బాబావారితోతార్ఖడ్ కుటుంబమువారి స్వీయానుభూతులు ఇరవై మూడో భాగం



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు 

రచయిత స్వంత అనుభవాలు

వెలకట్టలేని మా నాన్నగారి అనుభవాలని చదివిన తరువాత, నేను కూడా స్వంతంగా నా అనుభవాలను మూటకట్టుకుని వుండచ్చనే ఆసక్తితో మీరుంటారని నాకు ఖచ్చితంగా తెలుసు. నేనొకసారి ఒక మహిళా భక్తురాలికి ఒక అనుభవాన్ని వివరించాను. మా నాన్నగారి ఆథ్యాత్మిక అనుభవాలలాంటి విలువైన భండాగారం నాకు కలిగి ఉండకపోవచ్చని అందామె. కాని నేను అటువంటి పుణ్యాత్మునికి జన్మించడంవల్ల, ఆయననుంచి వారసత్వంగా లేశమాత్రమైనా పుణ్యాన్ని పొంది ఉండచ్చనీ అంచేత ఈ యుగంలో సాయి భక్తులందరికీ వివరించడానికి యోగ్యమైన కొన్ని అనుభవాలు ఖచ్చితంగా కలిగే ఉంటాయని అంది ఆమె.

ఈ విథంగా నేను ఆ పుణ్యాన్ని వారందరికీ పంచగలను. ఆ మహిళా భక్తురాలు యిచ్చిన ఆ ప్రత్యుత్తరం నన్ను కదిలించడంతో నాదృష్టిలో యింతవరకు నాకు కలిగినవి చిన్నవైనా, అల్పమైనవైనా సరే మీకందరికీ నేను తెలియ చేస్తున్నాను. ఈ విథంగా నేను నా “సాయి ప్ర్రితి” ని నా వైపునించి సాయి సేవగా స్పష్టం చేస్తున్నాను.

నా పూర్తి పేరు వీరేంద్ర జ్యోతీంద్ర తార్ఖడ్. మా పేర్ల వెనుక ఒక చిన్న కథ ఉంది. మా ముత్తాతగారు తన కొడుకులందరికీ మొదటి పేరు చివర “ద్ర’ వచ్చేటట్లుగా పెట్టారు. ఈ సిథ్థాంతానికి మూల కారకులు నోబెల్ గ్రహీతయిన కీర్తిశేషులు శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ తప్ప మరెవరూ కాదు. యునైటెడ్ కింగ్ డం కి వెళ్ళేముందు ఆయన చౌపాతీ బంగళాలో మా ముత్తాతగారితో ఉన్నప్పుడు జరిగిందిది. ఆ కాలంలో తార్ఖడ్ కుటుంబానికి ఆంగ్లేయుల అచార వ్యవహారాలన్ని బాగా తెలుసును కాబట్టి వారినుంచి తాను తెలుసుకోవాలనె యోచనతో వచ్చారు. రవీంద్రనాధ్ ఠాగూర్ గారికి జ్యోతిష్యం అంటే చాలా యిష్టం. ఆయన అందులో చాలా లోతుగా అథ్యయనం చేశారు. ఆయన మా ముత్తాతగారి “కుండలీ (జాతక చక్రం) వేసి, తార్ఖడ్ వారంతా కూడా లార్డ్ యింద్రనుంచి ఆవిర్భవించారనీ అందుచేత వారంతా (మగవారంతా) ఆ పేరుతోనే గుర్తింపుతో ఉండాలనీ చేప్పారు. ఆ విథంగా కొడుకులకి ఆ విథంగా పేర్లు పెట్టడానికి ఆయన అలా మా ముత్తాతగార్ని ప్రభావితం చేశారు. మా ముత్తాతగారు దానికి ఒప్పుకుని ఉండచ్చు. ఆయన తన కొడుకులకి రామచంద్ర (మా తాతగారు) ధ్యానేంద్ర వగైరా.; మా తాతగారు తన కొడుకులకు సత్యేంద్ర, జ్యోతీంద్ర (మా నాన్నగారు) గా నామకరణం చేశారు. తరువాత జ్యోతీంద్ర తన కొడుకులకి రవీంద్ర (నా అన్నగారు), వీరేంద్ర (నేను). రవీంద్ర తన కొడుకులకి దేవేంద్ర అని, నేను నా కొడుకుకు మహేంద్ర అని పేర్లు పెట్టడం జరిగింది.

నా చిన్నతనం నించీ నేను మా యింట్లో ప్రతి గురువారం సాయంత్రం జరిగే సాయిబాబా ఆరతికి హాజరవుతూ ఉండేవాడిని. ఆ సాంప్రదాయం యిప్పటికీ కొనసాగుతోంది. అదృష్టవశాత్తు నా భార్య కూడా సాయి భక్తురాలు. ఆమె తన 5 వ సంవత్సరం వయసు నుంచి, షిరిడీకి వెళ్ళి దర్శనం చేసుకుంటొంది. నేను మొట్టమొదటి సారిగా నాకు 18 సం. వయసప్పుడు షిరిడీని, నా యిద్దరు స్నేహితులు అమర్ భాగ్ తాని, శశి భాటియాలతో దర్శించాను. వివాహం అయిన తరువాత నేను మా అత్తవారి ఫ్లాట్ లో నివసించడం మొదలెట్టాను. నా భార్య 5 సం. వయసులో తన తండ్రిని పోగొట్టుకుంది. ఆడవాళ్ళు యిద్దరే అవడంతో ఒక మగ తోడు అవసరమయింది. మా అత్తగారు, భార్య యిద్దరూ కూడా సాయి భక్తులవడంతో నా సాయి సంస్కారాలకి యెటువంటి ఆటంకం కలగకుండా నిజానికి యింకా యింకా యెక్కువ పెరిగింది.

షిరిడీలో గురు పూర్ణిమ

నాకు బాగా గుర్తున్నంతవరకు, షిరిడీలో గురుపూర్ణిమ ఉత్సవాలకి నేను మా అత్తగారితో కూడా కలిసి వెళ్ళడం ప్రారంభించి ఆ క్రమంలో 18 గురు పూర్ణిమలకి హాజరయాను. గురు పూర్ణిమ ఉత్సవాలు మూడు రోజులపాటు జరుగుతాయని మీకు తెలుసు. అందులో ఒకటి అఖండ పారాయణ, అంటే నిరంతరం ‘సాయి సచ్చరిత్ర” ను చదవడం. సాయి భక్తులందరూ తమ తమ పేర్లు యిస్తే ఒక పిల్లవాడి ద్వారా, యధేచ్చగా 54 పేర్లు తెసి, ద్వారకామాయిలో బాబా చిత్ర పటం ముందు ‘సాయి సచ్చరిత్ర’ లో యెవరు ఏ అథ్యాయం చదవాలో నిర్ణయిస్తారు. అలా ఒక గురు పూర్ణిమనాడు నేను కూడా నా పేరు ఇచ్చాను. నాకు 9 నంబరు కేటాయించబడింది. దీనర్థం నేను 9 వ.అథ్యాయం చదవాలి. యిందులోనే సాయి మీద తార్ఖడ్ కుటుంబంవారి ప్రేమ, భక్తి గురించిన వివరణ ఉంది. అది నాకు మహదానందమయిందంటే నమ్మండి. ద్వారకామాయిలో చదవడం పూర్తయాక నాకు ఒక కొబ్బరికాయ, లార్డ్ సాయి ఫొటో, ప్రసాదంగా లబించింది. ఈ ఫొటొని లామినేషన్ చేయించి, ఫ్రేం కట్టించి మా యింట్లో ప్రతిరోజూ పూజ చేసుకోవడానికి ఉంచాము. ఈ రోజు వరకు నేను పొద్దున్నే మంచం మీదనించి దిగగానే ఈ ఫొటో ముందు నిలబడి నమస్కారం చేసుకుని లార్డ్ సాయిని హేచి దానా దేగా దేవా తుఝా వీసేర నా వ్హావా (ఓ లార్డ్ నేను నిన్నెపుడు మరవకుండా ఉండే, ఇదే వరమివ్వు) అని ప్రార్థిస్తాను.

విజ్యోత్ ఆవిర్భావం

ప్రియమైన పాఠకులారా, మనలో ప్రతి ఒక్కరం కూడా అతనిలో/ఆమెలో ఒక బలీయమైన కోరికని మోస్తూ ఉంటామని నా అభిప్రాయం. మా నాన్నగారు తనకు ఒక బంగళా, కారు, ఒకస్టొర్ రూం మట్టిపాత్రలన్నీ తినే ఆహార పదార్థాలతో నిండివుండి వీటన్నిటితో తాను కూడా ఒక థనవంతుడిననీ మాకు గుర్తు చేస్తూ ఉండేవారు. ఆయన జీవితం తరువాతి దశలో అవన్నీ మృగ్యమయిపోయాయి. నేను ఆయనకి ఆఖరి సంతానం. అందుచేత భగవంతుని దయతో నా స్వశక్తితో బాగా కష్టపడి పోగొట్టుకున్న సంపదనంతా మరలా సంపాదించాలనే బలీయమైన కోరికని సహజంగా నే మోశాను. బొంబాయిలో స్వంతంగా బంగళా కలిగి ఉండటమంటే అసాథ్యమయిన పని. నా భార్య కూడా ఖర్ లో బంగళాలోనే పెరిగింది. అందు చేత స్వంతంగా ఒక బంగళా ఉండాలనీ, కనీసం వార్థక్యంలోనయినా సుఖంగా జీవిద్దామని మాయిద్దరిదీ ఒకటే కోరిక.

1991 లో మేము వెంగాన్ లో (ముంబాయినుంచి 100 కి.మీ. దూరంలో వెస్ట్రన్ రైల్వే స్టేషన్) 6 గుంటలలో (726 చ.అ.) ఒక ప్లాటు కొన్నాము. నేను నా కంపెనీలో ఋణం తీసుకుని 1960 వెంగాన్ లోఒక బంగళా కట్టుకోగలిగాము. దానికి “విజ్యోత్” అని పేరు పెట్టుకున్నాము. 1960 కి వెనుక తిరిగి చూసుకుంటే నేను పూనా వెళ్ళాను. నా స్కూలు స్నేహితుడు నాకు “లకాకీ’ అనే బంగళా చూపించాడు. ఆ బంగళా ప్రముఖ పారిశ్రామిక వేత్తయిన లక్ష్మణరావ్ కాకాసాహెబ్ కిర్లోస్కర్ గారిది. మీరు ఆ పేరుకు వెనక ఉన్న రహస్యం తెలుసుకోవచ్చు. ఆయన పేరులోని మొదటి అక్షరాలు ల–క–కి–, 1959 లో ఆర్థిక యిబ్బందులవల్ల ఖర్ లో ఉన్న మా బంగళాని అమ్మవలసి వచ్చింది. 16 సం.క్రితం లకాకీ ని చూశాక నేనెప్పుడు బంగళా కట్టుకున్నా దానికి ‘విజ్యోత్’ అని పేరు పెట్టాలనే ఒకే ఆలోచన నాకప్పుడు కలిగింది.

రేపు తరువాయి భాగం…

ఈ సమాచారం http://telugublogofshirdisai.blogspot.in/ ద్వార సేకరించబడింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “బాబావారితోతార్ఖడ్ కుటుంబమువారి స్వీయానుభూతులు ఇరవై మూడో భాగం

kishore Babu

Thank you so much Sai Suresh..

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles