Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
అలారం మోగుతూండగా లేచాను. విమానం బయట ప్రకాశవంతమైన సూర్యుని వెలుతురు చూశాను .యైర్ హోస్టెస్ బ్రెక్ ఫాస్ట్ అందచేస్తోంది. ఆమెని టైం యెంతయిందని అడిగాను. స్థానిక కాలమానం ప్రకారం ఇప్పుడు ఉదయం 8 గంటలని చెప్పింది. నేను మొహం కడుగుకొని కాకడ ఆరతి చదువుకోవడం మొదలు పెట్టాను. నా పక్కన కూర్చున్నాయన (మిస్టర్.రాజ్.ఐ.మిర్పురి) కాకడ ఆరతి కొంచెం పెద్దగా చదవమనీ తను కూడా వింటాననీ అన్నాడు. కాకడ ఆరతి చదవడం పూర్తి చేసి ఉదయం ఇచ్చిన పలహారాన్ని సాయికి నైవేద్యంగా పెట్టి, ఆ ప్రసాదాన్ని ఆ పెద్దమనిషికి కూడా ఇచ్చాను. అది సాయి ప్రసాదమె అని గ్యారంటీ యేమిటి అని నన్ను ప్రశ్నించాడు ఆయన. ఆయన ప్రశ్నకి తప్పకుండా జవాబివ్వాలనిపించింది నాకు. నా పరిస్థితిని గురించి సాయిని ప్రార్థించాను. ఆ బ్రేక్ ఫాస్ట్ ప్లేట్ వైపు చూసినప్పుడు కవరుమీద సాయి అన్న అక్షరాలు కనిపించాయి . నిజానికి దానిమీద యింగ్లీషులో స్విస్ యైర్ (SWISSAIR) అని ప్రింట్ చేయబడి ఉంది. దానిమీద నా పెన్నుతో సాయి అన్న అక్షరాల కింద గీత గీసి ‘సాయీ’ ఆ పెద్దమనిషికి చూపించాను. అన్నం పరబ్రహ్మ స్వరూపమని, సాయి పరబ్రహ్మమని ఆయనకి చెప్పాను. సాయి మీదున్న నా భావాలకి నన్నాయన అభినందించాడు. విమానంలో ఉన్న స్కై షాపు నుంచి ఒక స్వీట్ పాకెట్ కొని నాకు బహుమతిగా ఇచ్చాడు. అప్పుడు స్థానిక కాలమానం ప్రకారం ఉదయం తొమ్మిది గంటలయింది. విమానం హాంగ్ కాంగ్ లో ఆగింది. యిండియాకి తిరిగి వెళ్ళాక ఆయనకి ఉత్తరం రాసేందుకు నేనాయనని విజిటింగ్ కార్డ్ ఇమ్మని అడిగాను. చిరునవ్వుతో తన విజిటింగ్ కార్డ్ ఇచ్చి ఆయన విమానం దిగి వెళ్ళిపోయాడు.
హాంగ్ కాంగ్ లో కొద్ది సేపు ఆగిన తరువాత విమానం ఆఖరికి మధ్యాహ్న్నం ఒంటిగంటకు సియోల్ పట్టణం చేరింది. (అక్కడి స్థానిక టైము 1.00 పి.ఎం.) సియోల్ నుంచి నేను, నా తోటి ఆఫీసరు పుసాన్ నగరానికి వెళ్ళే విమానంలోకి యెక్కాము. పుసాన్ నగర ఏర్ పోర్ట్ లో మమ్మల్నిసామీ కంపనీ అధికారులు స్వాగతం పలికి రోడ్డు మార్గం ద్వారా చాంగ్ వన్ నగరానికి తీసుకుని వెళ్ళాడు. అప్పుడు సాయంత్రం 6.30 అయింది (అక్కడి సమయం) నేను హోటలుకు వెళ్ళి విశ్రాంతి తీసుకున్నాను. రాత్రి 8 గంటలకి మా సామీ కంపనీ అధికారి వచ్చి మమ్మలిని రాత్రి భోజనానికి రమ్మని పిలిచాడు. నేనతనితో ఒక అరగంట వేచి ఉండమని బాబాకు రాత్రి ఆరతిపూర్తి చేసుకుని వస్తానని చెప్పాను. అతను వేచి ఉండటానికి అంగీకరించాడు. నేను సాయి బాబాకి శేజ్ ఆరతి పూర్తి చేశాను. ఆరతి సమయంలో, చాంగ్వన్ లో కూడా నువ్వున్నావనే భావం కలిగించమని సాయిని ప్రార్థించాను.
ఆరతి అయిన తరువాత సామీ కంపనీ అధికారి హోటలు రూము బాల్కనీలోకి తీసుకుని వెళ్ళి దీపాల కాంతిలో చాంగ్ వన్ పట్టణాన్ని చూపించడం మొదలుపెట్టాడు. దగ్గలో ఉన్న మరొక హోటలు మీద సాయి (SAI) అని పెద్ద నియాన్ అక్షరాలతో చూసి ఆశ్చర్య పోయాను.
నేను సామీ కంపనీ అధికారిని సాయి అక్షరాల గురించి అడిగాను. అతను సాయి గురించి ఏమీ చెప్పలేకపోయాడు, కానీ నన్ను ఆప్రదేశానికి తీసుకుని వెడతానని మాటిచ్చాడు. నన్నతను హోటలు దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. నేను సాయి అన్న నియాన్ అక్షరాలను స్పష్టంగా చూడగలిగాను, కాని మిగతా అక్షరాలు మెరవటల్లేదు. నేను నియాన్ అక్షరాల దగ్గిరగా వెళ్ళి చూసేటప్పటికి అది సలూన్ (SALOON). నేను సామీ కంపనీ అధికారి ని సలూన్ అంటే అర్థమేమిటని అడిగాను. అతను సలూన్ అంటే బార్ అని చెప్పి అక్కడ విశ్రాంతిగా కూర్చుని బీరు తాగవచ్చని చెప్పాడు. నా కోరికని తీర్చడానికి సాయి నియాన్ అక్షరాల రూపంలో కనిపించి, తాను ఈ భూగోళంమీద ప్రతీచోటా ఉన్నానని నిరూపించాడు. దక్షిణకొరియాలో నా అధికారిక పని ముగిసిన తరువాత 21.05.1991 న నేను హైదరాబాదుకి తిరిగి వచ్చాను. హాంగ్ కాంగ్ వరకూ నాతో పాటు ప్రయాణించిన పెద్దమనిషికి రెండు ఉత్తరాలు వ్రాశాను, కాని అతని నుంచి నాకు సమాథానం రాలేదు. నాకు ఏ సమాథానం రాకపోయేటప్పటికి అతను సాయి అనిపించింది. అతనిచ్చిన విజిటింగ్ కార్డ్ చూశాను దానిమీద చిన్న సైజు భూగోళం ఎంబ్లం చూశాను. ఈ విశ్వంలో సాయి ప్రతీచోటా ఉన్నాడనిపించింది.
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- సాయిబానిస(శ్రీ రావాడ గోపాలరావు) గారి అనుభవాలు — 1(a)
- సాయిబానిస(శ్రీ రావాడ గోపాలరావు) గారి అనుభవాలు — 3
- సాయిబానిస(శ్రీ రావాడ గోపాలరావు) గారి అనుభవాలు — 4
- సాయిబానిస(శ్రీ రావాడ గోపాలరావు) గారి అనుభవాలు — 2
- నా సాయినాధుల వారే ఈటిక్కట్టు కలెక్టరు పై అధికారి రూపములో వచ్చి నన్ను ఆ కష్టము నుండి రక్షించి నన్నుఆశీర్వదించారనే భావన కలిగింది–సాయిబానిస(శ్రీ రావాడ గోపాలరావు). — 7–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments