Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
తాతమ్మకు సాయి దర్శనమగుట
ప్రియమైన సాయి భక్త పాఠకులారా, మారాఠీలో సామెత చెప్పినట్లుగా, ఆ 17 షిరిడీ యాత్రలలో యెన్నో అనుభవాల సంపదని ఆయన తన స్వంతం చేసుకున్నారు. ఆయన ఆథ్యాత్మిక స్థితిలోకి వెళ్ళినప్పుడెల్లా ఆ అనుభవాలని వివరిస్తూ మమ్మల్ని ఆనంద పరుస్తూ ఉండేవారు. అందులో ఆయన అమితానందం పొందేవారని నాకు తెలుసు. మరొకసారి నేననుకునేదేమిటంటే ఆయన వాటిని రాసి ఉండవసిందని. నేను తిరిగి గుర్తు చేసుకునే స్థితిలోనే ఉన్నందువల్ల వాటిలో కొన్ని బాగా చెరగని ముద్ర వేసిన వాటిని నేను మీకు వివరిస్తాను. నా అబిప్రాయాలు షిరిడీ సాయిబాబా వారి యొక్క గొప్ప నైపుణ్యాన్ని సాయి భక్తులందరికీ తెలియచేయాలనీ, అలా చేస్తూ ఆయన మీద నా భక్తిని తెలుపుకునే ప్రయత్నం కూడా.
చార్నీ రోడ్ చౌపతీ (గిర్ గాం బీచ్) లో తమ స్వంత బంగళాలో ఉంటున్న మా తాత ముత్తాతలకి, రామచంద్ర (మా తాతగారు), జ్యోతీంద్ర (మా నాన్నగారు) తరచుగా షిరిడీకి వెడుతున్నారని తెలిసింది. తండ్రీ, కొడుకులిద్దరూ బాంద్రా లోని టాటా బ్లాక్స్ లో అద్దెకు ఉంటున్నందున వారు అప్పుడప్పుడు వారిని కలుసుకుంటూ ఉండేవారు. మా తాత ముత్తాతల జీవన విథానం అప్పటి ఆంగ్లేయుల పథ్థతిలో ఉండేది. యేమయినప్పటికీ మా తాతమ్మగారికి బాగా జిజ్ఞాస యెక్కువ. మానాన్నగారు వారిని చూడటానికి చౌపాతీ వచ్చినప్పుడెల్లా ఆవిడ షిరిడీ సాయిబాబా గారి గురించి ఆయన లీలల గురించీ అడుగుతూ ఉండేవారు.
ఆవిడ తనని కూడా షిరిడీకి తీసుకు వెళ్ళి సాయి దర్శనం చేయించమని ఆయనని అడుగుతూ ఉండేవారు. మా నాన్నగారు యెప్పుడూ ఆవిడకి మాట యిస్తూ ఉండేవారు. ఆయనకది జరిగే పని కాదని తెలుసు. కారణం ఆయన తాతగారు అటువంటి యాత్రకి యెప్పుడూ వెళ్ళనివ్వరు. ఆవిడ వయస్సు డభ్భై పైన. తాతగారికి బాబాలన్నా,సాథువులన్నా నమ్మకం లేదు. ఒకసారి ముంబాయిలో భయంకరమైన ప్లేగు వ్యాథి ప్రబలింది. వైద్యులు ఆ భయంకరమైన వ్యాథిని నివారించడానికి అప్పటివరకూ సరైన ముందుని కనుక్కోలేదు. మా తాతమ్మగారికి జ్వరం వచ్చింది. వైద్యులయిన ఆవిడ భర్త వైద్యం చేస్తున్నప్పటికి మంచి గుణం ఏమీ కనపడలేదు. . ఆవిడ సుస్తీ గురించి తెలిసి మా నాన్నగారు వారింటికి వెళ్ళారు. అలా వెళ్ళినపుడు మా తాతమ్మ మా నాన్నగారితో తనా ప్లేగు వ్యాథినుంచి బయట పడలేననీ తనని రక్షించమని సాయిబాబాని ప్రార్థించమని మా నాన్నగారికి చెప్పారు. తానప్పుడు షిరిడీ వచ్చి ఆయన దర్శనం చేసుకుంటానని చెప్పారు. ఆమెకు బాబా మీద స్వచ్చమైన నమ్మకం ఉంటే మంచం మీద నుండే బాబాని ప్రార్థించవచ్చని సలహా ఇచ్చారు. లార్డ్ సాయి తప్పకుండా వచ్చి ఆమెకు సహాయం చేస్తారని చెప్పారు.
మా నాన్నగారు చిన్న ఊదీ పొట్లం తీసి (యెప్పుడు తన పర్స్ లో పెట్టుకుంటారు) ఆమె తలగడ కింద పెట్టి, యింటికి వచ్చిన తరువాత, ఆమెకు నయం చేయమని బాబాని ప్రార్థించారు. మూడవ రోజున పొద్దున్నే చౌపాతీ బంగళానుంచి ఒక పనివాడు బాంద్రాకు వచ్చి జ్యోతిబా (మా నాన్నగారు) ని తనతో కూడా తీసుకు రమ్మని పంపారని చెప్పాడు. మా తాతగారు, నాన్నాగారు ఆందోళనపడి జరగరానిది యేదీ జరగకూడదని ప్రార్థించారు. వారు వెంటనె చౌపాతీకి బయలుదేరారు. వారక్కడికి చేరుకోగానే తాతమ్మగారు మంచం మీద కూర్చుని ఉండటం, వారిని జీవితంలో కదిలించింది. ఆవిడ కన్నీళ్ళతో నిండి వుంది. “జ్యోతిబా, కిందటి రాత్రి సాయిబాబా యిక్కడికి వచ్చారు. ఆయన కాషాయ దుస్తులు థరించి తలకు తెల్లని గుడ్డ కట్టుకుని వున్నారు. ఆయనకి తెల్లని గడ్డం ఉంది. ఆయన నా మంచం దగ్గిర నుంచుని ఊదీతో ఉన్న ఆయన అఱచేతిని నా నుదిటిమీద వుంచి “అమ్మా యిప్పటినుంచీ నీకు నయమవడం మొదలవుతుంది. నయమవుతుంది” అని ఆయన అదృశ్యమయిపోయారు” ఆ తరువాత నాకు బాగా చెమటలు పట్టి నా జ్వరం యెగిరిపోయింది. పొద్దుటే నేను మామూలుగా ఉన్నాను. నేను నా పళ్ళు కూడా తోముకోకుండా పనివాడిని అద్దం తెమ్మని అడిగాను. నా మొహం చూసుకున్నాక నా నుదిటిమీద ఆయన ఊదీతో ఉన్న అఱచేయి ముద్రని స్పష్టంగా చూశాను. అప్పుడే నేను పనివాడిని నిన్ను తీసుకు రమ్మని పంపించాను. యిప్పుడు నువ్వే చూడు” అన్నారు తాతమ్మగారు. తాతమ్మగారి, మనవడి సంతోషానికి అవథులు లేవు. ఆక్షణంలో మా నాన్నగారు అప్పటికప్పుడే లార్డ్ సాయికి ఆయన చేసిన భగవత్ సేవలకి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. డా.తార్ఖడ్ (ముత్తాత) గారు కూడా ఆశ్చర్యపోయారు, కారణం ప్లేగు సోకిన ఆయన రోగులు చాలా మంది బతికి లేరు. వారు తమ బంగళాలో దాసగణు కీర్తనని ఏర్పాటు చేశారు. దానివల్ల తాతమ్మగారికి అప్పటికే సాయి దర్శనం అయింది. లార్డ్ సాయి తమంత తానుగా ఆమె కోరికను తీర్చారు. సాయీ నీకు మా కృతజ్ఞతలు తెలుపుకోవడానికి నాకు మాటలు చాలవు. దయచేసి మా అందరిమీద నీ దివ్యమైన ఆశీస్సులు యెప్పుడూ కురిపిస్తూ ఉండు.
ప్రియమైన సాయి భక్త పాఠకులారా తార్ఖడ్ కుటుంబంలోని ఈ స్వీయ అనుభవంతో నేను ఈ అథ్యాయాన్ని ముగించదలచుకున్నాను. యికముందుకు వెళ్ళబోయేముందు, మేము దాదా అని పిలిచే మా నాన్నాగారి ఆత్మకు, విలువకట్టలేని ఆయన అనుభవాలని వివరించడంలో యక్కడయినా దాటవేసినా, యేమయినా తప్పులు చేసినా మనఃస్పూర్తిగా క్షమించమని, నేను వినయంగా ప్రార్థిస్తున్నాను.
ఆయన ఆత్మ యెక్కడున్నా సరే నన్ను క్షమిస్తుందని నాకు తెలుసు. కారణం ఈ పుస్తకం రాయడానికి ముఖ్య ఉద్దేశ్యం ప్రత్యేకంగా దాదాకి నమస్కరించడానికి ఆయన జీవించి ఉండగా నేను చేయలేనందుకు. అసలు చేయలేకపోవడంకన్నా ఆలశ్యంగా నయినా చేయడం మంచిదని నా ఉద్దేశ్యం.
రేపు తరువాయి భాగం…
ఈ సమాచారం http://telugublogofshirdisai.blogspot.in/ ద్వార సేకరించబడింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- బాబావారితోతార్ఖడ్ కుటుంబమువారి స్వీయానుభూతులు ఎనిమిదివ భాగం
- బాబావారితోతార్ఖడ్ కుటుంబమువారి స్వీయానుభూతులు ఇరవైయవ భాగం
- బాబావారితోతార్ఖడ్ కుటుంబమువారి స్వీయానుభూతులు ఇరవై రెండో భాగం
- బాబావారితోతార్ఖడ్ కుటుంబమువారి స్వీయానుభూతులు పదహేనవ భాగం–Audio
- బాబావారితోతార్ఖడ్ కుటుంబమువారి స్వీయానుభూతులు ఎడవ భాగం
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “బాబావారితోతార్ఖడ్ కుటుంబమువారి స్వీయానుభూతులు పదహేడవ భాగం”
kishore Babu
August 22, 2016 at 5:17 pmThank you So much Sai Suresh..