బాబా భోదామృతం (భక్తలీలామృతం చాప్టర్ 32) మూడవ భాగం….



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

నిన్నటి తరువాయి భాగం….

కొంతమంది శ్రీమంతుల గృహాలలోని కుక్కలు పరుపులపైన పవళిస్తాయి. కాని ఊరి కుక్కలు రొట్టి ముక్కల కోసం సంధులు గొందులు తిరుగుతుంటాయి. కొన్ని గోవులకు మంచి దాన, గడ్డి, కుడితి, తెలగపిండి అవీ ఎన్నో రకాల తిండి లభిస్తే మరి కొన్ని అవులకు గడ్డి పోచైనా దొరకక పెంట కుప్పలలో ఆహారాన్ని వేడుక్కుంటాయి. ఈ ఎక్కువ తక్కువలకు కారణం ఒక శరీర ప్రారబ్దమే. ప్రారబ్ధ కర్మనంతా అనుభవిస్తే తప్ప, త్రికాలలోనైనా ముక్తి లేదు. అదే ప్రపంచ ధర్మం. అదే పరమేశ్వరుని న్యాయం.

అకారణంగానే ఒకడు పెదవాడైతే, మరొకడు శ్రీమంతుడౌతాడు. ఒకడు అన్నీ ఉన్న భాగ్యవంతుడౌతే మరొకడు ఏ దిక్కులేని నిర్భాగ్యుడై భిక్షమెత్తుకుంటాడు. ఒకడు బంగాళాలలో భవనాలలో గుఱ్ఱపు బళ్ళలో విహరిస్తుంటే మరొకడు కటిక నేలపై దిగంబరంగా నిద్రిస్తాడు. కొందరికి బిడ్డ్లుంటారు. కొందరికి బిడ్డలు పుట్టి చచ్చిపోతారు. కొందరు స్త్రీలు గోడ్రాళ్ళుగానే ఉంటారు. కొందరు సంతానం కోసం తపించిపోతుంటారు” అని సాయి సమర్ధులు చెప్పగా

నానా చేతులు జోడించుకుని “బాబా! అసలు ఈ సుఖదుఃఖాలు ఎందుకు కల్గుతాయి? సుఖం కల్గితే ఆనందం కలగటం, దుఖం కల్గేతే హృదయం బ్రద్దలవటం. అనుక్షణం ఇవేగా ఈ ప్రపంచంలో. ఈ సుఖదుఖాలకు గని వలె మూలకారణమైన ఈ ప్రపంచాన్ని ముందు త్యజిస్తే, ఎప్పుడూ ఏ బాధలుండేవి ఉండవు కదా!” అని అన్నారు.

అప్పుడు బాబా “అరె నానా! ఈ సుఖదుఃఖాలు కేవలం భ్రమ భ్రాంతి. అంతేగాని ప్రపంచంలోని సుఖాలన్నీ సత్యమైనవి కావు. అయినా అజ్ఞానం వలన మాయ వలన జనులు వానిని సత్యాలని భ్రమపడుతున్నారు. ఈ శరీర ప్రారబ్ధం వల్లనే ఒకరికి తినటానికి పంచామృతాలుంటే, మరొకరికి ఎండిపోయిన రొట్టె ముక్కలు. రొట్టె ముక్కలు తినేవాడు. దుఃఖపడతాడు. పంచామృతాన్ని సేవించేవాడు నాకేం తక్కువ లేదని అనుకుంటాడు.

మధురమైన పక్వాన్నాలు తిన్నా లేక ఎండు రొట్టె ముక్కలు తిన్నా ఈ రెంటి యొక్క ప్రయోజనం అధిష్ఠాన దేవత జఠరాగ్నికి తృప్తి కలగటం. అంటే ఆకలి తీరటమన్నమాట. కొందరు జరీ శాలువలు నానా రకాల బట్టలతో తమ శరీరాన్ని అలంకరించుకుంటే కొందరు పాత చింకి బట్టలను కట్టుకుంటారు. శాలువలైనా చింకి గుద్దలైనా వాని ప్రయోజనం శరీరాన్ని కప్పుకుని రక్షించుకోవటానికే. అంతకు మించి ఏముంది?

ఇది సుఖం, ఇది దుఖం అని ఈ సుఖదుఖాల ఉపయోగం కేవలం అనుకోవడంలోనే ఉంది. ఈ అనుకోవటమనే భ్రాంతి మానవుల యొక్క అజ్ఞానం వలన. మనసులో ఈ సుఖదుఖాల తరంగాలు లేచినప్పుడు అవన్నీ వట్టి భ్రాంతియని తెలుసుకుని వాని మోహంలో పడకండి. అసలు అలలంటూ లేవటానికి వానికి మూల కారణమైన ఒక వస్తువుండాలి కదా దీపం లేకుండా ప్రకాశముంటుందా? జలాలు లేకుండా అలలేట్లా ఉంటాయి?

అట్లే సుఖదుఃఖాల తరంగాలు లేవటానికి మూల కారణం, కామక్రోధలోభమోహది ఆరు వికారాలు. ఇవే మనసులో అలలను సృష్టించేవి. అవే అసత్యాన్ని సత్యంగా భాసింప చేస్తాయి. ధనికుని చేతికున్న సువర్ణ కంకణాన్ని చూచి దరిద్రుడు మంది పడి పోతాడు. దీనివల్ల అతని మనసులో మత్సరమనే తరంగం లేస్తుంది. అది నాక్కూడా ఉండాలి అని మనసులో అనిపించటం వలన లేచే తరంగానికి కారణం లోభం.

అలాగే అన్ని రకాల తరంగాలు. అందువల్ల ముందు ఈ అరిషడ్ పర్గాలను జయించాలి. ఇవి సమూలంగా నశించిపోతే వాని తరంగాలు లేవవు. ఈ ఆరు శత్రువులు శక్తిని నిశ్శేషంగా నిర్మూలం చేయలేకపోతే మనం వానికి బానిసలైపోతాం. అలా కాకుండా వానిని మన బానిసలుగా చేసుకొని, వానిపై సద్విచార శక్తి యనే జ్ఞానాన్ని అధికారిగా నియమించాలి. అప్పుడు నీకు అసత్యమైన ఈ సుఖ దుఃఖ బాధలుండవు. ఇక నిజమైన సుఖదుఖాల గురించి చెప్తాను విను. నిజమైన సుఖం ముక్తి. జననమరణాల భ్రమణం దుఖం. ఈ రెంటి పైన మాయా భ్రమ సుఖదుఖాల భాస మాత్రమే.

ఇంకా ఉంది….

source: దాసగణు గారి రచన భక్తలీలామృతం చాప్టర్ 32

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles