ఉద్ధవరావ్ దేశ్ పాండే



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

ఉద్ధవరావ్ దేశ్ పాండే

శ్యామా కుమారుడు ఉద్ధవరావ్. అయన సాయి గురించిన స్మ్రుతులిలా చెప్పారు. “బాబా మహా సమాధి చెందేనాటికి నాకు 12 లేక 14 సం.లుంటాయి. అంతవరకు నేను తరుచుగా వెళ్లి సాయి సన్నిధిలో కూర్చునేవాణ్ణి. కారణం అయన తరుచుగా పాలకోవా, జీడిపప్పు పాకం, బర్ఫీ వంటివి పెడుతుండేవారు. నాకు జీడిపప్పు పాకం ఎక్కువ ఇష్టమని గుర్తించి ప్రసాదాలన్నింటిలో తరచుగా నాకు అదే పెడుతుండేవారు.

నా తండ్రిపై ఆయనకున్న ప్రేమ వాళ్ళ నన్ను కూడా ఆయనెంతో ప్రత్యేకంగా లాలించేవారు. అది తగదని మా తండ్రి యెంత చెప్పినా, అయన దివ్య పురుషుడన్న భావం ఒక ప్రక్క ఉన్న స్వంత తాతతో ప్రవర్తించినట్లే ఆయనతో గూడా ప్రవర్తించేవాణ్ణి.

సుమారు నా అరవయేట ఒకరోజు నేను బడికి వెళ్ళకుండా ఇంట్లోనే తిరుగుతున్నాను. చివరకు నా తండ్రికి కోపము వచ్చి, కర్ర తీసుకోని తరిమితే నేను బడికి వెళ్ళనని మొండిగా జవాబు చెప్పి, మశీదు వద్ద నున్న బాబా చెంతకు పరిగెత్తాను.

నా తండ్రి మశీడులోకి వచ్చేసరికి నేను వెళ్లి బాబా ప్రక్కనే కూర్చున్నాను. పరిస్థితి గమనించి బాబా కనులేర్రజేసి, “నీవికా పిల్లవాణ్ణి కోట్టడానికి వీలులేదు” అని గదమాయించారు.

మా నాన్న “వాడు బడికి వెళ్ళమంటే వెళ్ళడం లేదు. చదువుకోకుంటే వాడికి అన్నమెవరు పెడతారు? అలా వాడు మారాం చేస్తుంటే కొట్టవద్దంటే యెట్లా?” అన్నారు. బాబా, “వాడికి అన్నం నేను పెడతాను. నీవు వాణ్ణి కోట్టడానికి వీల్లేదు!” అని గద్దించారు.

ఇక చేసేదిలేక మా నాన్న ఇంటికి వెళ్ళిపోయారు. ఆనాడు బాబా చెప్పిన మాట అక్షరాల నిజమైంది. నాకు యుక్త వయస్సు వచ్చాక! అంటే బాబా సమాధి చెందిన కొన్ని సంవత్సరాలకు నన్ను ఏదైనా పనిలో చేర్పించాలని సాఠే మొదలైన భక్తులు నన్ను పూణేకు, ఇతర నగరాలకు తీసుక వెళ్ళాలని అనేక సార్లు ప్రయత్నించారు.

కానీ సరిగా బయల్దేరే రోజుకు నాకు ఎక్కడలేని రోగం ముంచుకొచ్చి ఆ ప్రయత్నం మానుకోవలసి వచ్చేది. ఇలా ప్రతిసారి జరుగుతుండడంతో నేను షిరిడి విడిచి వెళ్ళడానికి బాబా అనుమతి లేదని తలచి ఆ ప్రయత్నం విరమించుకున్నారు. తరువాత సంస్థానంలో ఉద్యోగం ఇప్పించి బాబాయే నాకు అన్నం పెట్టారు.

ఒకసారి ఎవరో భక్తుడు బాబా చేత తాకించి పూజలో పెట్టుకోదలచి ఒక నల్లరాతి విఘ్నేశ్వరుని విగ్రహం బాబా చేతికిచ్చారు.యన దానిని కొద్దిసేపు తమ ఒడిలో ఉంచుకొని తిరిగి ఆ భక్తునికి ఇచ్చే బదులు మా తండ్రికి ఇచ్చి ‘ఇది నీ దగ్గర ఉంచుకో!’ అని చెప్పారు. అది అప్పటినుండి మా ఇంట్లోనే ఉన్నది.”

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles