నా సాయినాధుల వారే ఈటిక్కట్టు కలెక్టరు పై అధికారి రూపములో వచ్చి నన్ను ఆ కష్టము నుండి రక్షించి నన్నుఆశీర్వదించారనే భావన కలిగింది–సాయిబానిస(శ్రీ రావాడ గోపాలరావు). — 7–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



This Audio prepared by Mr Sri Ram Download

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు 

ఈ రోజు సాయి.బా.ని.స. అనుభవాలలో 7 వ అనుభవాన్ని తెలుసుకుందాము.

సాయి ఆపదలో ఉన్న తన భక్తుల పిలుపుకు వెంటనే స్పందిస్తారని మనకందరకూ తెలుసు.

బలరాం మాన్కర్ మశ్చీందర్ ఘర్ లో ధ్యానము చేసుకున్న తరువాత దాదర్ లోని తన యింటికి బయలుదేరాడు. పూనే రైల్వేస్టేషన్ కి చేరుకుని దాదర్ కు వెళ్ళే రైలు కోసం యెదురుచూడ సాగాడు.

రైలు టిక్కట్టు కొనడానికి ప్రయత్నించినా విపరీతమైన జన సమూహంలో టిక్కట్టు కొనలేకపోయాడు.

మానసిక ఆందోళనతో తాను తన యింటికి వెళ్ళలేనని బాధపడసాగాడు. తనను ఆ కష్టాన్నుండి గట్టెక్కించమని సాయిని ప్రార్థించాడు.

మరుక్షణమే సాయి ఒక పల్లె టూరి వాని రూపములో ప్రత్యక్షమై తన వద్ద దాదరు వరకూ టిక్కట్టు ఉన్నదని కొన్ని కారణాంతరాల వల్ల తను ప్రయాణంచేయలేకపోతున్నానని చెప్పి ఆ టిక్కట్టునతని చేతిలో పెట్టాడు.

మాన్కరుకు యేమి జరిగిందో తెలుసుకునే లోపల ఆ అపరిచిత వ్యక్తి జన సందోహంలో మాయమయిపోయినాడు. ఆ పల్లెటురి వాడిచ్చిన టిక్కట్టుతో మాన్ కర్ తన యింటికి క్షేమంగా చేరుకున్నాడు.

ఇది సాయి సచ్చరిత్ర 31 వఅధ్యాయంలో వివరింపబడింది.

సరిగా నాకు కూడా యిటువంటి అనుభవమే కలిగింది.

సాయి భక్తులందరితోనూ దానిని నేనిప్పుడు పంచుకోదలిచాను. 1991 వసంవత్సరంలో గోదావరీ నది పుష్కరాలకు వెళ్ళి రాజమండ్రీ రైల్వే స్టేషన్లో సికందరాబాదు రైలుకోసం నిరీక్షిస్తున్నాను.

మన భారత దేశంలోని అన్నినదులకు 12 సంవత్సరాలకు ఒకసారి యిటువంటి పుష్కరాలు జరుగుతాయి.

రాజమండ్రీ రైల్వేస్టేషన్లో నా బంధువు ఒకరు నాకు ఒక పెట్టెను ఇచ్చి దానిని సికందరాబాదులోని తనబంధువుల యింటికి చేర్చమని కోరినాడు.

నేను ఈపని చేయటానికి అంగీకరించాను. రైలు మరునాడు ఉదయము ఏడు గంటలకు సికందరాబాదు స్టేషనుకు చేరుకున్నది.

నేను కూలివాని సహాయంతో ఆపెట్టెను తీసుకుని స్టేషను బయటికి వెళ్ళడానికి గేటు దగ్గిరకు వచ్చినప్పుడు అక్కడ టిక్కట్టు కలెక్టరు నన్ను ఆపి ఆ పెట్టి 30 కిలోలకన్నయెక్కువ బరువు ఉండునని, దానిని తూకము వేయవలెనని ఆదేశించినాడు.

నా దగ్గరున్నసంచీ మరియు ఆ పెట్టెను తూకము వేయగా 39 కిలోల బరువుంది. ఆ అదనపు బరువుకు 150 రూపాయలు అపరాధ రుసుము చెల్లించవలెనని ఆజ్ఞాపించినాడు. ఆ సమయములో నా వద్ద 20 రూపాయలు మాత్రమే ఉంది.

నేను ఆ టిక్కట్టు కలెక్టరును యెంత ప్రాధేయ పడినా అతను నన్ను గేటు బయటకు వెళ్ళడానికి అంగీకరించలేదు.

తోటి ప్రయాణీకులందరూ నన్ను ఒక దొంగగా భావించి పలు రకములైన వ్యాఖానాలు చేయసాగారు.

అటువంటి ఆపద సమయములో నేను మనసారా శ్రీసాయిని ప్రార్థించి ఈకష్టము నుండి గట్టెక్కించమని వేడుకున్నాను.

ఆ సమయం లో ఆ టిక్కట్టు కలెక్టరు యొక్క  పై అధికారి అటువైపు వచ్చి నా భుజముపై చెయ్యి వేసి దగ్గిరలోఉన్న ఫ్రిడ్జ్ లో నించి ఒక గ్లాసు మంచి నీరు ఇచ్చి ఈ పెట్టినీది కాదన్న విషయం నాకు తెలుసు.

నీవు ఆందోళన చెందవలదు అని చెప్పి ఆ టిక్కట్టు కలెక్టరుతో ఏదో మాట్లాడి గేటు బయట వరకు వచ్చి నన్ను యింటికి వెళ్ళమని చిరునవ్వుతో చెప్పినాడు.

ఆ క్షణములో నా సాయినాధుల వారే ఈటిక్కట్టు కలెక్టరు పై అధికారి రూపములో వచ్చి నన్ను ఆ కష్టము నుండి రక్షించి నన్నుఆశీర్వదించారనే భావన కలిగింది. నన్ను ఈ విధంగా రక్షించిన ఆ పెద్ద ఆఫీసరు నా సాయి తప్ప మరెవరు?

చేతులు జోడించి సాయి కి మనస్పూర్తి గా నమస్కరించాను.

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “నా సాయినాధుల వారే ఈటిక్కట్టు కలెక్టరు పై అధికారి రూపములో వచ్చి నన్ను ఆ కష్టము నుండి రక్షించి నన్నుఆశీర్వదించారనే భావన కలిగింది–సాయిబానిస(శ్రీ రావాడ గోపాలరావు). — 7–Audio

kishore Babu

Thank you so much Sai Suresh..

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles