సాయిబానిస(శ్రీ రావాడ గోపాలరావు) గారి అనుభవాలు — 4



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు 

సాయితో సా.యి.బా.నిస. అనుభవాలు – 4

బాబా నానుండి పాదుకలను స్వీకరించుట

ఈ సంఘటన వేసవికాలం ఏప్రిల్, 1990 ఒక శనివారం సాయంత్రం జరిగినది.. ఈ అనుభవం నా మూడవ అనుభవంలో చెప్పిన గుడి వద్దనే జరిగినది. సాయితో జరిగిన నా మొదటి అనుభవంతో నా మనసంతా నిండిపోయి ఉంది. నా మధురానుభూతులను యెప్పటికీ శాస్వతంగా ఉంచుకోవడానికి నేనేదయినా చేయగలనా అని వేప చెట్టుకింద నిలబడి ఆలోచించ సాగాను. పాలరాతితో పాదుకలు చేయించి వేప చెట్టుకింద ప్రతిష్టిస్తే తగినట్లుగా ఉంటుందని భావించాను.

అదే సమయంలో ఆంజనేయస్వామి గుడిలో ఉన్న పూజారి బయటకు వచ్చి వేప చెట్టు చుట్టూ ప్రకక్షిణలు చేస్తూ నా దగ్గరకు వచ్చినాడు.. ఆయన నా ప్రక్కన నిలబడి నాతో మాట్లాడుతూ ఒక విచిత్రమైన కోరికను కోరాడు, ఆ కోరిక ఆయన మాటలలో  మీకు చెబుతున్నా “అయ్యా, వచ్చే వేసవి కాలం చాలా ఉగ్రంగా ఉంటుంది, ప్రతీరోజూ నేను కాళ్ళకు చెప్పులు  లేకుండా గుడికి  రావాల్సి వస్తోంది. అందుచేత దయచేసి మీరు నాకొక జత తోలు చెప్పులు దానంగా ఇవ్వమని కోరుతున్నాను” అని అడిగారు. నేను చాలా ఆశ్చ్రర్యపో యాను. నేను సాయినాథుల వారి జ్ఞాపకంగా ఈ వేపచెట్టుకింద పాలరాతి పాదుకలు ప్రతిష్టించడానికి ఆలోచించుచుండగా బాబా ఈ పూజారి రూపంలో నా నుండి తన పాదాలకు ధరించడానికి తోలు చెప్పులు కోరడము నా మనసులోని కోరికను తీర్చడానికే అని భావించాము. సాధారణంగా చెప్పుల జత దానాన్ని యెవరూ స్వీకరించరు. కాని సాయినాధుల వారు తాను తన భక్తులకు విధేయ సేవకుడనని సచ్చరిత్రలో చెప్పి యున్నారు. తన భక్తుల మనసులోని కోరికను తీర్చడానికి సదా సిథ్థముగా ఉంటానని చెప్పినారు. ఈ ఆలోచనలతో సాయినాధుల వారే పాలరాతి పాదుకలకు బదులుగా తాను ధరించడానికి తోలు చెప్పులు అడుగుతున్నారని గ్రహించాను. అదే సమయంలో ఆయన కోరిన మరొక కోరిక కూడా నన్ను ఆశ్చర్యములో ముంచివేసింది. తాను తన యింటిలోవంట చేసుకోవడానికి ఇబ్బందిగా ఉన్నదని తనకొక కిరోసిన్ స్టవ్ కొనిపెట్టమని కోరినారు. ఆ గుడి పూజారి కిరోసిన్ స్టవ్ కోరడము ద్వారకామాయిలోని ధుని ఉండటము గుర్తు చేసింది. నేను ఈ రెండుకోరికలనుతీర్చగలనని మాట ఇచ్చి ఆ మరుసటి శనివారమునాడు నూతన తోలు చెప్పులను దుకాణము నుండి కొని, తలపై పెట్టుకుని గుడికి వచ్చి పూజారి గారి పాదాలకు తొడిగినాను. నేను తెచ్చిన కిరోసిన్ స్టవ్ వారి యింటికి తీసుకుని వెళ్ళి వారికి ఇచ్చినాను. ఆ సమయంలో బాబా గారు నా నుండి పాదుకలు, ధుని స్వీకరించిన అనుభూతిని పొందినాను. వారి ఆశీర్వచనాలు పొందినాను.

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “సాయిబానిస(శ్రీ రావాడ గోపాలరావు) గారి అనుభవాలు — 4

Sai Suresh

బాబా కి మనం మనః పూర్వకం గా ఏదైనా సమర్పించాలని అనుకుంటే, బాబా ఏ రూపంలో ఐయిన వచ్చిస్వీకరిస్తారు.

kishore Babu

Thank you so much Sai Suresh..

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles