‘‘చరాచర జీవకోటినంతా రక్షించే మీకేమిటి బాబా ఈ బాధ?



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!

ముందు భాగం కోసం ఇక్కడ  క్లిక్ చేయండి

(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)

 

‘‘మీరంతా ముందు వెళ్ళి రండి. నేనూ, లక్ష్మీబాయి షిండే మరిద్దరు ముగ్గురు బాబాకి తోడుగా ఉంటాం. మీరొచ్చేక మేం భోజనాలకి వెళ్తాం.’’ భక్తులతో అన్నాడు శ్యామా.‘‘ఏం బాబా, దీనికి మీకు అభ్యంతరం లేదు కదా?’’ అడిగాడు. లేదన్నట్టుగా ఊపిరి ఆడక దగ్గుతూ తలూపారు బాబా.

భక్తులంతా భోజనాలకు వెళ్ళిపోయారు. ఇప్పుడక్కడ శ్యామా, లక్ష్మీబాయి షిండేతో పాటు బాగోజీ, బయాజీపాటిల్‌, నిమోన్కర్‌ ఉన్నారు.

వచ్చిన దగ్గు తగ్గలేదు. ఇంకా దగ్గుతూనే ఉన్నారు బాబా. దగ్గుతూ ఆ బాధను భరించలేక మెలికలు తిరిగి పోతున్నారు. అలా మెలికలు తిరిగిపోతూ కూడా ఇలా అన్నారు బాబా.‘‘ఈ షిరిడీ నూనె వ్యాపారులు నన్ను బాగా హింసించారు. నేనుండనిక్కడ. వెళ్ళిపోతాను.’’

‘‘అవును బాబా! వాళ్ళు చేసింది తప్పే! వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను, మీరు ఆవేశపడకండి.’’ అన్నాడు శ్యామా.‘‘అది కాదు శ్యామా, వాళ్ళు…వాళ్ళేం చేసారో తెలుసా?’’ అని లేచి కూర్చున్నారు బాబా.

అలా లేచి కూర్చునేందుకు చాలా కష్టపడ్డారాయన. దగ్గు వదలడం లేదాయన్ని. గుండెల్ని పిండేసి మండించేస్తోంది.‘‘మంట మంట’’ అన్నారు బాబా.

గుండెల్ని చేత్తో రాసుకోసాగారు. గుండెల మీద ఆయన చేతుల్ని సున్నితంగా తొలగించి, తను రాయసాగింది లక్ష్మీబాయి షిండే.

బాధను తట్టుకోలేనట్టుగా నానా అవస్థా పడుతున్న బాబాని చూసి కన్నీరు పెట్టుకున్నాడు బాగోజీ.

‘‘చరాచర జీవకోటినంతా రక్షించే మీకేమిటి బాబా ఈ బాధ? నాకేదీ అర్థం కావట్లేదు.’’ అన్నాడు బాగోజీ. దగ్గు తగ్గిందేమో! సన్నగా నవ్వుతూ చూశారు బాబా.‘‘తాంబూలం తీసుకుని రా’’ ఆజ్ఞాపించారు. తాంబూలాన్ని అందించాడు బాగోజీ.

తాంబూలాన్ని నోరారా నమిలి, దానిని మింగేందుకు నీళ్ళు తాగ ప్రయత్నించారు బాబా. నీరు మింగుడుపడ లేదు. నానా ఇబ్బందీ పడ్డారు. కళ్ళు తేలేశారు బాబా.‘‘బాబా’’ గొల్లుమన్నారంతా.

ఆయన్ని పట్టుకుని కుదిపారు. కాస్సేపటికి తేరుకున్నారు బాబా. సూటిగా చూడసాగారు. చెయ్యాల్సింది ఏదో ఉంది, అందుకే తేరుకున్నారాయన.

తీర్చుకోవాల్సిన ఋణం ఏదో ఉంది, అందుకే తెప్పరిల్లారు. ఎవరూ ఏడవరాదన్నట్టుగా సైగ చేశారు బాబా. ఊరుకున్నారంతా. 

తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles