Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
నిన్నటి తరువాయి భాగం….
పుత్రులు పుత్రికలు, దాసదాసీలు శరీర ప్రారబ్దానుసారం ప్రాప్తిస్తారు. వారిని దయగా ప్రేమగా చూడాలి. భార్య పుతులు, పుత్రికలు స్వజనులు వీరంతా నావారు నావారని మనసులో వారిపై అభిమానాన్ని పొంచుకోవటమే జననమరణాల భ్రమణానికి కారణం. ఈ శరీర ప్రారబ్ధ కర్మంతా ఇక్కడే ముగిసిపోతుంది. అంతిమ సమయంలో వెంట తీసుకుని వెళ్లటానికి లవలేశమైన మిగలదు.
అందువల్ల ఈ బంధు జన వర్గమంతా ఈ జన్మలోనే కాని మరల పునర్జన్మలో ఉండరు. ఏ జన్మలోని బంధువులు ఆయా జన్మతోనే విడిపోతారు. కాని ఆ జన్మ సంస్కారాలు మాత్రం వెంటే ఉంటాయి. ఈ కోరికల వాసనలే పునర్జన్మ బంధనానికి కారణం. అందువల్ల నావారు నావారని బంధువుల ఎడ మాయమోహాలను పెంచుకోకూడదు. అప్పుడే అక్షయ సుఖాన్ని, మానవ జన్మ లాభాన్ని పొందగలరు.
మనం ధర్మ సత్రంలో కొంత సమయమే ఉన్నా అక్కడ అన్ని సదుపాయాలు చూచుకుంటాం. కాని ఆ ధర్మ సత్రంపై మనకేటుపంటి మొహ మమకారాలుండవు. అదేవిధంగా ఈ ప్రపంచం కూడా ఒక ధర్మాశాల వంటిదేయని తెలుసుకుని తమ తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ సచ్చిదానండుడైన పరమాత్మను తెలుసుకోవాలి.
మన బిద్దడైనా, ఇతరుల పుత్ర్రుడైనా, వారి బరువు బాధ్యతలు నిజంగా భగవంతునివే కాని, అజ్ఞానం వల్ల అనవసరంగా మన బిడ్డడని తలచి వాని బాధ్యతాభారాన్ని మన నెత్తిన వేసుకుంటున్నాం. పుత్రునికి, ఉత్తమ శిక్షణ నిచ్చి పెంచి అతని కొరకు కొంత ధనముంచాలి కాని నాపుత్రుని నేనే పెంచాను, నేనే చదివించా, వానికి ఆస్తిపాస్తులు నేనే ఇచ్చానని తలంచకూడదు.
మీ కర్తవ్యాన్ని మీరు చేస్తూ కర్తృత్వాన్ని ఈశ్వరునికి ఇవ్వండి. కర్మ ఫలాన్ని ఆశించకుండా దానిని భగవంతునికే సమర్పించండి. మాది మాదని తలచి దేనినీ మీరు అంటించుకోకండి. అలిప్తులుగా ఉండండి. జ్ఞానాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటూ మంచి చెడును తెలుసుకుని మంచిని గ్రహించి చెడును విడిచి పెట్టేయాలి. ఉత్తమ కార్యాన్ని చేపట్టి దానిని చివర వరకు సాధించాలి. అదే చనిపోయిన తర్వాత కీర్తి రూపంలో మిగులుతుంది.
ఏ కార్యాన్నైనా శ్రద్ధతో చేయాలి అదే పురుషార్ధం. కార్యాన్ని చేసేటప్పుడు అభిమానంతో చేయాలి కాని ఆ కార్యం సఫలీకృతమైనప్పుడు అదంతా తన ప్రభావమన్న అహంబావం లేకుండా దీనులై ఉండాలి. జీవితం ఉన్నంత వరకు దాని అలన పాలనా అనివార్యమే. కాని మరణం సభావించినప్పుడు వ్యర్ధంగా శోకించకండి. మరణానికి మూర్ఖులు మాత్రమే శోకిస్తారు. కాని బుద్ధిమంతులు శోకించారు. చావుకు శోకించవలసిన అగత్యమసలు లేదు.
కనుక పంచభూతాల నుండి అప్పుగా తెచ్చుకున్న వానిని మరల వారివి వారికీ యిచ్చేయవలసిందే కదా. వాయువు వాయువులో కలిసిపోతుంది. అగ్ని అగ్నిలో, అట్లే నీరు నీటిలో కలసిపోతుంది. పృథ్వి యొక్క శరీర భాగం కళ్ళకు కనిపిస్తుంది అంతే. ఇలా పంచభూతాలు వెళ్ళిపోతాయి. అందువల్ల శరీరం కనిపించక పోయినా దుఃఖపడవలసిన విషయం కాదు.
బిడ్డ జన్మించగానే మనసులో ఆనందించకండి. అది సృష్టి వ్యవహారమని తెలుసుకొని నిశ్చింతగా ఉండండి. పృథ్వి విత్తనాలను తన గర్భంలో ధరిస్తుంది. వానిపై మేఘుడు వర్షాన్ని కురిపిస్తాడు. సూర్యుడు తన వేడి కిరణాలను ప్రసరింప చేయగా విత్తనాలు మొలకలెత్తుతాయి. అప్పుడు పృధ్వి, సూర్యుడు, మేఘుడు ఆనందంతో నృత్యం చేస్తారా?
మొలకలు పెద్ద వృక్షాలై పెరగానీ లేదా అవి ఆరోజే నశించిపోనీ. వాని గురించి సంతోషిస్తారా? లేక శోకిస్తారా? మనం కూడా అట్లే ఉంటే దుఃఖం శోకం ఎక్కడి నుండి వస్తాయి? ఈ దుఃఖాలు శోకాలు లేకపోవటమే ముక్తస్థితి. దీన్ని గురించి మరోసారి చెప్పుతాను. నువ్వు మాత్రం నీ పనులలో అప్రమత్తతో ఉండు.” అని బాబా భోధ చేశారు.
సాయి సమర్ధుని దివ్యవాణిని విని నానా మనసులో ఆనందించి వారి రెండు పాదాలను పట్టుకుని గట్టిగా హృదయానికి హత్తుకున్నారు. అతని కాళ్ళ నుండి అశ్రుధారలు ప్రవహించినాయి. శరీరం రోమంచితమైంది. ఓ సాయి సమర్దా పరమ ఉదారా! నన్ను ఉద్ధరించావు ప్రభూ! మీ భోధమృతంతో మా అజ్ఞానం తొలగిపోయింది అని మనసులో అనుకున్నారు.
నానా నిమోంకర్ కూడా ఎంతో సంతోషించారు. అటుపిమ్మట ఆ ఉభయులూ బాబాకు వందనం చేసి తమ వసతికి వెళ్ళిపోయారు. బాబా నానా చందోర్కర్ కు తెలియ చేసిన బోధను నేనెంతని వర్ణించగలను? ఈ బోధను ఎవరు నిత్యం పతిస్తారో వారికీ భవ భయ బాధలుండవు. స్వస్తిశ్రీ భక్తలీలామృతంలో సాయిబాబా కురిపించిన బోదామృతాన్ని మీరంతా సేవించి తరించండి.
32వ అధ్యాయం సమాప్తం
source: దాసగణు గారి రచన భక్తలీలామృతం చాప్టర్ 32
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- బాబా భోదామృతం (భక్తలీలామృతం చాప్టర్ 32) మూడవ భాగం….
- బాబా భోదామృతం (భక్తలీలామృతం చాప్టర్ 32) నాల్గవ భాగం….
- బాబా భోదామృతం (భక్తలీలామృతం చాప్టర్ 33) అరవ భాగం….
- బాబా భోదామృతం (భక్తలీలామృతం చాప్టర్ 32) రెండవ భాగం….
- బాబా భోదామృతం (భక్తలీలామృతం చాప్టర్ 33) ఎనిమిదవ భాగం….
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments