స్నానాల గదిలో సత్ చరిత్ర పారాయణ రెండవ భాగం…



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

నిన్నటి తరువాయి భాగం….

ఒక అర్ధమంటులేకుండా జీవితాన్ని గడిపాను. ఒకరోజున భగవంతుడికి నాబాధలు చెప్పుకుని ఏడిచాను. నీ వెబ్ సైట్ చూసి అందులో బాబాలీలలను చదివిన తరువాత నీతో ఫోన్ లో మాట్లాడాను. ఆవిధంగా నాకు బాబా గురించి తెలిసింది. నేనాయనను ప్రార్ధించడం మొదలుపెట్టాను. పరిస్తితులు కొంత చక్కబడటం మొదలయింది. మాయిద్దరి మధ్య కూడా సాన్నిహిత్యం కొంత మంచిగానే ఉండటం ప్రారంభమయింది.

నేను గురువార వ్రతం చేశాక ఆయనకు ఉద్యోగం వచ్చింది. ఈలోపులో మా బడ్జెట్ కు తగ్గట్లుగా యింటికోసం వెతుకుతున్నాము. నువ్వు నమ్మవు, అమెరికా లాంటి దేశంలో, నాభర్తకు సంవత్సరంపాటు ఉద్యోగం లేకపోయినా, నేను కారు, యిల్లు కొనుక్కున్నాను. అప్పు చేయకుండా ఇవి ఎలా సంపాదించానో నాకే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మేము దాచుకున్న దానితోనే ఇవన్ని కొనగలిగాము. నాపనితనానికి ఆయన చాలా సంతోషించారు. పరిస్థితులు కొంచెం చక్క బడటం మొదలైంది.  కాని నన్ను నాతల్లితండ్రులతో మాట్లాడనిచ్చేవారు కాదు.

ప్రతీవారం ఆయన తన తల్లితండ్రులతో మాట్లాడుతూ ఉండేవారు. నాకళ్ళల్లోంచి కన్నీరు వస్తూ ఉండేది. నేను బాబా వంక చూస్తూ ఉండేదాన్ని. నాకు నాతల్లితండ్రులు గుర్తుకు వచ్చిన ప్రతీసారి, నేను ప్రసాదం తయారు చేసి బాబాకి నివేదన చేస్తూ ఉండేదానిని. నాభర్త అంత భక్తిపరుడు కాదు. నేనెక్కువ సమయం పూజలో ఉండటం ఆయనకిష్టముండేది కాదు.

కాని నేను సత్ చరిత్ర పారాయణ చేద్దామని ప్రారంభించాను. కాని ఒక రోజున నాభర్తకి చాలా కోపం వచ్చి పారాయణను ఆపుచేయమన్నారు. నువ్వు నమ్మవు గానీ ప్రియాంకా, నేను స్నానాలగదిలోకి వెళ్ళి అక్కడ చదివి, బాబాని ఆమోదించమని వేడుకొన్నాను.

“స్వచ్చమైన భక్తినే నేను నమ్ముతాను” అన్నమాటలు సత్యమని నేను నమ్ముతున్నాను. నేనాయనకు పుష్పాలను సమర్పించలేదు. ధూపం వేయలేదు, అగరువత్తులను వెలిగించలేదు. నీచ స్థానమైన స్నానాల గదిలో నేను సత్ చరిత్రను పారాయణ చేశాను.

మాచెల్లెలికి వివాహం నిశ్చయమయింది. నేను భారతదేశానికి వెడదామనుకున్నను. కాని నా భర్త నన్నుపంపడానికి ఒప్పుకోలేదు. నాతల్లితండ్రులు ఫోన్ చేసినప్పుడు ఆయన అమర్యాదకరంగా ప్రవర్తించారు.

నేనెంతో రోదించాను. సహాయం కోసం బాబాని ప్రార్ధించాను. నేను నీకు మైల్ చేసి నీతో మాట్లాడాను. పూర్తిగా భారమంతా బాబా మీదే పెట్టమని నాకు చెప్పావు. నాలో శ్రధ్ధ సహనం లోపించాయి, యెందుకంటే ఇన్ని సంవత్సరాలుగా జరగనిది ఇప్పుడెలా జరుగుతుందనుకున్నాను.

పరిస్థితులన్నీ చక్కబడి ఏదైనా అద్భుతం జరిగితే కనక షిరిడీ వస్తానని బాబాకి చెప్పుకున్నాను అంతే. నా భర్త తల్లితండ్రులు ఫోన్ చేసి నన్ను పెళ్ళికి పంపమనీ, లేకపోతె పెళ్ళి వారి కుటుంబంలో కూడా మాట వస్తుందని చెప్పారు. తను ముందర ఒప్పుకోలేదుగానీ, తరువాత ఏమి జరిగిందో తెలీదు, నా తల్లి తండ్రులతో మాట్లాడి మాచెల్లెలి పెళ్ళికి నన్ను పంపడానికి ఒప్పుకున్నారు.

విమానాశ్రయంలో నాతల్లితండ్రులను నాలుగు సంవత్సరాల తరువాత చూసి నేనెంత సంతోషించానో నాకే తెలీదు. నేనొక విషయం మాత్రం చెప్పగలను. తను లేకపోయినా నా ఎముకలు మాట్లాడతాయి అని బాబా తన భక్తులకిచ్చిన మాట యదార్ధం. నాజీవితంలో ఆయన ఉనికిని అనుభవించాను. నేను నా చెల్లెలి పెళ్ళికి వెళ్ళాలి అని అడిగాను అంతే. కాని బాబా నా భర్తను కూడా వివాహానికి వచ్చేలా చేశారు. అక్కడాయన అందరితోనూ చాలా మర్యాదగా ప్రవర్తించారు.

బాబాకి ధన్యవాదాలు తెలుపుకుందుకు షిరిడీ వెళ్ళాను. నా చెల్లెలి పెళ్ళిలో నేను కొత్త బట్టలు ధరించాను. బాబాకి కూడా క్రొత్త బట్టలు పెడదామని, బట్టలు ఏరంగువి కావాలో బాబా నిర్ణయానికే వదిలేశాను. నేను పెళ్ళిలో ఏరంగు బట్టలు వేసుకున్నానో అదేరంగు, ఆకుపచ్చ బట్టలు షాపతను యిచ్చేటప్పటికి నాకు చాలా ఆశ్చర్యం వేసింది.

ప్రియంకా!, 4 సంవత్సరాల తరువాత నాకింతటి దివ్యమైన సమయాన్ని బాబా కల్పించినందుకు నా కళ్ళల్లోంచి కన్నీరు వస్తోంది. బాబా మహరాజును మధ్యాహ్న ఆరతికి తయారు చేస్తున్నపుడు ఆయన నావైపు చిరునవ్వుతో చూస్తూ, నారాక కోసం ఎదురు చూస్తున్నట్లనిపించింది.

నేను నాతో, నాతోటి సాయి భక్తులందరి కోరికలను తీసుకుని వెళ్ళాను. అవన్నీ కూడా బాబా వారికి సమర్పించాను. ఫలితంగా నాకు శాలువా, బాబాకు సమర్పించబడ్డ హల్వా , ప్రసాదంగా లభించాయి.

నేనిప్పుడు చాలా ఆశాజనకంగా ఉన్నానని చెప్పగలను ఆయన నాప్రార్ధనలను వింటున్నారు. నావైవాహిక జీవితం బాగా కాకాపోయినా కాస్త మెరుగయింది. బాబా నాకు మంచి రోజులు యిస్తారని ఆయననే నమ్ముకున్నాను.

సాయి భక్తులెవరికీ సలహా యిచ్చేటంతటి పెద్దదానిని కాదు. నా అనుభవాన్ని మీ అందరితోనూ పంచుకుంటూ బాబా మీద పరిపూర్ణమైన నమ్మకాన్ని ఉంచమని చెప్పగలను. మనం ఆయనను వదలినా ఆయన మనలను వదలరు. తన భక్తులందరికీ ఆయనే తల్లి, తండ్రి. రెసెషన్ సమయంలో నాకు ఉద్యోగాన్నిచ్చారు. నాకు అనుభవం లేకపోయినా అది కూడా మంచి కంపనీలో ఇచ్చారు. కష్ఠ కాలం సమయంలో నేను డబ్బుకిబ్బంది పడలేదు.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles