Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
కొండ్యా (కొండా సంతారా) అనే పేరుతో భావికుడైన ఒక పరమ భక్తుడుండేవాడు. అతని పట్ల బాబాకు ప్రత్యేకమైన ప్రేమ. ఒకసారి బాబా అతనితో “నువ్వు వెంటనే పొలం వద్దకు వెళ్ళు. అక్కడ పంటకుప్పకు అగ్గి అంటుకుంది దాన్ని అర్పివేసిరా” అని చెప్పారు.
కొండ్యా గాబరాపడుతూ పొలం వద్దకు పరుగెత్తుకుని వెళ్ళాడు. అక్కడ పంటకుప్పులు జాగ్రత్తగా ఉండటం చూచి వెనక్కు తిరిగి వచ్చేశాడు. “బాబా! ఊరికెనే ఏదో చెప్పి ఈ మిట్ట మధ్యాహ్నపు ఎండ వేళలో నన్నింత తిప్పలు పెట్టావు. నా కాళ్ళు కాలిపోయాయి” అంటూ విసుక్కున్నాడు.
బాబా మరల అతనితో “నువ్వసలు సరిగ్గా చుచావా? నేనాసత్యం పలకటం లేదు. నా మాట విను. నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళు. అదిగో పొగ బయలుదేరింది చూడు!” అని గట్టిగ చెప్పారు. నిజమే. కోసి కుప్పేసి ఉంచిన పంటకు అకస్మాత్తుగా నిప్పు రాజుకుంది.
కళ్లంలో పంట తగలబడి పోతుందని గ్రామ ప్రజలు గోల పెట్టసాగారు. ఎండాకాలం మంచి మధ్యాహ్న సమయం ప్రళయ ఝం ఝా మారుతం వాలే గాలి జోరుగా వీస్తోంది. పెళ పెళామని చెట్లు విరిగి పడుతున్నాయి. ఇంటి కప్పులు ఆకాశాన్ని అందుకోవాలనుకుంటున్నాయి. ఇక సుడిగాలి సంగతి వర్ణించ శక్యం కాదు. దుర్భరమైన దుర్ఘటన సంభవించింది. ప్రజలు భయపడి పోయారు.
సాయిబాబా వద్దకు వచ్చి గట్టిగా వారి పాదాలను పట్టుకుని “బాబా! దయామయా! పంటకు నిప్పు అంటుకుంది. ఇప్పుడు మాగతెం కావాలి? దేవా! పంట మా ప్రాణం. పంట మా జీవనం. అదంతా కాలి బూడిద అయిపోతే మరి మాకు ఆహారం ఎక్కడుంటుంది? తినటానికి తిండి లేక పిల్లా పెద్దా అంటా అన్నం అంటూ అన్నానికి అలమటించి చచ్చిపోతారు. మేత లేక పశువులు ప్రాణాలు కూడా పోతాయి. అందుచేత వెంటనే పంటను రక్షించుకొనే మార్గం చెప్పండి. మీరు భూత, భావిష్యాలను ఎరిగిన వారు. మీరు సాక్షాత్తు శ్రీహరి” అని అతి దీనంగా మొరపెట్టుకున్నారు.
భక్తవత్సలుడైన బాబా వారి మనవిని విని అగ్గిని ఆర్పటానికి త్వర త్వరగా పంట కళ్ళం వద్దకు వెళ్లారు. అంటుకుంటున్న పంట కుప్పను బాగా అవలోకించి ఆకుప్ప చుట్టూ నీళ్ళు చల్లారు. “ఇదంతా అగ్ని దేవుని భాగం. దేన్నెవరూ అర్పివేయకండి. ఇది ఇంత వరకే కాలిపోతుంది. ఇక ప్రక్క పంటకుప్పలు అంటుకోవు” అని చెప్పారు.
అలాగే జరిగింది. ప్రజలంతా సంతోషపడ్డారు. సాయినాధుని మహాత్మ్యం అగ్నిదేవుని శక్తిని జయించారు. పంచభూతాలు సత్పురుషుల ఆజ్ఞను జవదాటవు. అవి సచ్చిదానంద పరమాత్ముని సేవకు తిష్ఠ వేసుకుని కూచుంటాయి.
ఆరోజు సాయంకాలం భక్త మండలి బాబా దర్శనానికి వచ్చారు. నగరు కలెక్టర్ సెక్రటరి నానాసాహేబ్ చందోర్కర్ కూడా వచ్చారు. సాయి మహారాజు అతనితో “నానా! చూశావా లోకులెంత స్వార్ధపరులో. ఈరోజు భాగ్ చంద్ సేట్ పంట కాలిపోయింది. ఆ నష్టం నుండి కాపాడమని వీరు నన్ను కష్ట పెడుతున్నారు. లాభనష్టాలు, జననమరణాలు పరమేశ్వరుని అధీనంలో ఉంటాయి. దీనిని తెలుసుకోక అంధులైన జనులు ఆ భగవంతుని మర్చిపోతున్నారు. లాభాలు కలిగినప్పుడు ఆనందిస్తారు కదా! మరీ నష్టం కలిగినప్పుడు ఏడవటమెందుకు?
నాది నాది అని అందరూ అంటుంటారు కదా! నాదంటే అర్ధం ఏమిటి? పంట అసలు ఆ మార్వాడికి ఎక్కడి నుండి వచ్చింది? విత్తనాలు నాటి కష్టపడి పండించిన వారిది పంట. నిజమే కాని విత్తనాలను భూదేవి తన గర్భంలో నిక్షిప్తం చేసి ఉంచింది. వరుణుడు వానిపై వర్షధారలను కురిపించి వానిని మొలకేత్తించారు. సూర్యుడు తన అమృత కిరణాలను వానిపై ప్రసరింప చేయగా మొలకలు పెద్దవై పంట ఆకారాన్ని దాల్చాయి.
ఈవిధంగా పృథ్వి, వరుణుడు, సూర్యుడు. ఈ ముగ్గురూ ఆ పంట యజమానులు కాగా మనం మాది మాదని అనటం వ్యర్ధ ప్రేలాపన కాదూ! సూర్యుని తాపమధికమై అగ్ని పంటను తన పొట్టన పేట్టుకుంది. ఆ అగ్ని తాపాన్ని తట్టుకోలేక భూదేవి భగ్గున మండిపోయింది. పారుభోతు మేఘుడు అసలు పత్తాలేకుండా ఎటు పారిపోయాడో? ఆ అహంకారి చంచలమైన సౌధామినితో రామిస్తున్నాడులా ఉంది. అందువల్ల అతడు ఏం చేయలేక ఊరుకుండి పోయాడు.
మూఢమతులైన స్త్రీలంపటులు తమ లాభనష్టాల నేరుగరు. సూర్యుడు పంట తనదని దావా వేసి, భూమి వద్ద నుండి బలవంతంగా పంటను పట్టుకుని పోయాడు. ఈ జగత్తులోని వస్తువులకు వాని ఉత్పత్తికి మన మెప్పుడూ యజమానులం కాము. అందుచేత వీరికి సరిగ్గా అర్ధమయ్యేలా నువ్వైనా చెప్పు, అనవసరంగా అప్పటినుండి దుఃఖపడుతున్నారు. నన్ను కూడా కష్ట పెడుతున్నారు.
పరమేశ్వరుడు ఒక చేత్తో ఇస్తే మరో చేత్తో వెంటనే లాగేసుకుంటాడు. ఇది తెలియక అజ్ఞానం వల్ల సుఖదుఃఖాలకు కారణం తామేయని జీవులు అనుకుంటారు. సేట్ జీ! నువ్వింక సుఖంగా ఇంటికి వెళ్ళు. నీకు వేరే వ్యాపారంలో నిశ్చయంగా లాభం కల్గుతుంది. ఈ నష్టం అప్పుడు పూడుకుని పోతుందని” చెప్పారు. ఈవిధంగా బాబా భోదామృతాన్ని కురిపించగా అందరు ఆనందించారు.
నానా గద్గద హృదయంతో సాయినాధుని పాదాలకు వందనం చేసి “ఓ భక్త చకోర పూర్ణచంద్రా! అపరోక్ష జ్ఞానముద్రా! మా అజ్ఞానాన్ని నిరసనం చేసే జ్ఞానముద్రను ప్రసాదించండి. పరమాత్ముడంటే అసలు ఎవరు? ఎక్కడుంటాడు? ఎట్లా ఉంటాడు? ఎట్లా లభిస్తాడు? మాకీ విషయాలు తెలియజేయండి. ఈ జగత్తు మాయ, నశ్వరమని, అశాశ్వతమని అంటారు కదా! మరి అలాంటప్పుడు ఏ వ్యాపారమైన ఎందుకు చెయ్యాలి? నాకీ మర్మాన్ని విప్పి చెప్పండి ప్రభూ!” అని వేడుకున్నాడు. సాయిబాబా నానాతో నీకివన్నీ మరో రోజు తెలియ చేస్తానని సమాధాన మిచ్చారు.
source: దాసగణు గారి రచన భక్తలీలామృతం చాప్టర్ 31
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- బాబా భోదామృతం (భక్తలీలామృతం చాప్టర్ 32) రెండవ భాగం….
- బాబా భోదామృతం (భక్తలీలామృతం చాప్టర్ 33) తొమ్మిదవ భాగం….
- బాబా భోదామృతం (భక్తలీలామృతం చాప్టర్ 33) అరవ భాగం….
- బాబా భోదామృతం (భక్తలీలామృతం చాప్టర్ 32) మూడవ భాగం….
- బాబా భోదామృతం (భక్తలీలామృతం చాప్టర్ 32) ఐదవ భాగం….
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments