బాబా నామస్మరణ ఎన్నో ఆపదల నుండి కాపాడే రక్షక కవచం …!



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


మా ఇంట్లో ఏడాదికి ఒకసారి నామం జరుగుతూ ఉంటుంది కదా ఆ సమయంలో మేమూ నామం చెబుతూనే ఉంటాం, కానీ ఎక్కువగా నామం చెప్పటానికి వేరే వాళ్ళని పిలుస్తుంటాం.

ఆయన పేరు లవకుమార్. ఆయన, ఆయన బృందం తోటి డోలక్, హార్మోనియం వాయించుకుంటూ, ఒళ్ళు పులకరిచేటట్టుగా చాలా బాగా నామం చెబుతారు.

ఒక ఏడాది ఆయనకీ కబురు చేస్తే సరే వస్తాను అన్నారు. ఎప్పటిలాగానే మేమూ ఏర్పాట్లన్నీ చేస్తుకున్నాక మాకు ఫోన్ చేసి అమ్మా ! నాకు షుగర్ వచ్చింది అసలు ఓపిక లేదు, నేను చేయలేనేమో అమ్మా! అన్నారు.

నేను అయ్యో! అలాగంటే ఎలాగా ఇప్పటికిప్పుడు ఎవరు నామం చెప్పటానికి దొరుకుతారు కష్టం కదా, అందుకని మీరు ఎక్కువగా కష్టపడద్దు నామం మొదలు పెట్టండి మిగతాదంతా మేము చూసుకుంటాం అని చెప్పాము.

సరే అని నా మాట కాదనలేక చాలా ఏళ్లుగా పరిచయం ఉండబట్టి కాదనక పాపం ఒప్పుకుని పడుతూ లేస్తూ వచ్చాడు. ఆయన గొంతుకి కూడా ఇన్ ఫెక్షన్  వచ్చింది. బాగా నీరసంగా ఉన్నాడు.

ఎలాగో ఉదయం నామం మొదలుపెట్టాడు. ఒక గంట తర్వాత నీరసంగా ఉందని పడుకుంటానన్నాడు. ఆయన వాలకం చూసాక నాకు చాలా బాధ వేసింది. నేను బాబా ముందు కూర్చొని బాబాని వేడుకున్నాను.

”బాబా! ఆయన చాలా మంచివాడు, నీ నామాన్ని చాలా బాగా చెబుతారు. నీ నామం తోనే ఆయనకి జీవనాధారం కూడా, ఆ కుటుంబానికి ఆయన లేకపోతే చాలా కష్టం ఆయన చూస్తే చాలా బాధ పడుతున్నారు. ఆయనకీ ఆరోగ్యం ఇవ్వు బాబా” అని వేడుకున్నాను.

మా బెడ్ రూమ్ లో ఆయన్ని పడుకోమన్నాను. మా వారు ఆఫీస్ కి వెళ్ళారు.

వేరే రూమ్ లో అత్తగారు పడుకున్నారు. ఈ లోపు మా వారు ఆఫీస్ నుండి తిరిగి వచ్చి ఆయన మంచం మీద లవకుమార్ పడుకొని ఉండటాన చిందులు తొక్కాడు.

“ఆయన మేడ పైన పడుకోకుండా నా మంచం మీద ఎందుకు పడుకున్నాడు అన్నారు.

”మీరు లేరుగా ఆయనకు పాపం నీరసంగా ఉంది మెట్లు ఎక్కలేను ఆంటే నేనే పడుకోమన్నాను అన్నాను. అయినా గానీ గునుస్తూనే ఉన్నాడు, ఇంతెత్తున ఎగురుతున్నాడు.

ఈ లోపు లవకుమార్ గారిని నేను లేపే ప్రయత్నం చేస్తున్నాను. అవతల రూమ్ లో మా అత్తగారు మా అమ్మ వచ్చిందని, అమ్మని పలకరించాలని అత్తగారు లేచి అక్కడ నుండి వెళ్లిపోయారు.

మా వారు ఏమనుకున్నారో వాళ్ళమ్మ ఖాళీ చేసిన మంచం మీద వెళ్లి పడుకున్నాను.

నేను నెమ్మదిగా లవకుమార్ గారిని లేపించి మేడ మీదకి వాళ్ళ కోసం కేటాయించిన రూమ్ కి వెళ్ళమని పంపించి వేసాను.

ఇంతలో మా బెడ్ రూమ్ లో తిరుగుతున్న ఫ్యాన్ తిరుగుతూనే కింద పడిపోయింది.

దైవ వశాన అక్కడ ఆ సమయంలో ఇంట్లో అంతమంది జనం ఉన్నా ఆ రూమ్ లో ఎవరూ లేరు.

అప్పటిదాకా అక్కడే పడుకున్న లవకుమార్ గారు అక్కడే ఉండి ఉంటే, అయన మీద పడి ఉండేది ఫ్యాన్ లేదా మా ఆయన అయినా అక్కడ పడుకుని ఉంటే ఆయన మీద పడేది.

బాబా దయ వల్ల ఆయన కూడా అక్కడ లేరు. ఎంత పెద్ద గండం! బాబా దయవల్ల అందరికీ తప్పిపోయింది.

The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles