సమాధి నుండి వెంటనే వచ్చి నా పక్కన నిలిచారు



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు

సమాధి నుండి వెంటనే వచ్చి నా పక్కన నిలిచారు

భువనేశ్వర్ కి చెందిన మాధవి గారు తమకు బాబా ప్రసాదించిన మరో అనుభవాన్ని సాయి బంధువులతో పంచుకోవడానికి  పంపించారు. ఈ లీల చదివితే మనం కష్టంలో ఉన్నప్పుడు బాబాను తలుచుకోకున్నప్పటికి బాబా మన రక్షణ కోసం ఎలా అప్రమత్తంగా ఉంటారో అర్థం అవుతుంది. ఆ లీలను మీకోసం క్రింద ఇస్తున్నాను. ఆమె మాటలలోనే చదవండి.

నా పేరు మాధవి, మేము ఉండేది భువనేశ్వర్. నేను గత వారం మీ అందరితో ఒక అనుభవాన్ని మీతో పంచుకున్నాను. ఇప్పుడు నాకు బాబా ప్రసాదించిన మరో అనుభవాన్ని మీకు తెలియజేస్తాను. ఈ  అవకాశం ఇచ్చిన సద్గురు సాయినాదునికి నా ప్రణామములు.

ఆ పరమాత్ముడు వేరే వ్యక్తీ లోకి పరకాయ ప్రవేశం చేసి నన్ను రక్షించిన వైనం ఇప్పుడు మీకు తెలియజేస్తాను. చదివి ఆనందించండి. అది 2016 వ సంవత్సరం. నేను , మా వారు L.T.C లో రాజస్తాన్ చూసి ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కి చేరాము. ఢిల్లీ నుండి అమృతసర్ ట్రైన్ లో వెళ్ళాలని మా ప్లాన్.

ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో దిగి రైల్వే స్టేషన్ కు వెళ్ళడానికి ఎస్కాలేటర్ లో కిందికి దిగుతున్నాము. మా వారు ముందుగా వెళ్ళిపోయారు. నేను వెనకాల ఎస్కాలేటర్ లో దిగాలని నేను మొదటి స్టెప్ లో నిలుచున్నాను. రెండవ స్టెప్ పై సూట్ కేసు ఉంచాను.

ఇంతలో ఎలా జరిగిందో తెలియదు గాని నా కాలు సూట్ కేసు హేండిల్ లో దూరి ఇరుక్కు పోయింది. అంటే ఒక కాలు ఒక స్టెప్ లో ఉంది, రెండవ కాలు సూట్ కేసు హేండిల్ లో నుండి దూరి మూడో స్టెప్ లో పోయి పడింది. ఎస్కాలేటర్ రన్నింగ్ కండిషన్ లో ఉంది. ఇంకా మరే ఉహించండి నా పరిస్తితి యెంత భయంకరంగా ఉందో. ఇక నేను దోర్లిపోతను అనుకున్నాను.

ఇంతలో నా ప్రక్కన ఒక మనిషి ఎక్కడి నుండి వచ్చాడో తెలియదు, “నేను నీతోనే ఉన్నాను. భయపడకు” అని  నా కాలు సూట్ కేసు నుండి బయటకు తీసి నన్ను కాపాడారు. అంతలో మేము క్రిందకు చేరిపోయము. అతనికి కృతఙ్ఞతలు చెప్పాలనుకుంటే అతడు కనుమరుగైపోయినారు.

వచ్చిన వ్యక్తీ మరెవరో కాదు. ఆ సాయినాధుడే.  తనను నమ్ముకున్న వాళ్ళను కంటికి రెప్పలా కాపాడతారు బాబా. సర్వస్య శరణాగతి చేసిన వారి వెన్నంటి ఉంటారు. ఆ కష్ట సమయంలో నేను ఆయనను గుర్తు చేసుకొనేందుకు ముందే అయన నన్ను గుర్తు చేసుకొని సమాధి నుండి వెంటనే వచ్చి నా పక్కన నిలిచారు.

“నా సమాధి సమాధానం చెప్తుంది” అని నాకు నిదర్శనంగా నాకు చూపించారు.  మీరు నమ్మండి, మీకు అయన లీలలు అవగతమౌతాయి. ఇది సత్యం, సత్యం…… పునః సత్యం.

ర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles