శనాన్నిచ్చారు.  యాత్రలో అంతా ఆయన అనుభవాలనిచ్చారు. నాకు కలిగిన ఒక మథురానుభూతిని మీకు ఇప్పుడు చెపుతాను.

నేనందుకు పాత్రురాలిని కాకపోయినా, బాబా నన్ను యెప్పటిలాగానే అనుగ్రహించారు. షిరిడీలో బాబా వారు నడిచిన, నిద్రించిన, గ్రామ ప్రజలతో మాట్లాడిన, అందరికి వండి పెట్టిన, ఈ షిరిడీ లో అడుగిడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కాని, అప్పటి ఆ రోజులలో అప్పటి వారు బాబా వారి ఆశీర్వాదములు అందుకున్నట్లుగా, ఇప్పుడు ఈ సమయంలో నేను బాబా వారి ఆశీర్వాదం పొందలేకపోయానే అని, ఆయనని భౌతికం గా దర్శించలేకపోయానే అని వ్యాకులత పడ్డాను.

నేను షిరిడీ వదలి వెళ్ళేముందు మరొకసారి ద్వారకామాయిని దర్శించుకున్నాను. యెందుకంటే వెళ్ళేముందు బాబా వారి అనుమతి తీసుకుందామనే ఉద్దేశ్యంతో దర్శించుకున్నాను. (సచ్చరిత్రలోని సంఘటనలు నాకు జ్ణప్తికి వచ్చాయి….బాబా అనుమతి లేకుండా యెవరూ షిరిడీ విడిచి వెళ్ళలేరు అని)

నేను ద్వారకామాయినించి బయటకు వచ్చేటప్పుడు నాకు బాగా దుఖం వచ్చింది, నేను చూడటానికి బాబా సశరీరంతో లేరే అనే భావం గాఢంగా మనసులో కలిగి చిన్నపిల్లలా యేడిచేశాను. (బాబా ఇప్పటికీ ఉన్నారు, సర్వాతర్యామి అని తెలిసున్నప్పటికీ). అసంతృప్తితో నేను షిర్డి విడిచాను.

ట్రావెల్ ఏజెంట్స్ ప్రణాళిక ప్రకారం మేము షింగనాపూర్ వెళ్ళాల్సి ఉంది. (షిరిడీ నించి పూనే వెళ్ళే దారిలో ఉంది శనీశ్వర మందిరం). మేము యెక్కవలసిన బస్సు మందిరానికి కొద్ది దూరంలో ఉంది. అందుచేత దర్శనం తరువాత, యాత్రలో నాతో కూడా వచ్చిన ఆడవారందరితో కలిసి నేను నడవడం మొదలుపెట్టాను. అప్పుడు సమయం సుమరు రాత్రి 8 గంటలు అయి ఉంటుంది, దీపాలు కూడా లేవు.

మాసిన బట్టలతో ఒక స్థంభానికి ఆనుకుని ఉన్న ఒక ముసలివానిని చూశాను. మేమతనిని దాటుకుని వెడుతూండగా, అతను గట్టిగా తెలుగులో మాట్లాడటం మొదలుపెట్టాడు. అతను, “అమ్మల్లారా, నాకు తినడానికి యేదయినా ఇవ్వండి నాకు ఆకలిగా ఉంది” అన్నాడు. యెవరూ అతనికి సమాథానం చెప్పలేదు.

నేనొక్కదాన్నే ముందుకు నడవబోయే దానిని ఆగిపోయాను, అతని వైపు తిరిగి చూశాను. అతను నన్ను చూసి ఇలా అన్నాడు “నేను నిన్ను ఒక్కసారే అడుగుతాను, నేను నిన్ను మళ్ళీ అడగను, నీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వు.” నాకది ఒక విచిత్రమైన అభ్యర్థనగా అనిపించింది, నాకు తెలియకుండానే నేనతని వద్దకు వెళ్ళి 10 రూపాయలిచ్చాను.

అతను కుడిచేతితో డబ్బుతీసుకుని యెడమ చేయిపైకెత్తి “సుఖీభవ” అని దీవించాడు.  “సుఖీభవ” అనే మాట విన్న మరుక్షణమే నాకు నోట మాట రాలేదు. నాకు స్వర్గంలో ఉన్నట్టుగా అనిపించింది. ( నేను అతిశయోక్తిగా చెప్పటల్లేదు). నేను బస్సు వైపు నడవ డం మొదలుదలు పెట్టాను.

బస్సు లోపలికి అడుగు పెట్టే ముందు మరొకసారి అతనిని చూద్దామనుకున్నాను. అందుచేత అతనిని చూద్దామని తిరిగాను. అతను తన వదనంలో అందమైన చిరునవ్వుతో రెండు చేతులు యెత్తి నన్ను దీవించాడు. ఆ నవ్వు యెంతో దివ్యంగా ఉంది, అసమానమైనదిగా ఉంది. ఆ చీకటిలో కూడా అతని వదనం ప్రకాశవంతంగా వెలుగొందటం చూశాను.

బస్సులోకి వెళ్ళిన తరువాత నేను ఆ ముసలి వానిని గురించి, ఆ సంఘటనని మరచిపోయాను. నేను మా అమ్మగారితో కబుర్లలో పడిపోయాను. కొద్ది నిమిషాల తరువాత గుర్తుకు వచ్చి కిటికీ నుండి బయటకు చూశాను. ఆ స్థలంలో అతను నాకు కనపడలేదు. చుట్టూరా చూద్దామని నేను కిందకి దిగాను. అతను కూర్చున్న ప్రదేశం చాలా రోతగా ఉంది. ఒక ముష్టివాడు కూడా కూర్చోవటానికి తగినట్టుగా లేదు. అప్పుడు నేను గ్రహించాను అతను నాకూడా వచ్చి నన్ను దీవించినవాడు “నా సాయి” అని.
కాని నాకింకా సందేహం గాఉంది, మా అమ్మతో చెప్పి విషయాన్ని రూఢి చేసుకోవాలనుకున్నాను. నేను మా అమ్మతో, నువ్వా ముసలివ్యక్తిని చూశావా, అతను మాట్లాడటం విన్నావా అని అడిగాను. ఆమె నాతో కూడా నడుస్తున్నప్పటికీ, తను ఆ మనిషిని ఆ ప్రదేశంలో అసలు గమనించలేదని చెప్పింది.
మిగతా వారితో కూడా రెండవసారి నిర్థారణ చేసుకున్నాను వారు గాని చూశారేమోనని. యెవరూ కూడా చూడలేదని, మాట్లాడటం వినలేదని చెప్పారు.  మా అమ్మగారు అతను ఖచ్చితంగా సాయే అని నేను గ్రహించడానికే తెలుగులో మాట్లాడారని చెప్పారు. (మా మాతృభాష తెలుగు) హిందీలో కూడా “సుఖీభవ్” అని దీవించారు).
బాబాగారు నాకోరిక నెరవేర్చారు. బాబా మానవ శరీరంతో వచ్చి అద్భుతమైన లీలతో నన్ను దీవించారు. నాకింకా ఆశ్చర్యంగా ఉంది, నేను చూసినప్పుడు మిగతావారికి యెందుకు కనపడలేదా అని. అపాత్రురాలినైన నావంటి దాని కోరిక తీర్చడానికి, బాబా నాకోసం మాత్రమే కనిపించారు.
బాబా నాకు నీమీద ప్రేమ. నా తప్పులన్ని మన్నించు. . నీ అనురాగ వర్షాన్ని నామీదెప్పుడు కురిపించు.

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles