శ్రీసాయి సత్ చరిత్ర – తత్వం – అంతరార్ధం – 2 వ.భాగం



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

శ్రీసాయి సత్ చరిత్ర – తత్వం – అంతరార్ధం – 2వ.భాగం
మూలం : సాయి బాని స శ్రీరావాడ  గోపాలరావు
తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు

శ్రీసాయి సత్ చరిత్ర 32వ.అధ్యాయంలో బాబా “నేను చిన్నపిల్లవాడిగా ఉన్నపుడు నాయజమాని నాపనికి సంతోషించి ఆరువందల రూపాయలు జీతమిచ్చాడు” అని చెప్పారు.  అంటే దానర్ధం బాబా 16 లేక 18 సంవత్సరాల వయసులో 18వ.శతాబ్దంలో  ఆరువందల రూపాయలు జీతంగా సంపాదిచారనా?  ఆరోజుల్లో అది అసాధ్యమనే అనుకొంటున్నాను.  ఆరోజులలో ప్రభుత్వంలో  అత్యున్నత అధికారిగా ఉండే బ్రిటిష్ గవర్నర్ జనరల్ కే నెలకు అయిదు వందల రూపాయల జీతం వచ్చేది.

అయితే బాబాకు నెలకు ఆరువందల రూపాయల జీతం ఎవరివ్వగలరు?

శ్రీసాయి సత్ చరిత్ర 32వ.అధ్యాయాన్ని ఒకసారి గమనిద్దాము. అందులో బాబా ఈవిధంగా చెప్పారు.  “నాచిన్న తనములో నేను భుక్తికొరకు బీడ్ గాం వెళ్ళాను.  అక్కడ బట్టలపై చేయు అల్లిక పని దొరికింది. నేను చాలా కష్టపడి పని చేశాను.  యజమాని నా పనికి సంతోషించాడు. నాకంటే ముగ్గురు కుఱ్ఱవాళ్ళు అప్పటికే పనిచేస్తూ ఉన్నారు.  

మొదటి వానికి రూ.50/- రెండవ వానికి రూ.100/- మూడవవానికి రూ.150/- జీతం.  నాకు ఈ మూడు మొత్తములకు రెండింతలు జీతం అనగా రూ.600/- నాయజమాని యిచ్చేవాడు.  నాయజమాని సంతోషించి నాకు మంచి దుస్తులు, తలపాగా బహూకరించాడు.  కాని నేను వాటిని ఉపయోగించలేదు.  వాటిని భద్రంగా దాచిపెట్టి ఉంచాను.  “మానవుడిచ్చినది త్వరలో సమసిపోవును, దైవమిచ్చినది శాశ్వతముగా నిలుచును.”

బాబా చెప్పిన మాటలు “ఈ భౌతిక శరీరం మట్టిలో కలసిపోతుంది.  శ్వాస అనంత విశ్వంలో లీనమయిపోతుంది.  నేనెక్కడికి వెళ్ళినా మాయ నన్ను బాధపెడుతున్నది. నేనెల్లప్పుడు నాభక్తుల క్షేమం కోసం ఆతురత పడెదను.  ఎవరికి తగ్గట్లుగా వారి కర్మఫలం వారనుభవిస్తారు.  అటువంటి అవకాశాలు మరలా మరలా రావు.  నామాటలను గుర్తుంచుకున్న వారికి అమూల్యమయిన ఆనందం లభిస్తుంది.”
బాబా చెప్పిన పైమాటలను విశ్లేషించి దాని అంతరార్ధాన్ని గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.

ఇక్కడ యజమాని అంటే భగవంతుడు.  నేయబడే బట్ట అంటే అర్ధం మానవులని ఒక క్రమమయిన పధ్ధతిలో సరియైన దారిలో నడిపించడం.  తనకంటే పూర్వము పనిచేసిన ముగ్గురు బాలురు అంటే సాయి యొక్క క్రిందటి మూడు జన్మలు. 

ఆరువందల రూపాయలు జీతమనగా ఈజన్మలో సాయి యొక్క కీర్తి, శక్తి, మహిమలు మరొక ఆరువందల సంవత్సరాల వరకు మరొక రూపంలోనికి మారడానికి ముందు, నిలిచి ఉంటాయని అర్ధము.  “మానవుడిచ్చినది త్వరలో సమసిపోవును, దైవమిచ్చినది శాశ్వతముగా నిలుచునని బాబా చెప్పారు.

ఈ సందర్భంలో ఆయన శక్తి మరియు కీర్తిని ప్రస్తావిస్తున్నాను.  ఆయన యింకా యిలా చెప్పారు.  అటువంటి అవకాశలు మళ్ళీ మళ్ళీ ఎప్పటికీ రావు అని చెప్పిన దానికి అర్ధం పరోక్షంగా యిక ఎప్పటికీ జరగదని ఒక సూచన చేశారు.

నేనెక్కడికయినా వెళ్ళినా నేనెక్కడ ఆసీనుడయినా సరే అని ఆయన అన్నదానికి అర్ధం.  బాబా మరలా తరువాత నుంచి మరొక కొత్త రూపంలో జీవిస్తారు.  “నేను నావారి కోసం ఆతురత పడెదను” అని బాబా అన్న మాటలకు అర్ధం. తాను మరొక రూపంలోనికి మారినా కూడా తన భక్తుల యోగక్షేమాలను నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉంటానని.

శ్రీసాయి సత్ చరిత్రలో బాబా చెప్పిన మాటలను తిరిగి ఒకసారి గుర్తు చేసుకొందాము.  శ్యామాతో తనకు 72 జన్మల నుండి అనుబంధం ఉందని బాబా చెప్పారు.  లక్ష్మీ కాపర్దేతో  తనకు క్రితం అయిదు జన్మలనుండి సంబంధం ఉందని శ్యామాతో చెప్పారు..  దురంధరే సోదరుల విషయంలో వారితో తనకు వారితో గత 600 సంవత్సరాల నుండి అనుబంధం వుందని బాబా చెప్పారు.
బాబా తన భక్తుల నుండి ధనరూపేణా దక్షిణకు బదులుగా అరిష్డ్వర్గాలను, నవవిధ భక్తి, నమస్కారాలను సీకరించేవారు.
తన యజమాని నుంచి ఆరువందల రూపాయలను ఆయన తీసుకొన్నారు.  ఏ రూపంలో తీసుకొన్నారు, దాని అంతరార్ధం ఏమిటి?
సాయి బానిస గారు చెప్పే విషయాలు అర్థం కావాలంటే తర్వాత బాగాలు కూడా చదివితే కొంత అవగాహన వస్తుంది. అందువలన కొంచం సహనంతో చదవవలిసిందిగా కోరుతున్నాను.
రేపు తరువాయి బాగం….

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles