‘‘బాబా! ఇవాళ సీమోల్లంఘనం. ఈ పర్వదినం రోజున మీరిలా చేయడం…మీకిది తగునా?’’



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!

ముందు భాగం కోసం ఇక్కడ  క్లిక్ చేయండి

(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)

 

‘‘అది కాదు బాబా’’ చిరాకు చెందాడు శ్యామా.‘‘పోనీ నీ తల్లిదండ్రులెవరో చెప్పు.’’ అడిగాడు. అటు నుంచి నరుక్కొని వస్తే వివరాలు తెలిసే అవకాశం ఉందనుకున్నాడు శ్యామా.

‘‘నా తల్లి, తండ్రి, నన్ను శాసించే వ్యక్తి ఒక్కరే. అది అల్లా.’’ అన్నారు బాబా. శ్యామా తలపట్టుకున్నాడు. బాబా కుల మతాల సమస్య పరిష్కరించడం తన వల్ల కాదనుకున్నాడు. అయితే చిత్రంగా కొద్ది రోజుల్లోనే ఆ సమస్యకు పరిష్కారం దొరికింది.

భక్తులంతా బాబా కుల మతాల విషయమై కొట్టుకోకుండా ఆ నాటి నుంచి వూరుకున్నారు.1916 వ సంవత్సరం.విజయదశమి.ద్వారకామాయిని పూలతో అందంగా అలంకరించారు. బాబాని ‘దేవి అవతారం’గా భావించి, అందరూ ఆయన్ని అర్చించారు.

సాయంత్రం ‘సీమోల్లంఘనం’ చేస్తారు. అందుకు అంతా సమాయత్తమవుతున్నారు. బాబా కుదురుగా లేరు. అసహనంగా అటూ ఇటూ తిరుగుతున్నారు. దానిని ఎవరూ గమనించలేదు. ఎవరి హడావుడిలో వారున్నారు.

ద్వాపరయుగంలో విజయదశమి రోజునే పాండవులు విజయశ్రీని చేజిక్కించుకున్నారు. ఉత్తర గోగ్రహణం సందర్భంగా కౌరవులను తరిమి తరిమి కొట్టి విజయాన్ని సాధించారు పాండవులు. దీనికి సంకేతమే ‘సీమోల్లంఘన’ ఉత్సవం. 

ఈ ఉత్సవాన్ని షిరిడీలో భారీ ఎత్తున నిర్వహించడం తరతరాలుగా వస్తోంది.భక్తులంతా సాయంత్రం సీమోల్లంఘనాన్ని జయప్రదంగా నిర్వహించారు.

బాబాని దర్శించుకునేందుకు ద్వారకామాయికి చేరుకున్నారు. గుంపులు గుంపులుగా వస్తున్న భక్తులందరినీ ఉద్దేశించి బాబా గట్టిగా అరిచారిలా.‘‘దేఖో! ఇటు చూడండి.’’చూశారంతా. అవాక్కయిపోయారు. బాబా ఒంటి మీద నూలు పోగన్నది లేదు.

నగ్నంగా ఉన్నారాయన. ఎప్పుడూ ధరించే కఫనీ, లంగోటి ఆయన చేతిలో పీలికలు పీలికలుగా ఉన్నాయి. ఇంకా వాటిని పీలికలు చేస్తూ కనిపించారాయన. కోపంగా ఉన్నారు. కళ్ళెర్రబారి ఉన్నాయి.

అంతా చూస్తూండగానే చేతిలోని దుస్తుల్ని ధునిలో వేశారు బాబా. మంట ఉవ్వెత్తుగా లేచింది.

ఆ మంటకి దగ్గరగా నిలబడి మళ్ళీ ఇలా అరిచారు బాబా.‘‘చూడండి, సరిగ్గా చూడండి, చూసి చెప్పండి, నేను హిందువునా? ముస్లిమ్‌నా?’’హిందూ ముస్లిం భక్తులంతా ఒకరినొకరు చూసుకున్నారు.

దైవానికి కులాలూ, మతాలూ అంటగట్టకూడదనిఅనుకున్నారు.‘‘చెప్పండి, నేనెవరిని? హిందువునా? ముస్లిమ్‌నా?’’ బాబా ఆగ్రహోదగ్రుడయ్యారు. ఊగిపోసాగారు. నిల్చున్న చోట నిల్చోక అటూ ఇటూ తిరనారంభించారు.

‘‘చెప్పండి, ఈ అగ్నిది ఏ కులం? అల్లాది ఏ మతం? మిమ్మల్నే అడుగుతున్నాను, చెప్పండి.’’ బాబా కేకలు ద్వారకామాయి అంతా ప్రతిధ్వనించాయి.

ఆ కేకలకి భక్తులు వణికిపోయారు. భయంతో ఒకరినొకరు పట్టుకున్నారు. ఆ భయానికి కూడా కులాలూ, మతాలూ లేకపోయాయి. హిందువుని ముస్లిం పట్టుకున్నాడు. ముస్లిమ్‌ని హిందువు పట్టుకున్నాడు.

ధైర్యం చెబుతున్నట్టుగా ఒకరినొకరు దగ్గరగా తీసుకున్నారు. అల్లాడిపోతున్న భక్తజనావళిని చూశాడు భాగోజి. ఉప్పెనలా ఉన్న బాబాని చూశాడు. ధైర్యం చేసి ఒక అడుగు ముందుకు వేశాడు. బాబాని సమీపించాడు.

‘‘బాబా! ఇవాళ సీమోల్లంఘనం. ఈ పర్వదినం రోజున మీరిలా చేయడం…మీకిది తగునా?’’ అడిగాడు.‘తగును’ అన్నట్టుగా చూశారు బాబా. చేతిలోని సటకాని నేలపై గట్టిగా కొట్టారు.‘‘ఇది…ఈ రోజే నా సీమోల్లంఘనం.’’ అన్నారు.అంటే? అని ప్రశ్నించుకున్నాడు శ్యామా. జవాబు దొరకలేదు.

మనసులోని తన ప్రశ్నకి బాబా సమాధానం చెబుతారు. అది ఆయన అలవాటు. అయితే ఈసారి బాబా అలవాటు తప్పారు. జబాబీయలేదు.

తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles