బాబా ఎవరితో ,ఎప్పుడు, ఎలా ఎందుకు ,చేయించుకుంటాడో చెప్పలేము



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై !!
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై !!

మా హాస్టల్ లోనే నేను ఉండే రూమ్ నుండి సింగల్ రూమ్ కి షిఫ్ట్ అయ్యాను.బాబా కి దీపాలు అంటే ఇష్టం కదా! ఇప్పుడు సింగల్ రూమ్ కి వచ్చాను కదా ! రూమ్ నిండా దీపాలు పెట్టాలి అనుకుంటున్నాను కానీ, బద్దకంతో కుదరట్లేదు.

రెండు రోజుల తరువాత మా ఫ్రెండ్ మారుతి షిరిడి కీ వెళ్లి ,ఇంకొక ఫ్రెండ్ లావణ్య కోసం,ద్వారకామాయి లో కూర్చొని ఉండే ఫోటోని తెచ్చింది.

మారుతి గుంటూరులో ఉంది.లావణ్య వేరే ఊరిలో ఉంది.ఎలా తనకి ఫోటో ని పంపాలో అర్ధం కాలేదు.వేరొక ఫ్రెండ్ ద్వారా ఆ ఫోటోని నాకు పంపించి,లావణ్య యూకే వెళ్ళేటప్పుడు హైదరాబాద్ కి వస్తుంది కదా అప్పుడు ఈ ఫోటో ని లావణ్యకి ఇవ్వు అని చెప్పింది.సరే అన్నాను.

ఒకరోజు ఫ్రెండ్, మారుతి తెచ్చిన ద్వారకామాయి ఫోటోని ఇచ్చారు,లావణ్యకి ఇవ్వుమని మారుతి చెప్పింది అని.నేను తీసుకుని కవర్ తీయకుండా రూమ్ లో పెట్టాను.మారుతి కాల్ చేసి ఫోటో చూసి ఎలా ఉందొ చెప్పు అని అడిగితె ఓపెన్ చేసి బాగుంది అని చెప్పాను.

మా గ్యాంగ్ లో అందరికి ద్వారకామాయి ఫోటో అంటే ఇష్టం.కానీ నా ఒక్కదానికే బండ మీద కూర్చున్న బాబా ఫోటో ఇష్టం.ఎందుకో కాలుమీద కాలు వేసుకుని కూర్చున్న ఫోటో నే ఎక్కువగా ఇష్టపడతా నేను.

ఓపెన్ చేసిన ఫోటోకి మళ్ళీ కవర్ సరిగ్గా సెట్ చేయడం రాక అలాగే మూలకి ఒక పక్కన పెట్టాను.నేను మధ్యాహ్నం నిద్రపోవడం చాల తక్కువ.కానీ ఆరోజు నిద్రపోయాను.

కలలో నా రూమ్ లో బాబా లైట్ యెల్లో కలర్ డ్రెస్ లో ద్వారకామాయి ఫొటోలో కూచుంటారు కదా అలాగే కూర్చుని కళ్ళు మూసుకున్నారు.తలపైన గ్రీన్ కలర్ లో ఏదో ఆకు,పింక్ కలర్ లో గులాబీ పువ్వు ఉంది.నేను బాబా బాబా కాలి మీద కుర్చున్నానో లేక, బాబా పక్కకి కుర్చున్నానో సరిగా గుర్తుకులేదు.

నేను చిన్న పిల్లలాగే ఉన్నాను.బాబా ని జోక్ గా ఏడిపిద్దామని బాబా తలా మీద ఉన్న ఆకుని పువ్వుని తీసి చేతిలో పట్టుకున్నా, బాబా కళ్ళుమూసుకునే, నా చేతి లోని ఆకుని, పువ్వుని తీసుకుని తలపై పెట్టుకున్నారు.నేను నవ్వుకుంటూ మళ్ళీ బాబా తలపైనుండి ఆకు,పువ్వు తీసుకుని బాబా మొహాన్ని నవ్వుకుంటూ చూస్తున్నాను.

బాబా మళ్ళీ అలాగే కళ్ళుమూసుకుని చిన్నగా నవ్వుకుంటూ నా చేతిలోవి తీసుకుని తలపై పెట్టుకుంటున్నారు.ఆలా 2 ,3 టైమ్స్ అల్లరిగా చేశాను.తరువాత లాస్ట్ కీ బాబా,చిన్న పిల్లల అల్లరి మనకు నచ్చినా కూడా, మనం అప్పుడప్పుడు ప్రేమగా విసుక్కుంటాం కదా. ఆలా నన్ను ఏయ్ , అని నా చేతిలోని ఆకు,పువ్వు ని తీసుకుని తలపై పెట్టుకున్నారు.

ఆమ్మో నేను ఏదో బాబా దగ్గర అల్లరి  చేస్తున్నాను,కానీ ఒకవేళ నా అల్లరికి బాబాకి కోపమొచ్చి కోప్పడితే,అసలు కోప్పడకున్నా,విసుక్కున్నా చాలు నేను ఎడుస్తాను.బాబా కీ నా మీద కోపం వస్తే నేను అస్సలు తట్టుకోలేను అనుకోని, అయినా బాబా చెప్పినట్టు వినకుండా చెడ్డ పనులు చేస్తే కోప్పడతారు కానీ, చిన్న పిల్లలు అల్లరి చేస్తే ఏమి అనరు.

ఒకవేళ మాట వినట్లేదని  బాబా కి నామీద ఇష్టం పోయి వేరేవాళ్లని ఇష్టపడితే ఎలా?అప్పుడు నేను ఏడుస్తా .నేను ఏడిస్తే ,బాబాకి నేనంటే ఇష్టం కదా ! సో మళ్ళీ బాబా నా దగ్గరికే వస్తారు.అయినా ఇప్పుడు  ఇక నేను అల్లరి చేయను.అని బుద్దిగా బాబా ముందు కూర్చున్నాను.

తరువాత నా రూమ్ కనిపిస్తుంది అందులో బాబావి ఇంకా యేవో ఫొటోస్ కనిపిస్తున్నాయి.అప్పుడు ఒక వాయిస్ ప్రమిదలు తెచ్చి రూమ్ నిండా దీపాలు వెలిగించు అని వినిపించింది.నేను ఆ వాయిస్ ఎక్కడినుండి వినిపిస్తుంది అని చూసా.మళ్ళీ అదే వాయిస్ మూలకి ఉన్న ఫోటోని ఇటు పక్కన సైడ్ కి పెడితే దీపాలన్నీ బాగా కనిపిస్తాయి అని వినిపించింది.తరువాత మెలుకువ వచ్చింది.చాల హ్యాపీ గా అనిపించింది.

ఆరోజు బుధవారం బాబా ఆలా కనిపించిన ఆనదంలోనో, ఎందుకో తెలియదు.ఆరోజుసాయంత్రం 5 .30 కె టెంపుల్ కి వెళ్ళడానికి రెడీ ఐ వెళ్తున్న.

వెళ్ళేటప్పుడు దారిలో అనుకున్న ఏంటి ఏ రోజు ఇంట ముందుగా వెళ్తున్నా జాబ్ కి వెళ్ళేటప్పుడు సాయంత్రం 7 .30 కి వెళ్లి బాబా ఫోటోని డెకరేట్ చేయడం నాకు అలవాటైంది.జాబ్ మానేసాక కూడా అదే టైం కి వెళ్తున్నా కదా మరి ఈ రోజేంటి కొత్తగా నాకు తెలియకుండానే నేను ఇంట తొందరగా టెంపుల్ కి వెళ్తున్నా.బాబా ఈరోజు ఎందుకు ఇలా తొందరగా వెళ్లేలా చేస్తున్నాడు.

అనుకుంటూ వెళ్లేసరికి బాబా ఫోటోని టెంపుల్ కి వచ్చే వేరే ఒక అబ్బాయి క్లీన్ చేయడానికి రెడీ అవుతున్నాడు.నాకు సడన్ గా అర్ధం కాలేదు.అఫ్ కోర్స్ బాబా కి ఎప్పుడు నేనే చేస్తున్న కాబట్టి అది నా డ్యూటీ అయిపోయింది.ఆలా అని ఎవరైనా చేస్తుంటే లేదు, నేనే చేస్తా అని అనడం తప్పు కదా,బాబా ఎవరితో ,ఎప్పుడు, ఎలా ఎందుకు ,చేయించుకుంటాడో చెప్పలేము.ఇప్పుడు తనతో చేయించుకోవాలనుకుంటున్నాడేమో అనుకుని కాం గా ఉండిపోయా.

నన్ను చూసి ఆ అబ్బాయి నువ్వు పెడతావా ప్రతిభ అని అడిగారు నేను వెంటనే ఆ అందుకోసమే వచ్చాను.మీరు క్లీన్ చేస్తున్నారు కదా అని ఊరుకున్నాను అని అంటే.నువ్వు రావు అనుకుని అక్క పెట్టమంటే పెడదాం అనుకున్నాను కానీ,నువ్వు వచ్చావు కదా నువ్వే చేయి ఇక అని వెళ్ళిపోయాడు.

ఒక రెండు నిముషాలు నేను లేట్ గా వచ్చినా తాను స్టార్ట్ చేసేవాడు.ఒకరు స్టార్ట్ చేసిన వర్క్ ని నేను మధ్యలో అస్సలు తీసుకోను.బాబా వర్క్ ఎవరు స్టార్ట్ చేస్తే వాళ్లే పూర్తిచేయాలని నేను అనుకుంటాను.సో ఇందుకే కావచ్చు 7 .30 కి వచ్చేదాన్ని.5 . 30 కే వచ్చేలా చేసాడు ఈ రోజు అనుకున్నాను.

బాబాకి నేను చేసిన డెకొరేషన్ తో ఒక పట్టాన సాటిస్ఫాయ్ అవను.ఇంకా మంచిగా బాబా ని డెకరేట్ చేస్తే బాగుండు అనే అనిపిస్తుంటుంది.ఇక వేరే వాళ్ళు పెట్టినవి ఇంకా అసలే నచ్చవు.వాళ్ళకంటే నేనే కొంచం బెటర్ అనిపిస్తుంది.

అందుకే బాబాని బాబా,మీరెప్పుడు ఈ ఫోటోకి నేను ఇక్కడ ఉన్నన్ని రోజులు నాతోనే డెకరేట్ చేయించుకోవాలి.అలా అని ప్రామిస్ చేయండి అని బాబా ఫోటో దగ్గర అడిగేదాన్ని అల్లరిగా.

బాబా నాకు డైరెక్ట్ గా ఆలా ఏం ప్రామిస్ చేయలేదు కానీ, అప్పటినుండి (ఒక్కసారి తప్ప) ఎప్పుడూ నా తోనే పెట్టించుకుంటున్నారు.నువ్వే పెట్టు అని నిదర్శనాలు ఇస్తూ మరీ.
సరే కలలో రూమ్ నిండా దీపాలు పెట్టుమని చెప్పారు కదా అని పెడదాం అనుకున్నాను.కానీ ఒక వారం రోజుల వరకు వీలు కాలేదు. నెక్స్ట్ గురువారం రూమ్ నిండా దీపాలు వెలిగించాను.

అప్పుడు అనుకోకుండా మారుతి ఇచ్చిన ఫోటో ని ఇటు పక్కన పెట్టుకుంటూ ఇక్కడ ఐతే ఈ ఫొటోలోని బాబా కి దీపాలన్నీ చక్కగా కనిపిస్తాయి అనుకున్నాను.వెంటనే గుర్తొచ్చింది బాబా కలలో ఇదేవిదంగా చెప్పారు కదా. అది నేను మర్చిపోయాను కానీ, అచ్చు కలలో చెప్పినట్టే తెలియకుండా బలేగా అనుకుని పెట్టనే అని. నేను ఇలా అనుకుంటాను అనే ,ముందే బాబా ఆలా చెప్పారు అనుకున్నాను.

తరువాత లావణ్య వచ్చి ఆ ఫోటో తీసుకెళ్లింది.నా దగ్గరికి వచ్చే ముందు నీతో దీపాలు పెట్టించుకుని రావాలనుకున్నాడేమో డాడీ అని హ్యాపీ గా ఫీల్ అయింది.(మా గ్యాంగ్ లో నేను తప్ప, అందరు బాబా ని డాడీ అనే పిలుస్తారు.)

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “బాబా ఎవరితో ,ఎప్పుడు, ఎలా ఎందుకు ,చేయించుకుంటాడో చెప్పలేము

Sai Suresh

అత్యద్భుతంగా ఉంది ఈ అనుభవం. మీరు చాలా అదృష్టవంతులు సాయి, బాబా ప్రేమను చాలా బాగా పొందుతున్నారు. ఈ లీలని చదువుతుంటే మనసుకు ఏంతో హాయ్ గా ఉంది. బాబా తో మీరు చిన్న పిల్లలా ఆటలడుతుంటే నాకు కూడా అదే అనుభూతే కలుగుతుంది సాయి. మీకు, మీ ద్వారా మాకు ఈ లీలలు అందిస్తున్న సద్గురు సాయి నాదునికి నా ధన్యవాదాలు .

Prathibha sainathuni

Thank u suresh garu..baba daggara manam eppudu chinna pillalame kada☺

Prathibha sainathuni

Meto ila share chesukune chance ichhinanduku nenu kuda babaki danyavadalu cheppukuntunnanu…

kishore Babu

కరెక్ట్ సాయి…బాబా వారు ఎవరితో ఎలా ఎప్పుడు చేయించుకొంటారో చెప్పలేము. కానీ అయన లీలాలు వర్ణనాతీతము. మీరు బాబా బుక్ రాస్తే చాల ఆనందపడే భక్తులలో నేను ముందు ఉంటాను సాయి.

Prathibha sainathuni

Thank u kishore garu…will c..babaki istamaite ayana rayinchukuntaru..

Prathibha sainathuni

Tnq kishore garu..will c..baba ki istam aite ayane rainchukuntaru..i will try my lvl bst…

సాయినాథుని ప్రణతి

So nice dream. I am always thought that I am a little kid in baba’s hands. I am so happy for ur fantastic dream. I really feel that ur so lucky prathiba garu

సాయినాథుని ప్రణతి

నిజంగా I am so happy for this experience.so much of thanks to u .to share this experience with us

Prathibha sainathuni

Tnq..pranati garu..meku kuda chala experience unnayi anipistundi me comments chustunte,, if u dont mind. avi mato share chesukovalani meku anipiste, mevi kuda vinalanipistundi

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles