Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
ఒకసారి నానాసాహేబ్ చందోర్కర్, నానాసాహెబ్ నిమోంకర్ సాయిబాబా దర్శనానికి షిర్డీ వచ్చారు. నానాసాహేబ్ సాయినాధుని పాదాలపై మస్తకాన్నుంచి “సాయి సమర్దా! శాస్త్రాలన్నీ ఈ ప్రపంచం నిస్సారమని ఘోషిస్తున్నాయి. ఇలాంటి ప్రపంచం నాకింకా వద్దు. దీన బంధూ! ప్రపంచ రూపంలో ఉన్న ఈ శృంఖాలా బంధనాన్ని సత్వరంగా తొలగించండి.
సుఖాలు కావాలని కోరుకుంటే దుఃఖాలు వెంటపడుతుంటాయి. ఈ ప్రపంచంలో యెంత వెదికినా నిజంగా లవలేశమైనా సుఖం లేదు. దీనియందు నాకు విరక్తి జనించింది. దీంతో నాకింక సంబధం లేదు” అని అన్నారు.
అతని మాటలు విని బాబా నవ్వుతూ “భలే ఇటువంటి చక్కటి ఆలోచనలు నీకెలా కలిగాయి? నీ మాట నిజమే, కాని మన ఈ శరీరాలున్నంతవరకు ఈ ప్రపంచం మన వెన్నంటే ఉంటుంది. అది ఎవరిని విడిచి పెట్టదు. నన్ను మాత్రం విడిచిందా! నేను కూడా దానిలో చిక్కుకుని పోయాను. అటువంటప్పుడు నువ్వు దాన్నెలా విడిపించుకోగలవు? ఈ ప్రపంచానికి అనేక రూపాలు.
కామ క్రోధ లోభ మోహ మద మత్సరాల పరస్పర సంబంధమే ఈ ప్రపంచం. కళ్ళు వస్తువులను చూస్తాయి. చెవులు శబ్దాలను గ్రహిస్తాయి. జిహ్వ రసాన్ని గ్రహిస్తుంది. ఇదే మరి ప్రపంచం. మనసుతో ఆలోచించేదంతా ప్రపంచమే. రెండు వస్తువుల కలయికయే ఈ ప్రపంచం యొక్క స్వరూపం. ఎవ్వరైనా సరే దీని బంధం నుండి విడిపోలేరు.
భార్య పుత్రులు పుత్రికలూ మొదలగు వారున్న సంసారమే ప్రపంచం. ఇదంతా వినటానికి నీకు విసుగ్గా ఉంది కదూ! అయినా తప్పదు విను. భార్య పుత్రులు పుత్రికలు బంధువులు మొదలగు స్వజులను వారి వల్ల కలిగే బాధలను విడిచి అరణ్యానికి పారిపొయినా సరే అక్కడ కూడా ఈ ప్రపంచం నిన్ను వదిలి పెట్టదు” అని బాబా చెప్పగా నానా “ఈ ప్రపంచంలో అనేక రకాల దుఃఖాలున్నాయి. పరమేశ్వరునిచే నిర్మింపబడ్డ ఈ ప్రపంచంలో ఎవ్వరిదీ సాగదు. ఎలాంటి ఉపాయాలు పనికి రావు. అందువల్ల నాకీ ప్రపంచం వద్దు” అని చెప్పారు.
అప్పుడు బాబా “నీకి ప్రపంచాన్ని భగవంతుడు అంట కట్టలేదు. నీ స్వబుద్ధితో నువ్వే సృస్టించుకున్నావు. కదా! ఇప్పుడు అసహ్యించుకుంటే ఏం ప్రయోజనం? పూర్వ జన్మల యొక్క సంచిత కర్మ మరియు క్రియమాణ కర్మల నుండి ప్రారబ్ధ కర్మ ప్రాప్తిస్తుంది. ఈ ప్రారబ్ధ కర్మ ఫలాన్ని అనుభవించటానికే ప్రాణులకు ఈ జన్మ, ఈ శరీరం. ఎవరైనా సరే ప్రారబ్ధ కర్మను అనుభవించకుండా వదిలించుకోలేరు.
పేదవారు, మాద్యమ వర్గం వారు, శ్రీమంతులు, ప్రాపంచిక బ్రహ్మచారులు, వానప్రస్థ ఆశ్రమంలోని వారు, సన్యాసులు, నీచులు, గొప్పవారు, ఎద్దు, దున్నపోతు, గుఱ్ఱం, వ్యాఘ్రం, ఖడ్గ మృగం, కాకి, గ్రద్ద, నెమలి, కుక్క, పిల్లి, పంది, పాము, తేళ్ళు, చీమలు ఈ అన్ని ప్రాణులు అస్తిత్వానికి కారణం ప్రాణం. ఈ ప్రాణం అన్నింటిలోనూ ఒకే విధంగా ఉంది కదా! మరి ప్రపంచంలో ప్రాణుల బాహ్య స్వరూపాలు ఎందుకు భిన్న భిన్నంగా ఉన్నాయి?
నువ్వీ విషయాన్ని ఎప్పుడైనా ఆలోచించావా? బాగా ఆలోచిస్తే సంచిత క్రియమాణ కర్మల కారణంగానే ప్రాణులు అనేక రూపాలలో జన్మిస్తాయని తెలుస్తుంది. ఏ వర్గం ప్రాణికి ఆ జాతి లక్షణాలే ఉంటాయి. వ్యాఘ్రం మాంసాన్ని భక్షిస్తుంది. పంది ఆశుద్దాన్ని తింటుంది. గ్రద్ద పాతేసిన శవాలను పెళ్లగించుకొని పీక్కొని తింటుంది.
ఇలా వానివాని శరీర సంపర్క స్వభావముతో, కోమలమైన కమల పత్రాలను రాజహంసలు సేవిస్తే, కాకులు కుళ్ళును భక్షిస్తాయి. ప్రాణులు ఏ ఏ యోనిలో జన్మిస్తే ఆయా జన్మలకనుగుణంగానే వాని శరీరాలు పనులూ ఉంటాయి. ఆయా శరీరాలలోనే వాని వాని ప్రారబ్దాలను అనుభవిస్తాయి. ఇది ఈ ప్రపంచ రీతి.
ఇంకా ఉంది…
source: దాసగణు గారి రచన భక్తలీలామృతం చాప్టర్ 32
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- బాబా భోదామృతం (భక్తలీలామృతం చాప్టర్ 32) నాల్గవ భాగం….
- బాబా భోదామృతం (భక్తలీలామృతం చాప్టర్ 32) మూడవ భాగం….
- బాబా భోదామృతం (భక్తలీలామృతం చాప్టర్ 32) ఐదవ భాగం….
- బాబా భోదామృతం (భక్తలీలామృతం చాప్టర్ 33) తొమ్మిదవ భాగం….
- బాబా భోదామృతం (భక్తలీలామృతం చాప్టర్ 33) అరవ భాగం….
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments